Begin typing your search above and press return to search.

సచ్చింది గొర్రె.. ఇరాన్ తో పీస్ డీల్ పై అమెరికాకు ఇజ్రాయెల్ షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఎంతో కష్టపడి.. హడావుడిగా ఇరాన్‌తో ఒక పీస్ డీల్ కుదిర్చేశారు.

By:  A.N.Kumar   |   15 Jun 2026 3:20 PM IST
సచ్చింది గొర్రె.. ఇరాన్ తో పీస్ డీల్ పై అమెరికాకు ఇజ్రాయెల్ షాక్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఎంతో కష్టపడి.. హడావుడిగా ఇరాన్‌తో ఒక పీస్ డీల్ కుదిర్చేశారు. ప్రపంచమంతా "అబ్బా.. ఇక యుద్ధం ముగిసింది బాస్" అని ఊపిరి పీల్చుకుంది. చమురు ధరలు తగ్గుతాయని మార్కెట్లు సంబరాలు చేసుకున్నాయి. పశ్చిమాసియా ఆకాశంలో శాంతి పావురాలు రెక్కలు విప్పడానికి రెడీ అయ్యాయి. సరిగ్గా అంతలోనే... సీన్‌లోకి ఇజ్రాయెల్ ఎంట్రీ ఇచ్చింది. ‘ట్విస్ట్’ అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా మొత్తం కథను తలకిందులు చేసేసింది!

మీ పెళ్లి ముచ్చట మీది.. మా దారి మాది!

ఇరాన్‌తో అమెరికా చేతులు కలిపితే మనకేంటి అన్నట్టుగా ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ ఒక రేంజ్‌లో డైలాగ్ కొట్టారు. "మీరు చేసుకున్న డీల్ మీది... మాకు దానితో అస్సలు పని లేదు" అంటూ అంతర్జాతీయ రాజకీయాల్లో బాంబు పేల్చారు. అమెరికాను మేము గౌరవిస్తాం, ట్రంప్ తాతతో మా సంబంధాలు బాగానే ఉంటాయని చెబుతూనే... "కానీ మా దేశ భద్రత విషయంలో మాకు మేమే బాస్‌లం" అని తెగేసి చెప్పారు.

రాజకీయ విశ్లేషకులు ఈ సీన్‌ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదెలా ఉందంటే... ట్రంప్ గారు పెళ్లి కొడుకులా ముస్తాబై పెళ్లి చేసుకుంటే ఆయన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇజ్రాయెల్ మాత్రం "నేను ఈ పెళ్లిని ఒప్పుకోను" అని మండపంలోనే గొడవ పెట్టుకున్నట్టు ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం కాగితాల మీద, ఫొటోల్లో చాలా అందంగా కనిపిస్తోంది కానీ నేల మీదకు వచ్చేసరికి ఇజ్రాయెల్ పెట్టిన అడ్డంకి చూస్తుంటే ఆ కాగితాలు ఎగిరిపోయేలా ఉన్నాయి.

అప్పుడే శాంతి పావురాలా? నో ఛాన్స్!

ఇజ్రాయెల్ మొదటి నుంచి ఒకే మాట మీద ఉంది. "మా జోలికి వస్తే ఎవడి పర్మిషన్ అడగం" ఇప్పుడు కూడా అదే చేసింది. ముఖ్యంగా లెబనాన్‌పై తమ సైనిక చర్యలను ఆపే ప్రసక్తే లేదని హింట్ ఇచ్చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో శాంతి వచ్చేసిందని బిర్యానీలు వండుకుందాం అనుకున్న దేశాలకు ఇజ్రాయెల్ ఒక గట్టి రిమైండర్ ఇచ్చింది. "పీస్ డీల్ కుదిరిందని పండగ చేసుకోకండి... అసలు సినిమా ఇంకా ముందుంది!" అంటూ ఒక్క ప్రకటనతో షాకిచ్చింది.

బాస్.. కథ ఇంకా ముగియలేదు

మొత్తానికి ట్రంప్ తన దౌత్య విజయంతో కాలర్ ఎగరేద్దాం అనుకునేలోపే ఇజ్రాయెల్ "మా గేమ్ మేము ఆడతాం" అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఫలితంగా పశ్చిమాసియా రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. అమెరికా కుదిర్చిన ఈ శాంతి ఒప్పందం భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచం శాంతి పావురాల కోసం ఎదురుచూస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం "యుద్ధ మేఘాలు ఇంకా మా తలపైనే ఉన్నాయి. వాటిని వదిలే ప్రసక్తే లేదు" అని తేల్చేసింది. చూస్తుంటే ఈ ‘పీస్’ డీల్ కాస్తా.. అమెరికాకు ‘పీస్ ఆఫ్ మైండ్’ లేకుండా చేసేలా కనిపిస్తోంది.