Begin typing your search above and press return to search.

డిప్యూటీ సీఎం త్రిష...నిజమేనా ?

ఇపుడు దేశంలో డిప్యూటీ సీఎంల లిస్ట్ పెరుతోంది. ఈ పోస్టులలోకి వస్తున్న వారు కూడా క్రేజ్ ఉన్న వారే ఉంటున్నారు.

By:  Satya P   |   29 Jun 2026 9:31 AM IST
డిప్యూటీ సీఎం త్రిష...నిజమేనా ?
X

ఇపుడు దేశంలో డిప్యూటీ సీఎంల లిస్ట్ పెరుతోంది. ఈ పోస్టులలోకి వస్తున్న వారు కూడా క్రేజ్ ఉన్న వారే ఉంటున్నారు. ఒకపుడు ఎపుడో రాజకీయ సర్దుబాటులో భాగంగా ఈ పదవులు చాలా అరుదుగా క్రియేట్ చేసేవారు. ఇపుడు మాత్రం సీఎం పక్కన డిప్యూటీ ఉండాల్సిందే. అలా కాకుండా తొమ్మిదేళ్ళు ఏకచత్రాధిపత్యంగా ఉమ్మడి ఏపీని ఏలిన చంద్రబాబు కూడా విభజన ఏపీలో డిప్యూటీ సీఎంలను పెట్టుకున్నారు. జగన్ తొలిసారి సీఎం అయినా వెంట అయిదుగురు డిప్యూటీలు ఉండేవారు. ఇక తమిళనాడులో కూడా డిప్యూటీ సీఎంల వరస డీఎంకే నుంచే స్టార్ట్ అయింది. కరుణానిధికి స్టాలిన్, అలాగే స్టాలిన్ కి ఉదయనిధి డిప్యూటీలుగా పనిచేశారు. మరి తమిళనాడులో ద్రవిడ పార్టీల రాజకీయానికి ముగింపు పలికి కొత్త రాజకీయానికి బాటలు వేసిన దళపతి విజయ్ కేబినెట్ లో కూడా డిప్యూటీ సీఎం ఉంటారా అన్న చర్చ నడుస్తోంది.

ఆమె ఆ పదవిలో :

ఇక విజయ్ సీఎం గా ఉంటే డిప్యూటీ ఎవరు అంటే ఎవరో కాదు ఆమె డిప్యూటీ సీఎం అవుతారు అని విపక్షం జోస్యం చెబుతోంది. త్రిషను తొందరలో డిప్యూటీ సీఎం గా చేసేట్టు ఉన్నారు అని అన్నది అన్నా డీఎంకేకి చెందిన మాజీ మంత్రి ఉదయకుమార్. ఆయన జోస్యంగా కంటే సెటైరికల్ గా ఈ కామెంట్స్ చేశారు. విజయ్ ధోరణి చూస్తూంటే తన సినీ సన్నిహితులను స్నేహితులను తెచ్చి కీలక పదవులు కట్టబెడుతున్నారు అని ఉదయకుమార్ మండిపడ్డారు. ఆయన ఆగ్రహానికి కారణం తాజాగా ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధిగా కన్నడ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట నారాయణ్ ని సీఎం విజయ్ నియమించారు. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఎనిమిది కోట్ల దాకా జనాభా ఉన్న తమిళనాడులో ఈ కీలక పోస్టుకు ఒక్క తమిళుడు దొరకలేదా అని అంతా విమర్శిస్తునారు. దాంతో అన్నా డీఎంకే దీనిని పట్టుకుని విజయ్ మీద విమర్శలు తనదైన శైలిలో ఎండగట్టింది.

త్రిషకు కూడా ఇచ్చేస్తారు :

తన సన్నిహితులకు పదవులు కట్టబెట్టే క్రమంలో రాబోయే రోజులలో త్రిషను ఉప ముఖ్యమంత్రిగా చేసినా ఆశ్చర్యం లేదని మాజీ మంత్రి ఉదయకుమార్ ఘాటైన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ అయితే ఇపుడు తమిళనాడులో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. త్రిష విజయ్ వెండి తెర మీద క్రేజీ జంట. ఇపుడు ఆ ఇద్దరికీ కలిపి సీఎం డిప్యూటీ సీఎం అని ఉదయకుమార్ పేల్చిన సెటైర్ అయితే బాగా మారు మోగుతోంది.

కుదిరే వ్యవహారమేనా :

అయితే త్రిష ఉప ముఖ్యమంత్రి కావాలంటే ఆమె ఎమ్మెల్యేగా ముందు గెలిచి తీరాలి. తమిళనాడులో శాసనమండలి లేదు. అయితే విజయ్ రాజీనామా చేసిన తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాలి. ఆ మేరకు ఆమెకు టికెట్ ఇస్తేనే రేపటి రోజున కేబినెట్ లో చోటు దక్కుతుంది. అయితే విజయ్ ఆ పని చేస్తారా లేదా అన్నది అయితే తెలియదు. తన ప్రభుత్వంలో ఒక్కటే అధికార కేంద్రం ఉంటుందని విజయ్ ఈ సరికే చెప్పిన సంగతి విధితమే. దాంతో కొత్త వారికే ఆ సీటు ఇస్తారని అంటున్నారు. విజయ్ తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 27,416 ఓట్ల మెజారిటీతో గెలుచుకున్నారు. ఆ తరువాత ఆ సీటు రాజీనామా చేశారు. అయితే రానున్న .ఉప ఎన్నికలలో తన సొంత కొలత్తూరు స్థానాన్ని అనూహ్యంగా కోల్పోయిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ సీటు నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఆయన మీద గ్లామర్ ప్లస్ గ్రామర్ ఉన్న అభ్యర్ధిని నిలపాలంటే త్రిషకు చాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తానికి త్రిష ఉప ముఖ్యమంత్రి అవుతుందా అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అని అంటున్నారు.