ఉత్తమ సీఎంగా బాబు.. ప్రాతిపదిక ఇదే!
దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబు 3వ స్థానం దక్కించుకున్నారు.
By: Garuda Media | 30 Aug 2025 2:00 PM ISTదేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబు 3వ స్థానం దక్కించుకున్నారు. తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఇక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ జాబితాలో చివరకు చేరారు. ఈ మేరకు దేశవ్యాప్తం గా ఉన్న 28 రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల పనితీరుపై ఇండియా టుడే సహా..మరో సంస్థతో కలిసి చేసిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఈ సర్వే దేశవ్యాప్తంగా జరిగింది. అంటే.. కేవలం ఒక రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకుని సాగిన సర్వే కాదు.
మొత్తం 2,55,736 మందిని మాత్రమే ఈ సర్వేలో పలకరించారు.వీరి నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారమే ముఖ్యమంత్రులకు ర్యాంకులు కేటాయించారు. తొలి స్థానంలో నిలిచిన యోగి ఆదిత్యనాథ్ కు 36 శాతం మంది ప్రజలు జైకొట్టారు. ఇక, రెండో ప్లేస్‌లో ఉన్న మమతాబెనర్జీకి 13.6 శాతం మంది, మూడో స్థానంలో ఉన్న చంద్రబాబుకు 7.3 శాతం మంది ప్రజలు జైకొట్టారు. ఇక, చివరి స్థానంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2.1 శాతం మంది ప్రజలు మాత్రమే మద్దతు తెలిపారు.
ఏయే అంశాలపై సర్వే..
+ ఈ సర్వే ప్రధానంగా ఏప్రిల్-జూన్ మధ్య మూడు మాసాల్లో నిర్వహించారు.
+ అప్పటికి ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుని ప్రజల అభిప్రాయాలు రాబట్టారు.
+ పెట్టుబడులు, సంక్షేమం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు మంచి మార్కులు పడ్డాయి.
+ శాంతి భద్రతలు.. అరాచకాలకు అడ్డుకట్టవేయడంలో యూపీ సీఎంకు ప్రజలు మొగ్గు చూపారు.
+ రాష్ట్రంలో ప్రజలను ఎక్కువ సంఖ్యలో ప్రభావితం చేస్తున్న సీఎంగా బెంగాల్ ముఖ్యమంత్రి నిలిచారు.
+ సుపరిపాలన విషయంలో చంద్రబాబు ఎక్కువ మార్కులు పడగా.. తర్వాత స్థానంలో మమత ఉన్నారు.
+ ప్రజలకు శాంతి భద్రతల విషయంలో భరోసా కల్పించిన సీఎంగా ఎక్కువ మార్కులు యోగికే పడ్డాయి.
+ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈ సర్వే జరిగింది.
+ వ్యక్తిగతంగా 2 లక్షల పైచిలుకు మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు.
