Begin typing your search above and press return to search.

ప్రపంచంలోని టాప్ - 10 ధనిక కుటుంబాలివే.. భారత్ నుంచి..!

పాత డబ్బు, కొత్త వ్యాపారం కలగలిపి ఈ ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాల జాబితా తాజాగా విడుదలైంది.

By:  Raja Ch   |   20 Dec 2025 12:04 AM IST
ప్రపంచంలోని టాప్ -  10 ధనిక కుటుంబాలివే.. భారత్  నుంచి..!
X

పాత డబ్బు, కొత్త వ్యాపారం కలగలిపి ఈ ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాల జాబితా తాజాగా విడుదలైంది. బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన టాప్ - 25 ధనిక కుటుంబాల విలువ 2.9 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇది గత ఏడాది కంటే సుమారు 358.7 బిలియన్ డాలర్లు ఎక్కువ. ఈ కుటుంబాలు రిటైల్, చమురు నుంచి లగ్జరీ ఉత్పత్తులు, మీడియా వరకూ విస్తృత శ్రేణి వ్యాపారాలలో పాల్గొంటున్నాయి.

ఇందులో వాల్టన్స్, అల్ సౌద్ వంటి వారు ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యాపారాలను నిర్వహిస్తుండగా.. హెర్మేస్, చానెల్ వంటి మరికొందరు అనేక తరల నాటి సంప్రదాయ చేతిపనులను సజీవంగా ఉంచుతున్నారు. ఇక బ్లూమ్ బెర్గ్ అత్యంత ధనిక కుటుంబాల్లో టాప్ 10 లో భారతదేశం నుంచి అంబానీ కుటుంబం మాత్రమే నిలిచింది.

అవును... బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన టాప్ 25 ప్రపంచ ధనిక కుటుంబాల జాబితాలో టాప్ 10 లో ఒకే ఒక్క భారతీయ కుటుంబం నిలించిది. అదే అంబానీ కుటుంబం. ఇప్పుడు ఆ 10 కుటుంబాల వివరాలు, ఆదాయం, వ్యాపారం మొదలైనవి చూద్దామ్...!

వాల్టన్స్: వాల్ మార్ట్ రిటైల్

ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబాల్లో టాప్ వన్ లో నిలిచిన వాల్టన్ ఫ్యామిలీ నికర విలువ 513.4 బిలియన్ డాలర్లు. ఈ ఫ్యామిలీ వాస్తవానికి వాల్ మార్ట్ లో సుమారు 44% విలువను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,750 కంటే ఎక్కువ దుకాణాలు కలిగి ఉన్న వాల్ మార్ట్ గత అర్ధిక సంవత్సరంలో 681 బిలియన్ డాలర్లు సంపాదించింది.

అల్ నహ్యాన్: పాత డబ్బు, చమురు వ్యాపారం

అబుదాబీలోని అల్ నహ్యాన్ ఫ్యామిలీ నికర విలువ 335.9 బిలియన్ డాలర్లు. ఈ కుటుంబానికి సంవత్సరాలుగా ఉన్న పాత డబ్బుతో పాటు చమురు వ్యాపారం బాగా కలిసి వచ్చింది. వీరి వ్యాపారం మిడిల్ ఈస్ట్ లోకి ప్రవేశంచి అభివృద్ది చెందింది. దీనికితోడు పొలిటికల్ పవర్ ఉంది. ఇదే సమయంలో.. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ తో పాటు మల్టీనేషనల్ కంపెనీలపై అధికారం కూడా ఉంది.

అల్ సౌద్: చమురు వ్యాపారం

సౌదీ అరేబియాలోని అల్ సౌద్ ఫ్యామిలీ నికర విలువ 213.6 బిలియన్ డాలర్లు. వీరి సంపదలో ఎక్కువ భాగం దేశంలోని భారీ చమురు నిల్వల నుంచి వస్తుంది. వారు వీటిని ప్రభుత్వ యాజమాన్యంలోని సౌదీ అరామ్కో కంపెనీ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ తో పాటు మౌలిక సదుపాయాలు, టూరిజం సహా వివిధ ప్రాజెక్టుల్లో వీరు భారీగా పెట్టుబడులు పెట్టి ఆర్జిస్తున్నారు.

