బాబ్బాబు కాల్పులు విరమించండి.. ట్రంప్ కోరికకు షాకిచ్చిన ఇరాన్
కట్ చేస్తే.. ఇరాన్ లీడర్లు ఆ లెటర్ చదివి సన్నటి వెటకారపు నవ్వు నవ్వారట.. "అసలు మేటర్ ఏంటి బాస్?" అని ఆరా తీస్తే.. అసలు కథ అక్కడ మొదలైంది.
By: A.N.Kumar | 24 July 2026 11:57 PM ISTమధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుని రచ్చ రంబోలా జరుగుతుంటే.. మన "వరల్డ్ క్లాస్ డీల్ మేకర్" డోనాల్డ్ ట్రంప్ తాత గారు రంగంలోకి దిగి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. "అయ్యా.. బాబ్బాబు! కాసేపు ఆ తుపాకులు, మిస్సైళ్లు పక్కన పెట్టి సైలెంట్‌గా ఉండండి" అంటూ ఒక సీజ్‌ఫైర్ ప్రతిపాదనను వదిలారు. కానీ ఇరాన్ మాత్రం అస్సలు తగ్గలేదు. 'సారీ బాస్.. మీ సీన్ ఇక్కడ నడవదు' అని ప్రపోజల్‌ను నిర్దాక్షిణ్యంగా డస్ట్‌బిన్‌లో పడేసి ముఖమ్మీదే తలుపులు వేసేసింది.
వైట్ హౌస్ స్కెచ్.. ఇరాక్ ప్రధాని దౌత్యం!
పాపం వైట్ హౌస్‌లో కూర్చుని సీన్‌ను కూల్ చేద్దామని ట్రంప్ పెద్ద స్కెచ్చే వేశారు. సొంతంగా వెళ్తే క్రెడిట్ పోతుందో ఏమో గానీ.. మధ్యలో ఇరాక్ ప్రధాని అలీ అల్ జైదీని వాషింగ్టన్ పిలిపించుకుని పరోక్ష దౌత్యం నడిపారు. ఆయనకు ఒక కప్పు టీ ఇచ్చి చేతిలో సీజ్‌ఫైర్ ప్రతిపాదన పెట్టి.. "తమ్ముడూ! నువ్వు వెంటనే టెహ్రాన్ వెళ్లి అక్కడ ఉన్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాఘ్చీలతో కాస్త మాట్లాడి మేటర్ క్లోజ్ చెయ్" అని రాయబారిగా పంపించారు. ఇరాక్ ప్రధాని కూడా ప్రపంచ శాంతిని కాపాడేసే ఆశతో విమానమెక్కి టెహ్రాన్ వెళ్లి అక్కడ ఇరాన్ పెద్దల ముందు ఆ అమెరికా శాంతి కాగితాన్ని ఉంచారు.
అసలు మెలిక ఏంటంటే.. 'హార్ముజ్' బిస్కెట్
కట్ చేస్తే.. ఇరాన్ లీడర్లు ఆ లెటర్ చదివి సన్నటి వెటకారపు నవ్వు నవ్వారట.. "అసలు మేటర్ ఏంటి బాస్?" అని ఆరా తీస్తే.. అసలు కథ అక్కడ మొదలైంది. ప్రపంచానికే ముడి చమురు రవాణా చేసే అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' విషయంలో అమెరికా దగ్గర ఎలాంటి స్పష్టమైన క్లారిటీ లేదా హామీ లేదు. "చమురు నౌకల రాకపోకలు, హార్ముజ్ పై కంట్రోల్, భద్రత విషయంలో హామీలు లేకుండా.. ఊరికే మీరు ఫోటోషూట్ కోసం 'సీజ్‌ఫైర్' అనగానే మేము సంతకం పెట్టేస్తామా ఏంటి?" అని ఇరాన్ ఎదురుప్రశ్నించింది. తమ వ్యూహాత్మక ప్రయోజనాలను పక్కనపెట్టి ట్రంప్ తాత చెప్పిన గాలి మాటల లాజిక్‌ను ఒప్పుకోవడానికి ఇరాన్ బొత్తిగా సిద్ధంగా లేదని తేల్చిచెప్పేసింది.
చర్చల తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి.. కానీ
అయితే ఇరాన్ దౌత్యవేత్తలు ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు. "మేము తలుపులు పూర్తిగా మూసేయలేదు సుమీ.. మా జాతీయ ప్రయోజనాలు, భద్రతా హామీలకు తగినంత ప్రాధాన్యం ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం" అని చిన్న సస్పెన్స్ మిగిల్చారు. అంటే ఈ డీల్ వర్కవుట్ అవ్వాలంటే ట్రంప్ గారు ఇంకొంచెం పెద్ద బిస్కెటే వెయ్యాలన్నమాట..
ఏది ఏమైనా తన మాటలతో ప్రపంచ దేశాలను ఆడిస్తానని విర్రవీగే ట్రంప్‌కు, టెహ్రాన్ ఇచ్చిన ఈ 'షాకింగ్ హ్యాండ్' ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ పరిణామాలపై వాషింగ్టన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందనా రాలేదు. మరి మన 'అంకుల్ శ్యామ్' నెక్స్ట్ ఏ టైపు ట్వీట్ వేస్తారో, ఎలాంటి డైలాగ్ కొడతారో వేచి చూడాల్సిందే..
