భారత్‌లో అత్యధిక వేతనం అందించే టాప్-10 ఉద్యోగాలు.. మీ డ్రీమ్ కెరీర్ ఏది?
ప్రస్తుతం భారత్‌లో అత్యధిక వేతనాలు అందిస్తున్న టాప్-10 ఉద్యోగాలు ఏంటో తెలుసుకుందాం..
By: A.N.Kumar | 28 July 2026 12:03 PM ISTడిగ్రీలు పక్కన పెట్టండి.. నెలకు లక్షల్లో కాకుండా సంవత్సరానికి కోట్లలో జీతం ఇచ్చే ఉద్యోగాల వైపు అడుగులు వేయండి.. ఒకప్పుడు ఇంజినీరింగ్, డాక్టర్ పట్టా ఉంటే చాలు అనుకునేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏఐ మోడల్స్ డిజైన్ చేసినా, కంపెనీలకు బిజినెస్ ప్లాన్స్ ఇచ్చినా కంపెనీలు కోట్ల రూపాయల ప్యాకేజీలను మీ కాళ్ల దగ్గరకు తెచ్చి పడేస్తున్నాయి.. మరి భారత్‌లో కుబేరులుగా మారుస్తున్న ఆ ఆకర్షణీయమైన టాప్-10 జాబ్స్ ఏంటో తెలుసా?
భారతదేశంలో ఉద్యోగ రంగం వేగంగా రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడు కేవలం సంప్రదాయ ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులకే పరిమితమైన మార్కెట్.. నేడు నూతన సాంకేతికతలు, మేనేజ్‌మెంట్ రంగా వైపు అడుగులు వేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వంటి రంగాలు నేడు యువతకు మైండ్ బ్లోయింగ్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. సరైన నైపుణ్యాలు, అనుభవం ఉంటే కోట్ల రూపాయల వేతనాన్ని సొంతం చేసుకోవడం ఇప్పుడు సులభంగా మారింది. ప్రస్తుతం భారత్‌లో అత్యధిక వేతనాలు అందిస్తున్న టాప్-10 ఉద్యోగాలు ఏంటో తెలుసుకుందాం..
1. సీఈవో / సీఎక్స్ ఓ లకు రూ. 1 కోటి నుండి రూ. 8 కోట్లు+
కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే సీఈవో, సీటీఓ, సీఎఫ్ఓ వంటి ఉన్నతాధికారులు అత్యధిక ప్యాకేజీలు పొందుతున్నారు. కంపెనీ పరిమాణం, లాభాల ఆధారంగా వీరి ఆదాయం లెక్కిస్తారు.
2. స్పెషలిస్ట్ డాక్టర్లులకు రూ. 30 లక్షల నుండి రూ. 5 కోట్లు+
న్యూరోసర్జన్లు, కార్డియాలజిస్టులు, ఆర్థోపెడిక్ నిపుణులకు మార్కెట్లో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ వీరి సంపాదన భారీగా పెరుగుతుంది.
3. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ లకు రూ. 25 లక్షల నుండి రూ. 3 కోట్లు+
పెద్ద కంపెనీల విలీనాలు, అక్విజిషన్లు, ఆర్థిక వ్యూహాలు నిర్వహించే ఫైనాన్స్ నిపుణులకు కార్పొరేట్ రంగంలో భారీ వేతనాలు లభిస్తాయి.
4. ఏఐ / మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ లకు రూ. 15 లక్షల నుండి రూ. 1 కోటి+
ప్రపంచాన్ని ఏలుతున్న ఏఐ విప్లవంతో ఈ నిపుణులకు డిమాండ్ ఆకాశాన్నంటింది. ఆధునిక ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసే నిపుణులకు టెక్ కంపెనీలు బంపర్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి.
5. సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ / ఇంజినీరింగ్ డైరెక్టర్ లకు రూ. 30 లక్షల నుండి రూ. 1.5 కోట్లు
టెక్నాలజీ దిగ్గజ సంస్థల్లో సాంకేతిక మౌలిక వసతులు, వ్యూహాలను ప్లాన్ చేసే ఆర్కిటెక్ట్‌లకు ఉన్నతమైన వేతనాలు లభిస్తున్నాయి.
6. మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ లకు రూ. 25 లక్షల నుండి రూ. 2 కోట్లు+
మెకిన్సీ, బీసీజీ, బెయిన్ వంటి ప్రముఖ కన్సల్టింగ్ సంస్థల్లో పనిచేస్తూ కంపెనీల వ్యాపార సమస్యలను పరిష్కరించే నిపుణుల సంపాదన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
7. డేటా సైంటిస్ట్ / ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ లకు రూ. 15 లక్షల నుండి రూ. 80 లక్షలు+
డేటా ఆధారంగా వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం పెరిగిన నేపథ్యంలో డేటా అనలిటిక్స్ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంది.
8. కమర్షియల్ పైలట్ లకు రూ. 40 లక్షల నుండి రూ. 1.5 కోట్లు
అవియేషన్ రంగానికి నిరంతరం పైలట్ల అవసరం ఉంటుంది. సీనియారిటీ, విమానం నడిపిన గంటల ఆధారంగా వీరు భారీ వేతనం పొందుతారు.
9. కార్పొరేట్ లాయర్ / లా ఫర్మ్ పార్ట్నర్ లకు రూ. 25 లక్షల నుండి రూ. 5 కోట్లు+
కార్పొరేట్ ఒప్పందాలు, చట్టపరమైన సమస్యలను పరిష్కరించే నిపుణులైన లాయర్లకు లా ఫర్మ్‌లలో కోట్లలో ప్యాకేజీలు ఉంటాయి.
10. ప్రొడక్ట్ మేనేజర్ లకు రూ. 25 లక్షల నుండి రూ. 1 కోటి+
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ సంస్థల్లో ఒక ప్రొడక్ట్ రూపురేఖలను నిర్దేశించే మేనేజర్లకు భారీ డిమాండ్ నెలకొంది.
భవిష్యత్తును ఏలబోయే క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్, ఫిన్‌టెక్ వంటి రంగాల్లో కెరీర్ నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం. కేవలం ఒక డిగ్రీకి పరిమితం కాకుండా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మాత్రమే గ్లోబల్ స్థాయిలో ఆకర్షణీయమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
