జూబ్లీహిల్స్ ఓటర్స్ లిస్ట్ లో తమన్నా,సమంత, రకుల్.. ఈసీ సీరియస్!
అయితే తాజాగా సమంత, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాలకి జూబ్లీహిల్స్ లో ఓటు ఉన్నట్టు ఓటర్ స్లిప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By: Madhu Reddy | 16 Oct 2025 4:50 PM ISTఏంటి ఈ స్టార్ హీరోయిన్లు జూబ్లీహిల్స్ ఓటర్లా.. చూస్తుంటేనే షాకింగ్ గా అనిపిస్తోందే అనుకుంటారు ఈ స్టార్ హీరోయిన్లకు సంబంధించిన ఓటర్ స్లిప్పులు చూస్తే.. మరి ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో కాదు.. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా భాటియా.. వీరు ముగ్గురు సినిమాల కోసం హైదరాబాదులో ఉంటారని తెలుసు. అలాగే సినిమాల కోసం హైదరాబాదులో ఎక్కడో ఓ చోట ఫ్లాట్లు కొనుక్కున్న సంగతి కూడా తెలుసు. కానీ జూబ్లీహిల్స్ లో ఓట్లు వేస్తారనే సంగతి మాత్రం తెలియదని ఈ హీరోయిన్లకు సంబంధించిన ఓటర్ స్లిప్పులు చూసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
అయితే తాజాగా సమంత, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాలకి జూబ్లీహిల్స్ లో ఓటు ఉన్నట్టు ఓటర్ స్లిప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఓటర్ స్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై ఈసీ సీరియస్ అయింది. జూబ్లీహిల్స్ లో ఈ హీరోయిన్లకు ఓటర్ స్లిప్పులు ఉంటే ఈసీ ఎందుకు సీరియస్ అవుతుందని మీరు అనుకోవచ్చు. కానీ అసలు కారణం ఏంటంటే..అసలు జూబ్లీహిల్స్ లో ఈ ముగ్గురికి ఓటు హక్కే లేదు. అవి వీరి పేర్ల మీద వైరల్ అవుతున్న ఫేక్ ఓటర్ స్లిప్పులు.. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే హీరోయిన్లకు సంబంధించిన ఫేక్ ఓటర్ స్లిప్పులు ఎలక్షన్ కమిషన్ కంటపడడంతో దీనిపై ఈసీ సీరియస్ అయ్యారు..
సమంత, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాలకు సంబంధించిన ఫేక్ ఓటర్ స్లిప్పులను క్రియేట్ చేసిన వారు ఎవరో విచారణ చేసి వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.అంతేకాదు జూబ్లీహిల్స్ లో ఉపఎన్నికలు జరుగుతున్న వేళ ఈసీ మరో వార్నింగ్ కూడా ఇచ్చింది. సోషల్ మీడియాలో తాజాగా కొన్ని ఫేక్ ఓటర్ లిస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈసీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలా ఫేక్ ఓటర్ లిస్ట్ ని బయటపెట్టి, ఇలా ఫేక్ ఓటర్ స్లిప్పులను క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే ఇలాంటి ఫేక్ ఓటర్ స్లిప్పులను వైరల్ చేసింది ఎవరో గుర్తించాలని తెలిపారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్లకు సంబంధించిన ఫేక్ ఓటర్ స్లిప్పులు ఎవరు ఫ్యాబ్రికేట్ చేశారో హైదరాబాద్ ఎన్నికల అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇలాంటి ఫేక్ ఓటర్ స్లిప్పులు వైరల్ చేస్తే గనుక కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
ఇలా సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి ఫేక్ ఓటర్ స్లిప్పులు ఎవరు వైరల్ చేశారో తెలియదు కానీ ఇవి సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా మొదట సమంత అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత తన అడ్రస్ ని జూబ్లీహిల్స్ కి మార్చుకుందట. కానీ ఆ తర్వాత విడాకులయ్యాక ముంబైకి వెళ్లడంతో మళ్ళీ తన ఓటర్ ఐడి లో అడ్రస్ అక్కడికే మార్చుకున్నట్టు తెలుస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా సౌత్ లో సినిమాలు చేస్తున్నప్పుడు ఇక్కడే ఓటు హక్కుని వినియోగించుకుందట. కానీ జాకీ భగ్నాని తో పెళ్లయ్యాక ముంబైకే పరిమితమైపోయింది.
కాబట్టి మళ్ళీ అక్కడికే అడ్రస్ చేంజ్ చేయించుకుందట. ఏది ఏమైనప్పటికి ఎన్నికల అధికారులను, సోషల్ మీడియాని తప్పుదోవ పట్టిస్తూ ఇలా సెలబ్రిటీల ఫేక్ ఓటర్ స్లిప్పులను క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ విషయం తెలిసిన జనాలు కూడా మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చాలా రసవత్తరంగా జరుగుతోంది . జూబ్లీహిల్స్ బరిలో బీఆర్ఎస్ పార్టీ నుండి మరణించిన మాగంటి గోపీనాథ్ భార్య సునీతకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి లోకల్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కి టికెట్ కేటాయించగా.. బీజేపీ నుండి దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు.