అల్ థానీ: గ్యాస్, హోటల్స్

ఖతార్ ను పాలించే అల్ థనీ ఫ్యామిలీ నికర సంపద సుమారు 199.5 బిలియన్ డాలర్లు. అఫ్ షోర్ లో పెద్ద గ్యాస్ వనరులను కలిగి ఉండటంతో పాటు హోటళ్లు, ఇన్సూరెన్స్, కాంట్రాక్టులలో వీరు ముఖ్యమైన సంస్థలను కలిగి ఉన్నారు. దీనికి తోడు రాజకీయ అధికారంతో ముడిపడి ఉన్న వీరి సంపద.. ఖతర్ ఆర్థిక పరిస్థితిని నిర్ణయించడానికి వారిని అనుమతిస్తుంది.

హెర్మేస్: లగ్జరీ క్రాఫ్ట్ మన్ షిప్

సుమారు ఆరు తరాలుగా ఈ లగ్జరీ కంపెనీని నిర్వహించడం ద్వారా హెర్మేస్ ఫ్యామిలీ 184.5 బిలియన్ల సంపదను నిలుపుకుంది. ఈ ఫ్యామిలీ బిర్కిన్, కెల్లీ బ్యాగులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇదే సమయంలో ఇప్పటిలే లగ్జరీ, హ్యాండ్ మేడ్ పనులకు ప్రసిద్ధి చెందింది. వీరు చేతిపనుల పద్దతిని ఉపయోగించి కొన్ని వస్తువులను మాత్రమే అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో తయారు చేయడం ద్వారా అధిక విలువను నిలుపుకున్నారని అంటారు.

కోచ్: విభిన్న పరిశ్రమలు

కోచ్ ఫ్యామిలీ తమ తండ్రి చమురు శుద్ధి కర్మాగారాన్ని సుమారు 150.5 బిలియన్ల వ్యాపారంగా మార్చింది. ఇది ఇప్పుడు యూఎస్ లో ప్రైవేటు ఆధీనంలో ఉన్న రెండో అతిపెద్ద సంస్థ. వీరికి రసాయనాలు, ఎరువులు, కాగితం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి విభిన్న కంపెనీలు ఉన్నాయి.

మార్స్: చాక్లెట్

ఎం&ఎం, మిల్క్ వే, స్నికర్స్ వంటి ప్రసిద్ధ చాకెల్ట్ బ్రాండ్ లకు ప్రసిద్ధి చెందిన మార్స్ కుటుంబం నికర విలువ 143.4 బిలియన్ డాలర్లు. ఇదే సమయంలో వారి ఆదాయంలో సుమారు సగం సంపాదించే పెంపుడు జంతువుల సంరక్షణ వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది స్నాక్స్ తయారు చేసే కెల్లనోవా కంపెనీని కొనుగోలు చేశారు.

అంబానీ: భారతీయ కుటుంబం

ముఖేష్ అంబానీ ఫ్యామిలీ నికర విలువ 105.6 బిలియన్ డాలర్లు కాగా.. వీరికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వస్త్రాల నుంచి చమురు శుద్ధి, టెలికమ్యునికేషన్స్, రిటైల్, వినియోగదారు ఉత్పత్తుల వరకూ అన్నింటిలోనూ రాణిస్తున్నారు.

వెర్థెమర్: ఫ్రెంచ్ ఫ్యాషన్ లెగసీ

వెర్థెమర్ సోదరులు కోకో చానెల్ ను ప్రారంభించారు. ఈ ఫ్యామిలీ ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ వ్యాపారాలలో ఒకదాన్ని నడుపుతుంది. ఈ కుటుంబ నికర విలువ 85.6 బిలియన్ డాలర్లు కాగా.. చానెల్ ఇప్పటికే దానికి క్లాసిక్ ఉత్పత్తులైన లిటిల్ బ్లాక్ డ్రెస్, నం.5 పెర్ఫ్యూమ్ నుంచి భారీ సంపాదిస్తుంది.

థామ్సన్: కెనడియన్ మీడియా

కెనడాకు చెందిన థామ్సన్ కుటుంబం నికర విలువ 82.1 బిలియన్ డాలర్లు. వారు తమ హోల్డింగ్ కంపెనీ వుడ్ బ్రిడ్జ్ ద్వారా థామ్సన్ రాయిటర్స్ సహా అనేక ఇతర వ్యాపారాలను కలిగి ఉన్నారు. వారికి మీడియాతో పాటు రియల్ ఎస్టేట్స్ లోనూ భారీ ఆదాయం ఉంది. వీటికి ఫ్యామిలీలోని మూడో తరం డేవిడ్ థామ్సన్ ప్రస్తుతం బాధ్యత వహిస్తున్నారు.