Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి లక్ష కోట్ల ల్యాండ్ బ్యాంక్!

చాలా మంది రెమ్యునరేషన్ కూడా ఊహకందని రేంజిలో ఉంటోంది. ఒకప్పుడు టాలీవుడ్ సినిమా పది కోట్లు కలెక్ట్ చేస్తే అబ్బో అని అంతా నోరేళ్ళబెట్టేవారు. ఆ తరువాత పాతిక కోట్లు, యాభై కోట్లు టార్గెట్ రీచ్ అయ్యేసరికి చాలా కాలమే పట్టింది.

By:  Satya P   |   29 Nov 2025 5:57 PM IST
టాలీవుడ్ కి లక్ష కోట్ల ల్యాండ్ బ్యాంక్!
X

అవునా నిజమా అని ఆశ్చర్యపోకండి. సినీ రంగం అంటే ఖరీదైనదే అని అంతా అంటూంటారు కదా. అది నమ్మితే ఇదీ నమ్మాల్సిందే. ఇక టాలీవుడ్ లో టాప్ స్టార్స్ ఉన్నారు. మిడిల్ రేంజ్ హీరోస్ ఉన్నారు. అంతే కాదు చిన్న నటులు ఉన్నారు. మరో వైపు భారీ సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారు. అలాగే చిన్న తరహా మూవీస్ తీసేవారూ ఉన్నారు. దర్శకులు అయితే సూపర్ స్టార్ స్టాటస్ అనుభవిస్తున్నారు. చాలా మంది రెమ్యునరేషన్ కూడా ఊహకందని రేంజిలో ఉంటోంది. ఒకప్పుడు టాలీవుడ్ సినిమా పది కోట్లు కలెక్ట్ చేస్తే అబ్బో అని అంతా నోరేళ్ళబెట్టేవారు. ఆ తరువాత పాతిక కోట్లు, యాభై కోట్లు టార్గెట్ రీచ్ అయ్యేసరికి చాలా కాలమే పట్టింది. అయితే వంద కోట్ల నంబర్ చూడగలమా అన్న సందేహం ఉన్న దశలో అది ఏ మాత్రం అని కూడా పదేళ్ళ క్రితమే టాలీవుడ్ నిరూపించింది. ఆ తరువాత రెండు వందలు మూడు వందల నాలుగు వందల క్లబ్ అలా అయిదు వందల క్లబ్ దాకా ఏగబాకింది. అంతే కాదు వేయి కోట్లు రెండు వేల కోట్లు క్లబ్ వైపుగా దూసుకుని పోతోంది. రానున్న చిత్రాలతో మూడు వేల కోట్ల క్లబ్ ని కూడా డెడ్ ఈజీగా సాధిస్తారు అన్న చర్చ కూడా నడుస్తోంది.

రియల్ బూమ్ తో :

ఈ నేపథ్యంలో వేలల్లో పే చేస్తున్న సినిమాలు, వాటిని రూపొందిస్తున్న టెక్నీషియన్స్ టాప్ స్టార్స్ సూపర్ స్టార్స్ ఇలా ఎంతో మంది నిండి ఉన్న టాలీవుడ్ సంపద ఎంత అంటే వ్యక్తిగతంగా చాలా మంది సూపర్ స్టార్ల ఆస్తులు మూడు నుంచి అయిదు వేల కోట్ల దాకా ఉన్నాయని అంటూంటారు. అయితే ఇదంతా సినిమాల ద్వారానే సంపాదించిన ఆదాయం అనుకోవడానికి లేదు, ఎవరి మటుకు వారు వేరు వేరే బిజినెస్ లలో ఆర్జిస్తున్నది కూడా ఎంతో ఉంది. అలా కూడబెట్టుకున్న చర స్థిర ఆస్తులు అన్నీ కలిపితే బోలెడు సంపద అవుతోంది. ఇక టాలీవుడ్ లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్న వారు ఉన్నారు. అలా బూమ్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ లెక్కన టోటల్ టాలీవుడ్ కి ఉన్న ల్యాండ్ బ్యాంక్ విలువ లక్ష కోట్ల రూపాయలకు పై మాటగానే వినిపిస్తోంది అంటున్నారు.

ప్రభుత్వాల ప్రోత్సాహం :

మద్రాస్ లో ఉన్న టాలీవుడ్ ని ఆంధ్రాకు తీసుకుని రావాలని ఎర్లీ సెవెంటీస్ లో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలెట్టాయి. అలా వచ్చిన వారికి స్టూడియోలు కట్టుకోవడానికి నివసించడానికి భూములను నామ మాత్రం ధరలకు ఇచ్చే విధానాన్ని ఆనాటి ప్రభుత్వాలు అవలంబించాయి. ఫలితంగా మూడున్నర దశాబ్దాల క్రితం టాలీవుడ్ హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. అదే సమయంలో చాలా స్టూడియోలకు ప్రభుత్వం భూములను ఇచ్చింది. అలాగే జూబ్లీ హిల్స్ లాంటి చోట నివాసాల కోసం వేయి గజాలకు తగ్గకుండా ప్లాట్స్ ని కేటాయించింది. ఆనాటికి నామమాత్రం ధరలుగా అవి ఇచ్చినా ఇపుడు చూస్తే అవి కోట్లకు పడగలెత్తాయి. హైదరాబాద్ బాగా అభివృద్ధి చెంది విశ్వనగరం కావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రత్యేక రాష్ట్రంగా మారిన తరువాత హైదరాబాద్ మీద మరింత ఫోకస్ పెరిగింది. దాంతో అప్పట్లో భూములు తీసుకున్న వారు అంతా అపర కోటీశ్వరులు అయ్యారు.

