నచ్చినా నచ్చకపోయినా.. టాప్ 10 మోస్ట్ పవర్ ఫుల్ వ్యక్తులు వీరే!
అవును... శక్తి, ప్రభావం, నియంత్రణ.. ఇవి కేవలం పదాలు కాదు. ప్రపంచం ఎలా నడుస్తుందో అవి నిర్ణయిస్తాయి.
By: Raja Ch | 17 Oct 2025 12:24 PM ISTసుమారు 800 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ ప్రపంచంలో అతి కొద్దిమంది మాత్రమే శక్తివంతమైన వ్యక్తులుగా ఉంటారు.. ప్రపంచ గతిని, స్థితిని మార్చే నిర్ణయాలు తీసుకుంటారు. అలా అని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ ధనవంతులు కానవసరం లేదు.. వారితో ప్రపంచవ్యాప్తంగా నిర్ణయాలు ఎలా మారుతాయో అర్థం చేసుకోవాలంటే ఆ శక్తివంతమైన వ్యక్తులను చూడాల్సిందే!
అవును... శక్తి, ప్రభావం, నియంత్రణ.. ఇవి కేవలం పదాలు కాదు. ప్రపంచం ఎలా నడుస్తుందో అవి నిర్ణయిస్తాయి. ఈ మూడింటినీ కలిగి ఉన్న వ్యక్తులే పవర్ ఫుల్ శక్తులుగా మారతారు. అలా అని ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు.. అంతకు మించినది ఉంది. ఈ నేపథ్యంలో... ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, సరిహద్దులను మార్చగలుగుతూ వందల కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే వ్యక్తుల గురించి మాట్లాడుకుందామ్..!
రాజకీయ నాయకులు, దేశాధినేతల నుంచి వ్యాపార వేత్తలు, టెక్ దిగ్గజాల వరకు.. మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ వ్యక్తులే ప్రపంచంపై తమ ప్రభావాన్ని చూపిస్తుంటారు.. మార్పు విషయంలో తమ వంతు కృషి చేస్తున్నారు.
1. జిన్ పింగ్:
చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడిగా, ప్రపంచంలోని అతిపెద్ద సైనిక దళాలలో ఒకదానికి అధిపతిగా ఉన్న జిన్ పింగ్.. ప్రపంచంలోని శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నారు. అతని విధానాలు చైనా ఆర్థిక, భౌగోళిక రాజకీయ పెరుగుదలకు దారితీశాయి. ఇతని పాలనలో చైనా ఒక ప్రపంచ సూపర్ పవర్ గా అభివృద్ధి చెందుతుంది!
2. డొనాల్డ్ ట్రంప్:
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్నారు. విస్తారమైన సైనిక, నిఘా వ్యవస్థను నియంత్రిస్తున్నారు. యుఎస్ డాలర్ ఆధిపత్య అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న ప్రపంచంలో.. ఆయన అపారమైన ప్రభావాన్ని కలిగి ఉంటాడు. ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ నుండి పరిశీలన ఉన్నప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు వివిధ పరిస్థితులలో శక్తివంతమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు.
3. ఎలాన్ మస్క్:
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్... టెస్లా, స్పేస్ ఎక్స్ లను నడుపుతున్నారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) కి ఎగ్జిక్యూటివ్ చైర్ గా ఉన్నారు. అంతరిక్ష ప్రయాణం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకూ అన్ని రంగాల్లోనూ పరిశ్రమలను రూపొందిస్తున్నారు. ఈయన టెక్ సీఈఓ మాత్రమే కాదు, ఈ భూగ్రహం పైనే అత్యంత ధనవంతుడు. ప్రస్తుతం ఇతని నికర విలువ $330 బిలియన్లకు పైగా ఉంది. ట్రంప్ అంతటివారు ప్రేమించినా, తృణీకరించినా.. అతను మోస్ట్ పవర్ ఫుల్!
4. నరేంద్ర మోడీ:
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక, సైనిక సూపర్ పవర్ లో విధానాన్ని నియంత్రిస్తారు. ఆయన ప్రభుత్వం దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలో ప్రతిదానిపైనా ప్రభావం చూపుతుంది. భారతదేశం పెరుగుదల మోడీని ప్రపంచ నాయకత్వంలో కీలక వ్యక్తిగా చేస్తుంది.
5. జెరోమ్ పావెల్:
ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అయిన పావెల్.. వాల్ స్ట్రీట్ సీఈవో కంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ఆధిపత్యాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. వడ్డీ రేట్లను నిర్ణయించడం, ద్రవ్య విధానాన్ని నడిపించడం ద్వారా.. అతను ద్రవ్యోల్బణం, ఉపాధి, కరెన్సీల విలువను ప్రభావితం చేస్తారు. ఆయన మాట్లాడినప్పుడు మార్కెట్లు కదులుతాయి. అతని వ్యవహారం ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
6. వ్లాదిమిర్ పుతిన్:
రష్యా అధ్యక్షుడిగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంతో అణ్వాయుధ దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఉక్రెయిన్ యుద్ధం లాగా అతని నిర్ణయాలు మొత్తం ప్రాంతాలను అస్థిరపరచగలవు. అతని నాయకత్వ శైలి.. అనేక దేశాలు వ్యతిరేకించినప్పటికీ అధికారాన్ని ఎలా కొనసాగించవచ్చో చూపిస్తుంది.
7. టిమ్ కుక్:
టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవోగా ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకదాన్ని టిమ్ కుక్ నియంత్రిస్తారు. బిలియన్ల మంది ఎలా సంభాషించుకోవాలో, తమను తాము ఎలా అలరించుకోవాలో ఆపిల్ రూపొందిస్తుంది. కుక్ నాయకత్వ శైలి మస్క్ కంటే నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ అతని ప్రభావం స్థిరంగా, విస్తృతంగా ఉంటుంది.
8. మహ్మద్ బిన్ సల్మాన్:
సౌదీ అరేబియా యువరాజు, ఆ దేశ ప్రధానమంత్రి అయిన మహ్మద్ బిన్ సల్మాన్... ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుని నడిపిస్తున్నారు. ప్రపంచ ఇంధన మార్కెట్లకు కీలకమైన.. వ్యాపారం, సాంకేతికతలో మరింత ప్రభావవంతమైన రాజ్యానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ద్వారా ఆయన పెట్టుబడులు పెట్టడం ఆయనను మధ్యప్రాచ్యంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా చేస్తోంది!
9. ఉర్సులా వాన్ డెర్ లేయన్:
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా వాన్ డెర్ లేయన్.. యూరోపియన్ కమిషన్ విధాన ఎజెండాను నిర్దేశిస్తారు.. ఈయూ విధానాన్ని రూపొందిస్తారు. ఆమె ప్రభావం వాతావరణ లక్ష్యాలు, డిజిటల్ నియంత్రణ నుంచి ప్రపంచ వాణిజ్యం వరకు విస్తరించి ఉంది. అల్లకల్లోల సమయాల్లో ఈయూకి నాయకత్వం వహించడం ఆమెను శక్తివంతమైన వ్యక్తిగా చేసాయి.
10. బిల్ గేట్స్:
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, పరోపకారి.. గేట్స్ సైన్స్, ప్రజారోగ్యం, వాతావరణ పరిష్కారాలలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా కొనసాగుతున్నారు బిల్ గేట్స్. ‘గేట్స్’ ఫౌండేషన్ ద్వారా ఆయన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బిలియన్ల కొద్దీ నిధులను సమకూర్చుతున్నారు. అధికారం అనేది పదవి నుండే రావాల్సిన అవసరం లేదని ఆయన శైలి చూపిస్తుంది.
