Begin typing your search above and press return to search.

సర్ అంటే కొత్త అర్ధం : ఈసీకి మమతా దీదీ షాక్

దేశంలోని పన్నెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ నవంబర్ 4 నుంచి స్టార్ట్ అయింది.

By:  Satya P   |   5 Nov 2025 9:13 AM IST
సర్ అంటే కొత్త అర్ధం : ఈసీకి  మమతా దీదీ  షాక్
X

దేశంలోని పన్నెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ నవంబర్ 4 నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియ సుమారు రెండు నెలల పాటు సాగుతుంది. ఇక తుది జాబితా కొత్త ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే సర్ ని దేశంలో పశ్చిమ బెంగాల్ లో కూడా అమలు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సర్ ని ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తామని చెబుతోంది. అయితే ఇండియా కూటమిలోని విపక్షాలు అయితే సర్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అతి పెద్ద బండ వేసిన మమత :

సర్ అంటే మరేమీ కాదు కంటికి కనిపించని సైలెంట్ రిగ్గింగ్ అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అతి పెద్ద రాజకీయ ఆరోపణ చేశారు. సర్ పేరుతో రిగ్గింగు కి తెర తీయడమే అని ఆమె భారీ ఆరోపణలే చేశారు. అంతే కాదు ఒక రాజ్యంగ సంస్థగా ఈసీ దేశంలో అమలు చేస్తున్న సర్ ప్రక్రియను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈసెని పూర్తిగా రాజీ పడిన సంస్థగా కూడా తేల్చారు. సర్ పేరుతో జరిగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అంతా ఒక మోసపూరితమైన విధానం అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

భయపడేది లేదంటూ :

ఈ సర్ ప్రక్రియను తాము భయపడేది లేదని మమత స్పష్టం చేశారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో భారీ మెజారిటీతో తృణమూల్ కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేతలు ధీమా వ్యక్తం చేశారు తృణమూల్ సక్సెస్ ట్రాక్ రికార్డు పశ్చిమ బెంగాల్ లో చూస్తే 2011, 2016, 2021 లలో వరసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని అలాగే 2014, 2019, 2024లలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే గెలిచిందని గుర్తు చేస్తున్నారు. ఇది ప్రజలతో తమ పార్టీకి ఉన్న బంధం అని అంటున్నారు.

నిరసన ర్యాలీలో మమతా బెనర్జీ :

సర్ కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాలొ తృణమూల్ కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. సర్ ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఈ ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే సర్ అన్నది రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీ నిర్వహిస్తోందని భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా టీఎంసీ వ్యవహరిస్తోందని బీజేపీ మండిపడుతోంది. సర్ లోని ఏమైనా తప్పులు ఉన్నాయని తోస్తే కనుక మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి తప్ప ఈ నిరసనలు ఏమిటి అని ప్రశ్నిస్తోంది. కేఅవలం పశ్చిమ బెంగాల్ లో మాత్రమే కాదని దేశంలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్ ని ఈసీ నిర్వహిస్తోందని గుర్తు చేసింది.