ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే దేశాలు .. ఏ దేశ పర్సంటేజ్ ఎంతో తెలుసా?
దీనికి తోడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా.. ఉద్యోగంలో ఇంటర్వ్యూ అయినా.. ఎక్కడైనా.. ఏం చేయాలన్నా సరే ఇంగ్లీష్ తప్పనిసరిగా మారిపోయింది.
By: Madhu Reddy | 9 Aug 2025 2:00 AM ISTఇంగ్లీష్.. ప్రపంచ సాధారణ భాషగా మారిపోయింది.. అటు విద్యార్థులకు ఇటు ప్రయాణికులకు, నిపుణులకు కమ్యూనికేషన్ ను సులభతరం చేస్తోంది. ఇంగ్లీష్ వస్తే చాలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు.. ఎక్కడైనా నివసించొచ్చు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు కూడా.. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మాతృభాషతో పాటు ఇంగ్లీష్ కూడా తప్పనిసరిగా మారిపోయింది. చిన్నపిల్లలు ఎల్కేజీలో జాయిన్ అయ్యింది మొదలు ప్రతి అంశాన్ని అటు మాతృభాషలో ఇటు ఇంగ్లీష్ లోనూ నేర్చుకుంటూ ఇంగ్లీషులో నిష్ణాతులుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా.. ఉద్యోగంలో ఇంటర్వ్యూ అయినా.. ఎక్కడైనా.. ఏం చేయాలన్నా సరే ఇంగ్లీష్ తప్పనిసరిగా మారిపోయింది.
అందుకే ఇప్పుడు ప్రతి దేశంలో కూడా ఇంగ్లీష్ తప్పనిసరి భాషగా మారిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఇలా తప్పనిసరిగా మాట్లాడాల్సిన భాషగా మారిన ఇంగ్లీష్ ను అనర్గళంగా మాట్లాడే దేశాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఏ దేశంలో ఎంత పర్సంటేజ్ వ్యక్తులు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారు అనే ఒక ఎక్స్ పోస్టు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజాగా ఒక నివేదిక ప్రకారం.. ప్రపంచ దేశాలలో ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు.. ఆ దేశంలోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. మరి ప్రపంచ దేశాలలో ఏ దేశంలో ఎక్కువ మంది జనాభా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారు..? ఏ దేశ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు.. ఏ దేశంలో.. ఎంత శాతం మంది ఉన్నారు? అనే విషయానికి వస్తే..
చైనా - 0.9%
బ్రెజిల్ - 5%
రష్యా - 5%
ఇండియా - 10.5%
మెక్సికో - 12.9%
ఇటలీ - 13.74%
టర్కీ - 17%
స్పెయిన్ - 22%
ఇండోనేషియా - 30.8%
సౌత్ ఆఫ్రికా - 31%
రోమానియా - 31%
ఈజిప్ట్ - 39.9%
పోలాండ్ - 49.1%
అలా మొత్తంగా చూసుకుంటే పోలాండ్ లో దాదాపు 49.1% మంది ప్రజలు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక 2వ స్థానంలో ఈజిప్ట్ నిలవగా, 3వ స్థానంలో రోమానియా, సౌత్ ఆఫ్రికా దేశాలు నిలిచాయి. ఇక 4వ స్థానంలో ఇండోనేషియా, 5వ స్థానంలో స్పెయిన్, 6వ స్థానంలో టర్కీ, 7వ స్థానంలో ఇటలీ, 8వ స్థానంలో మెక్సికో, 9వ స్థానంలో ఇండియా, 10వ స్థానంలో రష్యా, బ్రెజిల్ నిలవగా.. ఆఖరి స్థానంలో చైనా నిలిచింది. ఇక్కడ చాలామంది తమ మాతృభాష పైనే ఆధారపడడం గమనార్హం.
.
