Begin typing your search above and press return to search.

ట్రంప్ కు భారీ అవ‌మానం.. పెడో ప్రొటెక్ట‌ర్ అంటూ ట్రోల్

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కు చేదు అనుభ‌వం ఎదురైంది. మిచిగాన్ లోని ఫోర్డ్ ఆప‌రేష‌న‌ల్ ఫ్యాక్ట‌రీకి బుధ‌వారం ట్రంప్ వెళ్లారు.

By:  A.N.Kumar   |   15 Jan 2026 12:54 AM IST
ట్రంప్ కు భారీ అవ‌మానం.. పెడో ప్రొటెక్ట‌ర్ అంటూ ట్రోల్
X

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కు చేదు అనుభ‌వం ఎదురైంది. మిచిగాన్ లోని ఫోర్డ్ ఆప‌రేష‌న‌ల్ ఫ్యాక్ట‌రీకి బుధ‌వారం ట్రంప్ వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఆ కంపెనీలోని ఉద్యోగులను ట్రంప్ ను చూసి ట్రోల్ చేశారు. `పెడో ప్రొటెక్ట‌ర్ ` అంటూ కామెంట్ చేయ‌డంతో ట్రంప్ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. మిడిల్ ఫింగ‌ర్ చూపి` ఫ‌క్ యూ` అంటూ ఆ ఉద్యోగుల‌పై అరిచిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. అనంత‌రం ట్రంప్ ను ట్రోల్ చేసిన ఉద్యోగిని ఫోర్డ్ యాజ‌మాన్యం తొల‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆ ఉద్యోగి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను చేసిన ప‌నికి బాధ‌ప‌డ‌టం లేద‌ని, అదృష్టం త‌ర‌చూ రాద‌ని.. అది వ‌చ్చిన‌ప్పుడు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, తాను అదే ప‌ని చేశానంటూ మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రం.

పెడో ప్రొటెక్ట‌ర్ అంటే ?

వివాదాస్ప‌ద అంశాల్లో ఇరుకున్న జెఫ‌రీ ఎప్ స్టీన్ తో ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయ‌న్న‌ ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో.. పెడో ప్రొటెక్ట‌ర్ అంటూ ట్రంప్ ను ఉద్దేశిస్తూ ఫోర్డ్ ఉద్యోగి కామెంట్ చేశారు. జెఫ‌రీ ఎప్ స్టీవ్ ధ‌నవంతుడు. వ్యాపార‌వేత్త‌. అదే స‌మ‌యంలో సెక్స్ ట్రాఫికింగ్ ఆరోప‌ణ‌ల‌ కేసు ఉంది. చిన్న వ‌య‌సులో ఉన్న అమ్మాయిల‌ను సెక్స్ ట్రాఫికింగ్ చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎప్ స్టీన్ తో ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలోనే ఫోర్డ్ వ‌ర్క‌ర్స్ ట్రంప్ ను పెడో ప్రొటెక్ట‌ర్ అంటూ ట్రోల్ చేశారు.

ప్ర‌పంచ వ్యాప్త చ‌ర్చ‌..

ఫోర్డ్ ఉద్యోగి ట్రంప్ ను ట్రోల్ చేయ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా.. ఆ ఉద్యోగి కామెంట్లు చ‌ర్చనీయాంశ‌మ‌య్యాయ‌. అమెరికాలో అధికారంలోకి వ‌చ్చాక ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప్ర‌పంచ దేశాల‌పై టారిఫ్ ల పేరుతో ఆంక్ష‌లు విధిస్తున్న ట్రంప్ చ‌ర్య‌లు నిత్య వార్త‌లుగా మారిన నేప‌థ్యంలో.. ఓ సాధారణ ఉద్యోగి అమెరికా అధ్య‌క్షుడిని మొహం మీదే విమ‌ర్శ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారాయి. ఆ త‌ర్వాత కూడా ఆ ఉద్యోగి భ‌య‌ప‌డ‌కుండా.. తాను చేసిన ప‌నికి ఎలాంటి ప‌శ్చాత్తాపం లేద‌ని ప్ర‌క‌టించ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది.