అమెరికాపై భారతీయుల పునరాలోచన... మరో దేశం వెల్ కమ్ మెసేజ్ ఇదే!
వలసదారులపై ట్రంప్ చేస్తున్న నిరంతర దాడి వారిని వేరే గమ్యస్థానాలకు తీసుకెళ్లేలా చేస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
By: Raja Ch | 5 Oct 2025 12:12 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా కఠిన చర్యల వార్తలు ముఖ్యాంశాలుగా వచ్చే వరకు.. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ స్కాలర్ షిప్ పొందిన తర్వాత తన బ్యాగులను సర్దుకుంటోంది భారతీయ సమాజం. అయితే తాజాగా ఆ ప్రణాళికలను పలువురు భారతీయులు రద్దు చేసుకుంటున్నారని అంటున్నారు. వలసదారులపై ట్రంప్ చేస్తున్న నిరంతర దాడి వారిని వేరే గమ్యస్థానాలకు తీసుకెళ్లేలా చేస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... పెరుగుతున్న అమెరికా వీసా ఆంక్షల కారణంగా ప్రపంచ స్థాయి విద్య, లాభదాయకమైన కెరీర్ లు, మెరుగైన జీవన నాణ్యత అనే అమెరికన్ కల నెరవేరకుండా అడ్డుకుంటుందని.. వారి గమ్యస్థానాలను మారుస్తుందనే చర్చ ప్రధానంగా భారత్ లో బలంగా పెరిగిందని అంటున్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం.. రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత వీసాల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరే!
వాస్తవానికి దశాబ్దాలుగా హెచ్-1బీ వీసా అనేది సరికొత్త జీవితానికి ప్రవేశ ద్వారంగా ఉంది. ఇది.. భారతదేశం, చైనా, ఇతర దేశాల నుండి యువ ఇంజనీర్లు, వైద్యులు, నర్సులు, శాస్త్రవేత్తలకు వారి వారి చదువును అధిక జీతం ఇచ్చే ఉద్యోగాలుగా, శాశ్వత నివాసానికి అవకాశంగా మార్చడానికి ఒక అవకాశంగా ఉండేది. అయితే... గత వారం ట్రంప్ కొత్త వీసా దరఖాస్తులకు పెంచిన ఫీజులు పునరాలోచనలో పాడేస్తున్నాయి.
ట్రంప్ ఇటీవల కొత్త వీసా ధరఖాస్తుకు $1,00,000 ఖర్చవుతుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... మద్దతుదారులు హెచ్-1బీ వీసాలు కీలకమైన ప్రతిభను తీసుకురావడానికి కారణమని చెబుతుండగా.. ట్రంప్ మాత్రం ఇది వేతనాలను అణిచివేస్తుందని, అర్హత కలిగిన అమెరికా కార్మికులను పక్కనపెడుతుందని వాదిస్తున్నారు. ఈ ఆలోచనలే భారతీయుల పునరాలోచనకు కారణాలని అంటున్నారు.
భారతీయులకు జర్మనీ ఆహ్వానం!:
హెచ్1బీ వీసా ఫీజును అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్లకు పెంచడం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాలు భారతీయ నిపుణులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా నైపుణ్యం కలిగిన భారతీయులను తమ దేశంలోకి ఆహ్వానిస్తూ భారత్ లోని జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్ మన్ ఇటీవల పోస్టు పెట్టారు.
ఇందులో భాగంగా... అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులందరికీ ఇది మా ఆహ్వానం అని మొదలుపెట్టిన ఆయన... జర్మనీ దాని స్థిరమైన వలస విధానాలను కలిగి ఉందని.. దీంతో పాటు ఐటీ, సైన్స్, సాంకేతిక రంగాల్లో భారతీయులకు మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని.. తమ దేశంలో పనిచేసే భారతీయులు జర్మన్ ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారని తెలిపారు.
