Begin typing your search above and press return to search.

నీకు దండం సామీ.. మాటలు.. ట్వీట్లు ఆపుతే ప్రపంచానికి మంచిది ట్రంప్

ఒక మూర్ఖుడు.. దుందుడుకుతనమున్న వ్యక్తి.. తన దేశాన్ని ప్రపంచంలో మరింత పవర్ ఫుల్ గా మారాలన్న మాటలు చెప్పి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రపంచానికి పరేషాన్ గా ఎలా మారారన్న వైనం ట్రంప్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

By:  Garuda Media   |   19 April 2026 12:36 PM IST
నీకు దండం సామీ.. మాటలు.. ట్వీట్లు ఆపుతే ప్రపంచానికి మంచిది ట్రంప్
X

ఒక మూర్ఖుడు.. దుందుడుకుతనమున్న వ్యక్తి.. తన దేశాన్ని ప్రపంచంలో మరింత పవర్ ఫుల్ గా మారాలన్న మాటలు చెప్పి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రపంచానికి పరేషాన్ గా ఎలా మారారన్న వైనం ట్రంప్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఎప్పుడు ఏం మాట్లాడతారో? సందర్భానికి ఏ మాత్రం సూట్ కానట్లుగా మాట్లాడి విషయాన్ని మరింత కంగాళీ చేయటంలో ఆయనకున్న టాలెంట్ మరెవరికీ ఉండదనే చెప్పాలి. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కావొచ్చు.. కాల్పుల విరమణ కావొచ్చు. ఒక మాట అనుకున్న తర్వాత ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అందుకు భిన్నంగా.. తరచూ ఏదో ఒక పోస్టు.. ఏదో ఒక మాటతో అవతలివారికి ఒళ్లు మండేలా చేయటం.. వారు తీవ్రంగా రియాక్టు అయ్యేలా మారుతున్న పరిస్థితికి ట్రంప్ కారణంగా మారుతున్నారు.

తాజాగా ఇరాన్ విషయంలో అదే జరుగుతోంది. ఇజ్రాయెల్.. హెజ్ బుల్లా మధ్య పదిరోజుల కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ.. ఇరాన్ తన హోర్మూజ్ జలసంధిని తెరవటం తెలిసిందే. అయితే.. సంయమనంతో వ్యవహరించాల్సిన వేళ.. అందుకు భిన్నంగా ట్రంప్ చేస్తున్న ప్రకటనలతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది. ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామన్న ట్రంప్ వార్నింగ్ పై ఇరాన్ మంత్రి ఖతీబ్ జాదే తీవ్రంగా స్పందించారు.

ఎక్కువ ట్వీట్లు.. ఎక్కువ మాటలు.. ట్రంప్ చేసే ప్రకటనలు చాలా అయోమయంగా.. పరస్పర విరుద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్న ఇరాన్ మంత్రి.. అమెరికా నుంచి ట్వీట్లు ఎక్కువగా పేర్కొన్నారు. అవి కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయని పేర్కొంటూ.. ఇరాన్ తన మొండివైఖరి వీడనంత వరకు ముఖాముఖి చర్చలకు తాము సిద్ధంగా లేమని తేల్చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న ఆయన.. తమ దేశాన్నిచివరి సైనికుడి వరకు పోరాడి రక్షించుకుంటామన్నారు. తాజాగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలతో ఇరాన్ స్పందిస్తూ.. 24 గంటల వ్యవధిలోనే హోర్మూజ్ జల సంధి వద్ద ఆంక్షల్నిమొదలు పెట్టింది.

ఇదంతా చూస్తే.. ట్రంప్ నోటికి తాళం.. పోస్టులకు బంద్ పెట్టేలా చేయగలిగితే తప్పించి.. మరో మార్గం లేదన్నట్లుగా మారింది. ప్రపంచాన్ని పరేషాన్ చేస్తున్న ట్రంప్ తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయనమాటలు సమస్యలకు పరిష్కారం కంటే.. సమస్యల్ని మరింత పెంచేలా మారుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం కాస్త ప్రశాంతంగా మారాలంటే అయితే ట్రంప్ నోటికి తాళం పడేలాంటి పరిస్థితులు చోటు చేసుకోవాలి. లేదంటే.. ఆయన విషయంలో ప్రకృతి తనకు తాను కల్పించుకొని.. ఆయన ఫోకస్ మరో అంశాల మీద పెట్టేలా చేయాల్సి ఉంటుంది.