ఆస్ట్రేలియాలో హత్య.. భారత్ లో అజ్ఞాతం.. యువతిని చంపిన వ్యక్తికి భారీ శిక్ష!
ఈ క్రమంలో అతడిని ఢిల్లీలో పట్టుకోగా.. 2023 మార్చి నుంచి విచారణ కొనసాగగా.. తాజా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
By: Raja Ch | 9 Dec 2025 10:00 PM ISTఆస్ట్రేలియాలోని ఓ బీచ్ లో ఓ యువతిని సుమారు 26 సార్లు కత్తితో పోడిచి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ హత్య జరిగి ఏడు సంవత్సరాలు అవ్వగా.. నాలుగేళ్ల క్రితం ఆమె మృతదేహం దొరికిన వెంటనే ఆ హత్య చేసిన వ్యక్తి భారత్ కు పారిపోయి వచ్చాడు. ఈ క్రమంలో అతడిని ఢిల్లీలో పట్టుకోగా.. 2023 మార్చి నుంచి విచారణ కొనసాగగా.. తాజా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
అవును... అది అక్టోబర్ నెల 22వ తేదీ 2018వ సంవత్సరం, ఆ రోజు ఆదివారం. అంటే సుమారు ఏడు సంవత్సరాల క్రితం మధ్యాహ్నం సమయంలో ఆస్ట్రేలియాలోని వాంగెట్టి బీచ్ లో తన కుక్కను తీసుకుని వాకింగ్ కి వెళ్లింది టోయా కార్డింగ్లీ (24) అనే యువతి. ఈ సమయంలో ఆమెను రాజ్ విందర్ సింగ్ అనే వ్యక్తి ఘోరంగా హత్య చేశాడు. ఇందులో భాగంగా ఆమెను 26 సార్లు కత్తితో పొడిచాడు!
ఈ క్రమంలో.. ఆ బీచ్ లోని ఇసుక దిబ్బలలో సగం పాతిపెట్టిన కార్డింగ్లీ మృతదేహాన్ని ఆమె తండ్రి గుర్తించారు. అలా ఆమె మృతదేహం దొరికిన మరుసటి రోజే రాజ్ విందర్ సింగ్ (41) ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి పారిపోయి వచ్చాడు. అప్పటి నుంచి సుమారు నాలుగేళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఈ క్రమంలో అతడిని ఢిల్లీలో గుర్తించారు!
ఈ నేపథ్యంలో జరిగిన విచారణ తర్వాత.. జ్యూరీ తాజాగా అతడిని దోషిగా నిర్ధారించింది. మంగళవారం శిక్ష విధిస్తూ.. రాజ్ విందర్ సింగ్ 25 సంవత్సరాల పాటు పెరోల్ కు వీలులేని కారాగారం అనుభవించాలని తీర్పు చెప్పింది! ఈ సందర్భంగా స్పందిస్తూ.. పదునైన కత్తితో ఆమెను చాలాసార్లు పొడిచి, బ్రతికే అవకాశం లేకుండా ఇసుకలో పూడ్చిపెట్టాడని వ్యాఖ్యానించింది!
కాగా... టోయా కార్డింగ్లే యానిమల్ షెల్టర్ లో వాలంటీర్ గా ఉంటూ, మరోవైపు ఫార్మసీలో పని చేస్తుండేది. స్థానికంగా అందరికీ ఇష్టమైన వ్యక్తిగా ఆమెకు పేరుందని చెబుతున్నారు. మరోవైపు భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన సింగ్... హత్య జరిగిన సమయంలో ఇన్నిస్ ఫైల్ లో నివసిస్తున్నారు. డిటెక్టివ్ లు అతన్ని సస్పెక్ట్ గా గుర్తించేటప్పటికి అతడు దేశం విడిచి పారిపోయాడు.
భార్యపై కోపం యువతిపైనా..?:
నివేదికల ప్రకారం... హత్య జరిగిన రోజు సింగ్ తన భార్యతో గొడవ పడిన తర్వాత బీచ్ కు వెళ్లాడు. ఆ సమయంలో అతడి వద్ద కొన్ని పండ్లు, కిచెన్ కత్తి ఉన్నాయి! ఈ సమయంలో కార్డింగ్లీ తన కుక్కతో బీచ్ లో నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఆమె కుక్క సింగ్ పై మొరగడం ప్రారంభించింది. దీంతో.. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరింత కోపంతో ఊగిపోయిన సింగ్.. ఆమెను కత్తితో పొడిచి, మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టాడు. మరో వైపు ఆ కుక్కను చెట్టుకు కట్టేశాడు.
