హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫ్లాన్ ను అమలు చేసిన బెంగళూరు
తెలంగాణలో మాదిరి కాకుండా.. మొత్తం చలానాలో 50 శాతం రాయితీ ఇవ్వటం ద్వారా.. పెండింగ్ చలానాల్ని క్లియర్ చేసుకునే అవకాశాన్ని వాహనదారులకు కల్పించారు.
By: Garuda Media | 29 Aug 2025 2:00 PM ISTకొన్నేళ్ల క్రితం తెలంగాణ పోలీసులు చేపట్టిన ట్రాఫిక్ చలానాల డ్రైవ్ ఎంతలా సక్సెస్ అయ్యిందో తెలిసిందే. 50 శాతం.. అంతకంటే ఎక్కువ మొత్తంలో ఫైన్ల మీద రాయితీ ఇవ్వటం ద్వారా వాహనదారులు పెద్ద ఎత్తున పెండింగ్ చలానాల్ని కట్టేయటం తెలిసిందే. ఈ మోడల్ తెలంగాణలో సక్సెస్ కావటమే కాదు.. ఇప్పటికే రెండుసార్లు ఈ డ్రైవ్ నిర్వహించటం ద్వారా భారీ ఎత్తున ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరింది. తెలంగాణ పోలీసులు చేపట్టిన ఈ ట్రాఫిక్ చలానా డ్రైవ్ ను.. కొన్ని మార్పులు చేసిన బెంగళూరులోనూ అమలు చేస్తున్నారు.
తెలంగాణలో మాదిరి కాకుండా.. మొత్తం చలానాలో 50 శాతం రాయితీ ఇవ్వటం ద్వారా.. పెండింగ్ చలానాల్ని క్లియర్ చేసుకునే అవకాశాన్ని వాహనదారులకు కల్పించారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 19 వరకు ఈ ఆఫర్ ను అమలు చేస్తున్నారు. దీంతో..పెద్ద ఎత్తున వాహనదారులు తమ పెండింగ్ చలానాల్ని క్లియర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక ద్విచక్ర వాహనదారుడు తనకు పడిన ఫైన్లు చెల్లించాడు.
ఇతగాడి బైక్ కు ఏకంగా 100 చలానాలు పడ్డాయి. మొత్తం ఫైన్ రూ.46,500. ఇందులో 50 శాతాన్ని కట్టేసిన ఇతను.. తన చలానాల భారాన్ని సగానికి తగ్గించుకున్నాడు. ఈ రాయితీ సౌకర్యం కర్ణాటక రాష్ట్ర ఖజానకు ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. ఇప్పటివరకు దాదాపు రూ.19 కోట్ల మేర నిధులు ట్రాఫిక్ విభాగానికి చేరినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. తెలంగాణలో షురూ చేసిన ఈ ఆఫర్ చలానాలు ఉన్న వాహనదారులకు పెద్ద ఎత్తున రిలీఫ్ ను ఇస్తుందని చెప్పక తప్పదు.
