అధ్యక్షుడు ట్రంప్ అలా.. జూనియర్ ట్రంప్ ఇలా
భారతదేశంపై కక్ష కట్టి సాధింపులకు పాల్పడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పన్నుల బాదుడుతో చాలా పరిశ్రమలు మూతపడేలా అతడి కార్యాచరణ భయాందోళనలకు గురి చేసింది.
By: Sivaji Kontham | 21 Nov 2025 6:36 PM ISTభారతదేశంపై కక్ష కట్టి సాధింపులకు పాల్పడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పన్నుల బాదుడుతో చాలా పరిశ్రమలు మూతపడేలా అతడి కార్యాచరణ భయాందోళనలకు గురి చేసింది. ముఖ్యంగా జాబ్ మార్కెట్లో ఇది పెను ప్రకంపనంగా మారింది. అయితే ట్రంప్ భీభత్సం ఇలా ఉంటే, అతడి కుమారుడు మాత్రం శాంతియుతమైన భారతదేశ పర్యటనలో ఫుల్ గా ఆస్వాధనలో ఉన్నాడు. అతడు తొలుత తాజ్ మహల్ ని సందర్శించి ఆ చారిత్రక స్థలం ప్రత్యేకతను తెలుసుకునేందుకు గంట పైగా గడిపాడు.
ఇంతలోనే గుజరాత్ `వంటారా`లోని అనంత్ అంబానీ ఫామ్ హౌస్ లో దాండియా ఆడుతూ కనిపించాడు. గుజరాత్ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దాండియా కోసం అతడు చిడతలు పట్టుకుని లయబద్ధంగా శరీరాన్ని కదుపుతూ ఆడిపాడాడు. ట్రంప్ జూనియర్ తో పాటు అతడి ప్రియురాలు బెట్టినా అండర్సన్ కూడా అంబానీ కుటుంబ వేడుకల్లో పాల్గొన్నారు. వారితో పాటు వచ్చిన బృందం కూడా దాండియా ఆడటంలో నిమగ్నమైంది. ఈ వేడుకలు ఆద్యంతం అనంత్ అంబానీ- రాధిక దంపతులు వారికి కంపానియన్స్ గా ఉన్నారు. గర్భా, దాండియా నృత్యం చేస్తూ వారు కూడా ఆహ్లాదకర పండుగను కొనసాగించారు.
ఇలాంటి సాంప్రదాయ వేడుకలలో పాల్గొనడం ట్రంప్ జూనియర్ కి కొత్తగా ఉంటుందనడంలో సందేహం లేదు. భారతదేశ యాత్రలో అతడు చాలా విశేషాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటాడు. ముఖ్యంగా అందమైన సంస్కృతి సాంప్రదాయం విలువలను నేర్చుకుని వెళతాడు. అసలు కుటుంబ సాంప్రదాయం ఎలా ఉండాలో కూడా ట్రంప్ కుటుంబానికి తెలియాల్సి ఉంటుంది.
గుజరాత్ జామ్‌నగర్‌లో ఉన్న అనంత్ అంబానీ వన్యప్రాణుల రక్షణ - పునరావాస కేంద్రం అయిన `వంటారా` ప్రత్యేకతలను కూడా జూ.ట్రంప్ తెలుసుకున్నాడు. `వంటారా`లో ట్రంప్ జూనియర్ జంతువులను పెంచుతున్న కీలకమైన ఎన్‌క్లోజర్‌లను సందర్శించారు. సంరక్షకులతో కూడా సంభాషించారు. వంటారా అడవి పర్యవేక్షకుడు సందర్శకులకు గైడ్ గా వ్యవహరించారు. భారతదేశంతో పాటు, విదేశాలలోను అంతరించిపోతున్న జాతి జంతువులు, గాయపడిన జంతువులను సంరక్షించే ఏర్పాటు వంటారాలో ప్రత్యేకమైనది. దీనిని కూడా వారు సందర్శించారు. ఈ యాత్రలో వారంతా ఆలయాలను దేవుళ్లను సందర్శించారు. జూ.ట్రంప్, బెట్టినా జంట వినాయకుని ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఇక ఆలయాల వెలుపల చెప్పులు విడిచిపెట్టే సంస్కృతిని కూడా ట్రంప్ జూనియర్ కి అంబానీలు అలవాటు చేసారు. జూనియర్ ట్రంప్ తన దేశానికి తిరిగి వెళ్లగానే సంస్కృతి సాంప్రదాయాలు, అపరిమితమైన ప్రేమ, ఆథిత్యంతో ప్రపంచ శాంతి కాముక దేశంగా ఉన్న భారత్ గొప్పతనాన్ని తన తండ్రికి వివరించాలని కోరుకుందాం. అధ్యక్షుడైన ట్రంప్ మైండ్ సెట్ ని కనీసం ఆయన సుపుత్రుడు అయినా మార్చగలుగుతాడని ఆశిద్దాం.
