ట్రంప్ మాటకు నో.. తోలుబొమ్మలం కాదని తేల్చేసిన మిత్రదేశాలు
నేనేం అనుకుంటే అదే జరుగుతుంది. అగ్రరాజ్య అధినేత హోదాను ఇష్టారాజ్యంగా వాడేసిన డొనాల్డ్ ట్రంప్ కారణంగా.. ఈ రోజున ప్రపంచంలో అస్థిర పరిస్థితులు మాత్రమే.. ఆర్థిక అనిశ్చితికి కారణమైంది.
By: Garuda Media | 16 March 2026 6:23 PM ISTనేనేం అనుకుంటే అదే జరుగుతుంది. అగ్రరాజ్య అధినేత హోదాను ఇష్టారాజ్యంగా వాడేసిన డొనాల్డ్ ట్రంప్ కారణంగా.. ఈ రోజున ప్రపంచంలో అస్థిర పరిస్థితులు మాత్రమే.. ఆర్థిక అనిశ్చితికి కారణమైంది. ప్రపంచం కోరుకోని యుద్ధాన్ని ట్రంప్.. ఇజ్రాయెల్ అధినేతల కారణంగా మొదలు కావటం.. యావత్ ప్రపంచం ఏదో రూపంలో కిందా మీదా పడటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లు.. ఇరాన్ అధీనంలో ఉండే హర్మూజ్ జలసంధి వద్దకు మిత్రులు రావాలని..ఇరాన్ సంగతి చూడాలన్నట్లుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు.. మిత్ర దేశాలు ఎవరూ స్పందించని పరిస్థితి. అంతేనా.. తాము హర్మూజ్ జలసంధి వద్దకు రాలేమన్న విషయాన్ని ఆయా దేశాలు స్పష్టం చేశాయి.
ఇరాన్ యుద్దంతో దెబ్బ తిన్న హర్మూజ్ ను సురక్షితంగా ఉంచేందుకు వీలుగా.. అక్కడ ఇంధన రవాణాను క్రమబద్ధికరించేందుకు యుద్ధనౌకల్ని మోహరించాలని ట్రంప్ ఏడు మిత్ర దేశాల్ని కోరారు. ఇదిలా ఉండగా.. ఆయన పిలుపును ఏడింటిలో రెండు దేశాలు (ఆస్ట్రేలియా, జపాన్) రిజెక్టు చేశాయి. తాము ఎలాంటి నౌకల్ని పంపమని తేల్చేశాయి. హర్మూజ్ వద్దకు తాము ఎలాంటి నౌకల్ని పంపటం లేదని ఆస్ట్రేలియా వెల్లడించింది. మారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్లను పరిగణలోకి తీసుకోమని జపాన్ స్పష్టం చేసింది.
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. పశ్చిమాసియాలోని చమురుపై ఆధారపడేన దేశాలు హర్మూజ్ ను సేవ్ చేసేందుకు ముందుకు రావాలని ఒత్తిడి చేసినట్లుగా పేర్కొన్నారు. అయితే..ఆఏడు దేశాల వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. అయితే.. ట్రంప్ ప్రకటన తర్వాత స్పందించిన దేశాల్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశాలైన జాపాన్, ఆస్ట్రేలియాలు యుద్ధ నౌకల్ని పంపే ప్రణాళికలు ఏమీ లేవని స్పష్టం చేయటం ద్వారా.. షాకిచ్చాయని చెప్పాలి.
ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే ఆర్థికంగా.. సైనిక పరంగా ఇబ్బందుల్లో ఉన్న యూరోపియన దేశాలు.. ఇరాన్ తో నేరుగా ఘర్షణకు దిగేందుకు సిద్ధంగా లేవని చెబుతన్నారు. నాటో కూటమిని ట్రంప్ హెచ్చరించిన వైనాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. నాటో భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న ఆయన వార్నింగ్ నాటో దేశాల మీద ఎలాంటి ప్రబావాన్ని చూపలేదు. ఇది అంతర్జాతీయంగా అమెరికా పట్టు తగ్గుతుందన్న దానికి ఒక సంకేతమన్న చర్చ మొదలైంది.గతంలో అమెరికా పిలుపునిస్తే.. స్పందించే దేశాలు ఇప్పుడు తమ సొంత భద్రత.. ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వటం చూస్తే.. ట్రంప్ తరచూ ప్రస్తావించే అమెరికా ఫస్ట్ పాలసీకి దాని మిత్రదేశాలు ఇస్తున్న కౌంటర్ గా తాజా పరిణామాల్ని విశ్లేషిస్తున్నారు
ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకించిన జపాన్.. ఆస్ట్రేలియాతో పాటు.. బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాలు కొట్టిపారేశాయి. జలసంధించిన తిరిగి తెరవాల్సిన అవసరం ఉందని చెప్పిన బ్రిటన్ ప్రధాని.. తమ మిత్రదేశాలతో కలిసి ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నట్లుగా చెప్పారు. చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న చైనా.. అందుకు తగ్గట్లు యుద్ధాన్నివెంటనే ఆపాలని కోరటం గమనార్హం. మొత్తంగా ట్రంప్ పిలుపునిచ్చినంతనే.. అదేపనిగా హడాువుడి చేయకుండా.. తమ దేశ ప్రయోజనాలకు ఎంత మేలు జరుగుతుందన్న అంశానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న అంశం తాజా ఎపిసోడ్ స్పష్టం చేస్తుందని చెప్పాలి.
