Begin typing your search above and press return to search.

హెల్త్ సెక్రటరీ బిగ్ డౌట్... 'ట్రంప్ ఇంతకాలం ఎలా బ్రతికి ఉన్నారో'..!

అవును... అమెరికా అధ్యక్షుడి తిండికి సంబంధించిన క్రమశిక్షణపై హెల్త్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్. కెన్నడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Raja Ch   |   15 Jan 2026 6:00 AM IST
హెల్త్ సెక్రటరీ బిగ్ డౌట్... ట్రంప్ ఇంతకాలం ఎలా బ్రతికి ఉన్నారో..!
X

మీడియాకు ఫుల్ మీల్స్ ఇచ్చే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన గురించిన పలు అంశాలపై చర్చ నిత్యం హాట్ టాపిక్ అనే చెప్పాలి. తాజాగా.. వెనుజువెలకు తానే తాత్కాలిక అధ్యక్షుడినని.. ఆందోళనకారులకు మరణశిక్ష విధిస్తే సరికొత్త విషయాలు చూస్తారని ఇరాన్ ని.. ‘గ్రీన్ ల్యాండ్ విలీనం - రాష్ట్ర హోదా’ అనే బిల్లుతో ఆ దేశాన్ని డిస్ట్రబ్ చేస్తూ హల్ చల్ చేస్తున్న ట్రంప్.. ఆరోగ్యం గురించి హెల్త్ సెక్రటరీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి వైరల్ గా మారుతున్నాయి.

అవును... అమెరికా అధ్యక్షుడి తిండికి సంబంధించిన క్రమశిక్షణపై హెల్త్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్. కెన్నడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీ మిల్లర్ తో ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడిస్తూ.. ఆయన మార్-ఎ-లాగోలో, వైట్ హౌస్ లో ఉన్నప్పుడు ఆరోగ్యంగా తింటారని కెన్నడీ అన్నారు. అయితే బయటకు వెళ్లినప్పుడు మాత్రం కథ అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని.. ఆయన నేరుగా పాస్ట్ ఫుడ్ పై పడతారని తెలిపారు. అతనితో ప్రయాణించే వ్యక్తులు.. ఆయన రోజంతా విషంతో నిండి ఉన్నాడని అనుకుంటారని వ్యాఖ్యానించారు.

కెన్నెడీ ప్రకారం.. ట్రంప్ ప్రయాణిస్తున్నప్పుడు అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి సుపరిచితమైన బ్రాండ్‌ ల వైపు మొగ్గు చూపుతారని.. నమ్మిన ఆహారాన్ని తింటారని.. మెక్‌ డొనాల్డ్స్, ఇతర పెద్ద సంస్థలను చూపిస్తూ అన్నారు. బయటకు వెళ్లినప్పుడు ఆయన తినే ఆహారం గురించి చూసినప్పుడు.. అతనికి దేవతలకు సంబంధించిన నిర్మాణం ఉన్నట్లుంది అనిపిస్తుంటుందని.. మరికొన్ని సందర్భాల్లో అతను ఎలా ఇంకా బ్రతికి ఉన్నాడో నాకు తెలియదని.. కానీ అతను ఉన్నాడని కెన్నడీ సరదాగా వ్యాఖ్యానించారు.

కాగా.. 79 ఏళ్ల ట్రంప్ తన రెండో పదవీకాలం ముగిసే సమయానికి 82 ఏళ్లు నిండినివారవుతారు.. దీంతో మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ తరహాలోనే ట్రంప్ కూడా వృద్ధాప్య సంకేతాలపై ప్రజల నిశిత పరిశీలనను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ది వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన వయసు, ఓర్పు, శారీరక రూపం గురించి వస్తోన్న ఆందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. ఇక సమావేశాల సమయంలో నిద్రపోవడం అనే విమర్శను ఖండించిన ట్రంప్.. తాను రెప్ప వేసేలోపు.. వారు దాన్ని రెప్పపాటులో బందిస్తారని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ట్రంప్.. తాను ప్రతిరోజూ సుమారు 325 మిల్లీగ్రాముల ఆస్పిరిన్ తీసుకుంటానని వెల్లడించాడు. ఇది వైద్యులు సాధారణంగా సిఫార్సు చేసే దానికంటే ఎక్కువ మోతాదని.. ఇది తన రక్తాన్ని మంచిగా ఉంచడంలో సహాయపడుతుందని తెలుపారు. ఇక తాను మేకప్ వేసుకోవడం చాలా సులభమని.. కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే అందుకు పడుతుందని తెలిపారు. ఏది ఏమైనా... మూడోసారి ఆ కుర్చీ ఎక్కాలని సైతం కోరుకుంటున్నారనే చర్చ నడుమ.. తాజా చర్చ ట్రంప్ కు గతంలో బైడెన్ కు తెచ్చిన సమస్యలు తెచ్చిపెడతాయనడంలో సందేహం ఉండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు.