Begin typing your search above and press return to search.

ఫాస్టాగ్ లేదా? కొత్త రూల్ గురించి తెలుసా?

జాతీయ రహదారుల మీద తరచూ ప్రయాణించే వారంతా తప్పనిసరిగా ఫాస్టాగ్ వాడుతూ ఉంటారు. అలాంటివారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడో ఒకసారి ప్రయాణించే వారికే చిక్కులన్నీ కూడా.

By:  Garuda Media   |   4 Oct 2025 1:45 PM IST
ఫాస్టాగ్ లేదా? కొత్త రూల్ గురించి తెలుసా?
X

జాతీయ రహదారుల మీద తరచూ ప్రయాణించే వారంతా తప్పనిసరిగా ఫాస్టాగ్ వాడుతూ ఉంటారు. అలాంటివారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడో ఒకసారి ప్రయాణించే వారికే చిక్కులన్నీ కూడా. జాతీయ రహదారుల టోల్ కేంద్రాలు దాదాపు ఫాస్టాగ్ లోకి తీసుకొచ్చేయటం.. ఫాస్టాగ్ లేని వాహనాలపై ఫైన్ మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. ఇప్పుడు దానికి భిన్నంగా ఒక కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

ఇప్పటివరకు జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ లేని వారు రెండు రెట్లు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుండేది. అయితే.. ఈ నిబంధనను తాజాగా కేంద్రం సడలించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న దానికి భిన్నంగా ఫాస్టాగ్ లేని వారు.. నగదు రూపంలో కాకుండా యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపితే తక్కువ ఫైన్ తో బయటపడొచ్చు.

ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానంలో రూ.100 టోల్ ఫీజు అయితే.. ఫాస్టాగ్ లేనోళ్లు.. నగదు రూపంలో రూ.200 చెల్లించాల్సి వచ్చేది. కొత్తగా వచ్చిన నిబంధన ప్రకారం యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపితే రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. ఈ కొత్త నిబంధన నవంబరు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇదే కాదు.. మరో కొత్త నిబంధనను తెర మీదకు తీసుకొచ్చారు.

అదేమంటే.. ఫాస్టాగ్ అకౌంట్ లో డబ్బులు ఉన్నా.. టోల్ గేటు వద్ద పేమెంట్ సిస్టంలో ఉన్న లోపం కారణంగా తగిన మొత్తం కట్ కాకుంటే.. వాహనదారులు ఫ్రీగా వెళ్లిపోయేలా నిబంధనను తీసుకొస్తున్నారు. సో.. ఫాస్టాగ్ లేకున్నా యూపీఐ పేమెంట్ ద్వారా ఫైన్ ను భారీగా తగ్గించుకునే వీలుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ కొత్త విధానం ఫాస్టాగ్ లేని వాహనదారులకు వరంగా మారుతుందని చెప్పక తప్పదు.