నేనే 'బాస్'.. మోడీ 'కిల్లర్'.. ఓపెన్ అయిపోయిన ట్రంప్ తాత!
ట్రంప్ తాత అంతటితో ఆగాడా అంటే అస్సలు లేదు. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన రాగానే ఆయనలోని 'కవిత్వం'.. 'రాజకీయ చతురత' ఒక్కసారిగా బయటకు వచ్చాయి.
By: A.N.Kumar | 18 Jun 2026 9:46 AM ISTఆయన నోరు తెరిస్తే ఒక సెన్సేషన్.. ఆయన వేదికలెక్కితే అదో పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్. అవును.. మన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు. గ్లోబల్ లీడర్లంతా ముస్తాబై కూర్చున్న జీ7 సమ్మిట్ వేదికను కాస్తా.. తన వన్-మ్యాన్ షోకి థియేటర్‌గా మార్చేశారు. అసలే ప్రపంచ దేశాల అధినేతలంతా సూట్లు బూట్లు వేసుకుని సీరియస్‌గా డిస్కషన్లు పెడుతుంటే.. మన ట్రంప్ మాత్రం లేచి వస్తూ వస్తూనే "ఐ యామ్ ది బాస్!" అంటూ ఒక్కసారిగా డైలాగ్ కొట్టారు.
దీంతో పక్కనే ఉన్న మిగతా దేశాల లీడర్లకు మైండ్ బ్లాంక్ అవ్వడం కాదు.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక గుడ్లు తేలేశారట. నెటిజన్లు ఊరుకుంటారా? "అమెరికా ప్రెసిడెంట్ అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలి బాస్" అని కొందరు చెప్తుంటే "ఇదేం ఊరి పంచాయితీ కాదు తాత.. గ్లోబల్ సమ్మిట్" అంటూ మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు.
దేవదూత లాంటి ‘కిల్లర్’.. మోదీపై ట్రంప్ మార్క్ పొగడ్తలు!
ట్రంప్ తాత అంతటితో ఆగాడా అంటే అస్సలు లేదు. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన రాగానే ఆయనలోని 'కవిత్వం'.. 'రాజకీయ చతురత' ఒక్కసారిగా బయటకు వచ్చాయి. మోదీ గురించి ట్రంప్ ఇచ్చిన ఎలివేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. "మోదీ చాలా టఫ్ నెగోషియేటర్. ఆయనను చూస్తే ఒక దేవదూతలా.. ఎంతో అమాయకంగా, మంచిగా కనిపిస్తారు. కానీ.. ఆయనో ‘కిల్లర్’! ఎంత గట్టిగా బేరసారాలు చేస్తారో చెప్పలేం. ఎవరైనా సరే.. ఆయన లుక్స్ చూసి మోసపోవాల్సిందే. చివర్లో ఊహించని షాక్ ఇస్తారు" అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ట్రంప్ ‘కిల్లర్’ అనగానే మనోళ్లు నిజంగానే ఏదో అనుకునే ప్రమాదం ఉంది. కానీ అమెరికన్ ఇంగ్లిష్‌లో బిజినెస్ లేదా డీలింగ్స్ లో అవతలి వాడికి చుక్కలు చూపించే 'మొనగాడు' అనే అర్థంలో ఆ పదాన్ని వాడుతుంటారు. మొత్తానికి మోదీగారి సైలెంట్ స్ట్రాటజీలని ట్రంప్ భలే కనిపెట్టేశారన్నమాట!
డైలాగుల యుద్ధం.. మీమ్స్ వరద!
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఈ ‘బాస్’, ‘కిల్లర్’ డైలాగుల చుట్టూనే తిరుగుతోంది. హాలీవుడ్ యాక్షన్ సినిమా రేంజ్‌లో ఉన్న ఈ కామెంట్లపై మీమర్స్ పండగ చేసుకుంటున్నారు. "ట్రంప్ గ్లోబల్ బాస్ అయితే.. మోదీ నెగోషియేషన్లకే బాస్" అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇప్పుడు దేశాల మధ్య చర్చల్లా లేవు.. పక్కా కమర్షియల్ సినిమా డైలాగుల్లా మారిపోయాయని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.
ముందు ఫ్రాన్స్‌లో ఇరాన్‌తో పీస్ డీల్‌పై సంతకం పెట్టి ఆ వెంటనే జీ7 లో ఇలాంటి పంచ్ డైలాగులు పేల్చడం ఒక్క ట్రంప్‌కే సాధ్యం. ఏదేమైనా ట్రంప్ నోరు తెరిస్తే వార్త.. అందులో మోదీ పేరు ఉంటే అది సంచలన వార్త. ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్ల కాంబినేషన్ చూస్తుంటే.. మున్ముందు అంతర్జాతీయ రాజకీయాల్లో మరిన్ని ఎంటర్‌టైనింగ్ సీన్లు గ్యారెంటీగా కనిపించేలా ఉన్నాయి.