భూముల మీద పెట్టుబడి :

అదే సమయంలో ఆనాడే తాము సంపాదించిన దాంట్లో కొంత పెట్టుబడి పెట్టాలనుకుని భూముల మీద పెట్టిన వారు అంతా ఇపుడు కుబేరులు అయిపోయారు. కోకాపేట లాంటి చోట ఎకరం భూమికో అంటే వందల కోట్ల రూపాయల దాకా పలుకుతున్న నేపథ్యం ఉంది. హెచ్ఎండీఏ తాజా వేలంలో కోకాపేట భూముల ధరలు ఎకరానికి ఏకంగా 137.25 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతే కాదు నియోపోలిస్ ప్లాట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో హెచ్ఎండీఏ ఆదాయం 1,355 కోట్ల రూపాయలు దాటింది. ఈ విధంగా చూస్తే హైదరాబాద్‌లోని కోకాపేటలో భూమి ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

నియోపోలిస్ ప్రాంతంలోని ఒక ప్లాట్ లో 4.59 ఎకరాలు భూమి అయితే ఏకంగా 5.31 ఎకరాలకు ఎగబాకింది.

సగటున కోటి పై మాటే :

కోకాపేట ఒక ప్రమాణంగా తీసుకున్నా ఇతర ప్రాంతాలలో భూములు కూడా ఎకరం భూమి కాస్తా అటూ ఇటూగా కోటికి పైమాటగా ఉంటోంది ఇటీవల రాయదుర్గం వేలం చూసినా అక్కడ మొత్తం 7.67 ఎకరాలను వేలం వేస్తే 1,357 కోట్ల రూపాయలు ధర పలికింది. కొనుగోలు చేసింది.అలా చూస్తే అక్కడ అక్కడ కనీస ధర ఎకరానికి 101 కోట్లుగా ఉంది. మరో వైపు కానీ భూమి ఎకరానికి 177 కోట్లకు అమ్ముడైన నేపధ్యం ఉంది.

స్థిరాస్థులు సిరులు :

ఈ క్రమంలో టాలీవుడ్ స్థిరాస్థులు వాటి విలువలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల పై మాటగా విలువ కలిగి ఉందని అంటున్నారు. ఏమీ కాదు అని అనుకున్న భూములు కొండ ప్రాంతాలలో ఇచ్చిన స్థలాలు కూడా ఇపుడు ఎకరం వందల కోట్లకు చేరుకుంటున్నాయంటే ఆలోచించాల్సిన విషయమే. మరో వైపు చూస్తే హైదరబాద్ లో చిత్రపురికి తన సొంత భూములను దానం చేసిన మహానుభావుడు ప్రముఖ సినీ నటుడు ఎం ప్రభాకర రెడ్డి. ఆయన టాలీవుడ్ హైదరాబాద్ కి రావాలని ఎంతగానో శ్రమించారు. ఇక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం నాయకుడిగా పనిచేశారు. వారి కోసమే చిత్రపురికి అవసరం అనుకున్నపుడు తన భూములనే ఇచ్చి దానకర్ణుడు అనిపించుకున్నారు. ఇపుడు ఆ భూముల విలువే రెండు వేల కోట్ల దాకా పలుకుతోంది అంటే సినీ కార్మికులకు దక్కిన ప్రతిఫలం ఎంతటి అద్భుత వరమో వేరేగా చెప్పాల్సిన పని లేదు.

దేశంలోనే గ్రేట్ :

ఈ రోజున బాలీవుడ్ ని సవాల్ చేసి టాలీవుడ్ ఎన్నో భారీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అదే విధంగా చూస్తే అపర కుబేరులు కూడా టాలీవుడ్ లో అధికంగా ఉన్నారు అని అంటున్నారు. మద్రాస్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన మొదట్లో ఏమో అనుకున్న వారు అంతా ఇప్పుడు నాడు ఇచ్చిన భూములే బంగారం పండిస్తూంటే జీవితంలో తాము ఎంత సాధించామో తెలుసుకుని మరీ మురిసిపోతున్నారు. టాప్ స్టార్స్ కొందరు అనేక చోట్ల భూములు కొని వేల కోట్లకు అధిపతులు అయిపోయారు మరి కొందరు చిన్న నటులు కూడా ఇదే విధంగా సంపాదించుకున్నారు. ఏది ఏమైనా సినీ పరిశ్రమ పట్ల పాలకులు చూపించిన ఉదారత్వం ఆ మీదట సినీ పరిశ్రమలో పలువురి ముందు చూపు అన్నీ కలసి టాలీవుడ్ కి లక్ష కోట్ల మేర ల్యాండ్ బ్యాంక్ ని క్రియేట్ చేసి పెట్టింది అని అంటున్నారు.