Begin typing your search above and press return to search.

మరణం ఆత్మకే, శరీరానికి కాదు.. ఈ కొత్త విషయం తెలుసా?

ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక విశ్వాసాలు... మరణం శరీరానే కానీ, ఆత్మకు కాదని చెబుతుంటాయి! అయితే... దీనికి పూర్తి విరుద్ధంగా.. మరణం అనంతరం ఆత్మ సంగతి తర్వాత, శారీరం మాత్రం సేఫ్ అంటుంది 'టుమారో బయో' కంపెనీ!

By:  Raja Ch   |   16 Nov 2025 11:00 PM IST
మరణం ఆత్మకే, శరీరానికి కాదు.. ఈ కొత్త విషయం తెలుసా?
X

సాధారణంగా మరణం అనేది శరీరానికే పరిమితం అని.. మరణం అంటే.. శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం, మొదడు పనిచేయడం వంటి ఫిజికల్ యాక్టివిటీలు ఆగిపోవడమే అని అంటారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక విశ్వాసాలు... మరణం శరీరానే కానీ, ఆత్మకు కాదని చెబుతుంటాయి! అయితే... దీనికి పూర్తి విరుద్ధంగా.. మరణం అనంతరం ఆత్మ సంగతి తర్వాత, శారీరం మాత్రం సేఫ్ అంటుంది 'టుమారో బయో' కంపెనీ!

అవును... మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ ఏమవుతుంది అనే సంగతి పై ఉన్న రకరకాల అభిప్రాయాలు, పలు రకాల నమ్మకాలు, కొన్ని విశ్వాసాల సంగతి కాసేఫు పక్కనపెడితే... శరీరం మాత్రం సేఫ్.. కాకపోతే కాస్త ఖర్చవుతుంది.. ఒక వేళ భవిష్యత్తులో మెడికల్ టెక్నాలజీ అభివృద్ధి చెంది జీవ పునరుద్ధరణకు అవకాశం కలిగితే.. అప్పుడు పునర్జన్మ ఎత్తినట్లన్నమాట. అప్పటి వరకూ ప్రాణం లేని శరీరం సేఫ్ అంట.

వివరాళ్లోకి వెళ్తే... మాజీ క్యాన్సర్ పరిశోధకుడు డాక్టర్ ఎమిల్ కెండ్జియోరా, ఇంజనీర్ ఫెర్నాండో అజెవెడో పిన్హీరో కలిసి జర్మనిలో ఓ స్టార్టప్ ను స్థాపించారు. ఈ కంపెనీ పేరు టుమారో బయో. ఈ సమయంలో... చనిపోయినప్పటికీ తిరిగి బతికించే అవకాశం కల్పిస్తానంటోంది ఈ జర్మన్ స్టార్టప్ కంపెనీ. ఇందుకు తాము చేసే ప్రక్రియ పేరు క్రయోఫ్రీజరెషన్ అని చెబుతోంది.

అంటే... వ్యక్తి చనిపోయిన తర్వాత వారి శరీరం, మెదడును క్రయోఫ్రీజరేషన్ ల్యాబ్ లో -196 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో భద్రపరుస్తారంట. దీంతో ఎంతకాలమైనా శరీరం పాడైపోదని చెబుతోంది. ఈ సమయంలో.. చట్టబద్ధమైన మరణం తర్వాత అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాలని ఎంచుకునే వ్యక్తుల కోసం దీర్ఘకాలిక క్రయోప్రెజర్వేషన్ సేవలను అందిస్తుంది.

ఈ క్రమంలో... పూర్తి శరీరాన్ని ఫ్రీజర్ చేయాలంటే 2 లక్షల డాలరు (దాదాపు రూ.1.77 కోట్లు) కాగా.. మెదడుకు 78 వేల డాలర్లు (దాదాపు రూ.69 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది!

ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ ఎమిల్ కెండ్జియోరా... కంపెనీ ఇప్పటివరకూ పదుల సంఖ్యలో మానవ మృతదేహాలను, పెంపుడు జంతువులను క్రయోప్రిజర్వ్ చేసినట్లు తెలిపారు. వందల మంది సైన్ అప్ చేశారని వెల్లడించారు. ఇదే సమయంలో.. ఎలుకలలో అవయవ పునరుజ్జీవనానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు.