బొమ్మల చాటున గంజాయి దందా..!
ఈజీ మనీ కోసం స్మార్ట్ థింకింగ్. అంతకు మించి హైరిస్క్ చేసేందుకు కూడా వెనకాడట్లేదు కేటుగాళ్లు.
By: Tupaki Political Desk | 4 July 2026 3:27 PM ISTఈజీ మనీ కోసం స్మార్ట్ థింకింగ్. అంతకు మించి హైరిస్క్ చేసేందుకు కూడా వెనకాడట్లేదు కేటుగాళ్లు. పైకి అమాయకుల్లా కనిపిస్తూ..రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు అన్నట్లుగా కలరింగ్ ఇస్తూ..తెరవెనుక పెద్ద దందాకే తెరలేపుతున్నారు. ఈ మధ్య రాజస్థాన్‌లో బయటపడిన గంజాయి దందా పోలీసులకు..నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్లనే షాకింగ్‌కు గురి చేసింది. కష్టపడకుండా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే ఆశతో, రంగురంగుల బొమ్మల ముసుగులో రూ.లక్షల గంజాయి వ్యాపారం చేస్తూ..అడ్డంగా బుక్కై..కటకటాల పాలైంది గంజాయి ముఠా. బొమ్మల వ్యాపారుల వేషంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగుర్ని అరెస్ట్ చేశాక..విచారణలో తెలిసిన విషయాలు యావత్ రాజస్థాన్‌ను ఉలిక్కిపడేలా చేసింది.
1500 కి.మీ చేజ్..రూ.75 లక్షల విలువైన గంజాయి సీజ్
పిల్లలు ఆడుకునే బొమ్మలు అమ్ముకుంటూ తిరుగుతుంటారు. పైకి ఏమీ తెలియన్నట్లుగా నటిస్తూ..కన్నింగ్ మైండ్‌కు పనిచెప్తూ..రోజుకో చోట వ్యాపారం చేసుకొని బతుకుతున్నట్లు కనిపిస్తారు. ట్రైన్ జర్నీనే సేఫ్‌గా ఫీలై..ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో గంజాయి సప్లై చేయడం వారి వర్కింగ్ స్టైల్. అలా బొమ్మల వ్యాపారం పేరుతో గంజాయి రవాణా చేస్తున్న ముఠాపై రాజస్థాన్ నార్కోటిక్ బ్యూరోకు పక్కా ఇన్ఫర్మేషన్ చేరింది. కానీ వాళ్లు ఎలా ఉంటారో తెలియదు. కానీ గంజాయి ముఠా ఆటకట్టించాలని ఫిక్స్ అయిన పోలీసులు, నార్కోటిక్ అధికారులు..టీమ్‌లు విడిపోయి సెర్చ్ ఆపరేషన్ చేశారు. సినీ ఫక్కీలో దాదాపు 1,500 కిలోమీటర్ల పాటు నిందితులను వెంబడించి..బారన్ జిల్లాలోని ముండియార్ టోల్ గేట్ దగ్గర అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.75 లక్షల విలువైన 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దండుపాళ్యం సినిమాను మించిన ట్విస్ట్
బొమ్మల వ్యాపారం ముసుగులో గంజాయి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి విచారించాక పోలీసులే అవాక్కయారట. మహిళలు, పిల్లలతో కలిసి బొమ్మల వ్యాపారుల్లా ప్రయాణిస్తూ, అయ్యోపాపం అనే ముఖాలు..కానీ గంజాయి తరలించడమే జీవనోపాధిగా పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. రాజస్థాన్‌లోని కోటా, జైపూర్, భరత్‌పూర్ ఏరియాల్లో పెద్దఎత్తున గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సమాచారం అందగానే అధికారులు ఒడిశాకు చేరుకోగా, నిందితులు అప్పటికే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్లారు. వెంటనే అక్కడికి చేరుకున్న నార్కోటిక్ అధికారులు, స్మగ్లర్లు ట్రైన్‌లో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకుని..అదే రైలులో వారిని సీక్రెట్‌గా ఫాలో అయ్యారు. రైలు దిగగానే పికప్ వెహికల్‌లో ఎక్కి వెళ్తున్న నిందితులను..ముండియార్ టోల్ గేట్ దగ్గర చేజ్ చేసి పట్టుకున్నామని అధికారులు చెప్పారు. వారి దగ్గర 50 ప్యాకెట్లలో దాచిన దాదాపు 150 కిలోల గంజాయి బయటపడింది. సీజ్ చేసిన మాదకద్రవ్యాల విలువ రూ.75 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బొమ్మలు అమ్మిన డబ్బుతో గంజాయి వ్యాపారం
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బొమ్మలు అమ్ముతూ సంపాదించిన డబ్బుతో..గంజాయిని వ్యాపారాన్ని స్టార్ట్ చేసిందట ఈ ముఠా. కేవలం రూ.2వేల మొదలుపెట్టిన అక్రమ యాపారం కాస్త..లక్షల రూపాయల బిజినెస్‌గా మార్చినట్లు తేలింది. అయితే ఎక్కడైనా తనిఖీల్లో పట్టుబడితే తాము బొమ్మల వ్యాపారులమని చెప్పి తప్పించుకోవడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు అధికారులు. ఇలా పలుసార్లు చెకింగ్స్‌లో దొరికి..తమకేం తెలియదని..బొమ్మలు అమ్ముకుని బతుకుతామని చెప్పి ఎస్కేప్ అయిన సందర్భాలు ఉన్నాయని నిందితులు విచారణలో ఒప్పకోవడంతో..వీరి వెనుక ఎవరైనా ఉండి ఈ దందా చేయిస్తున్నారా అని ఆరా తీస్తున్నట్లు నార్కోటిక్ అధికారులు చెబుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించడం కోసం..బొమ్మల వ్యాపారం ముసుగులో గంజాయి దందాలోకి దిగిన ఈ ముఠా..ఫైనల్‌గా జైలు పాలు అయింది.
