Begin typing your search above and press return to search.

దారుణం... 'పేరెంట్స్ ని కాదని పెళ్లి చేసుకున్నవారికి ఓ గుణపాఠం'!

అవును... తిరుపతి జిల్లా పుత్తురు మండలం నేషనూరుకు చెందిన కన్నెప్పరెడ్డి కుమార్తె పద్మ (28).. తోరూరుకు చెందిన శివశంకర్ డిగ్రీ చదువుకునే రోజుల నుంచీ మంచి స్నేహితులు.

By:  Raja Ch   |   8 Feb 2026 11:45 AM IST
దారుణం... పేరెంట్స్  ని కాదని పెళ్లి చేసుకున్నవారికి ఓ గుణపాఠం!
X

ఈ రోజుల్లో తల్లి తండ్రులు సంబంధాలు చూసి, వారి అనుమతితో పెళ్లిల్లు చేసుకునేవారు ఉండగా.. ఒకరినొకరు ప్రేమించుకుని ఇరు కుటుంబాల అంగీకరంతో వివాహాలు చేసుకునేవారూ ఉన్నారు. ఇదే క్రమంలో.. తల్లితండ్రులను కాదని బయటకు వెళ్లి ప్రేమ వివాహాలు చేసుకునేవారికీ కోదవ లేదు! ఈ క్రమంలో తాజాగా తల్లితండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ తన జీవితం ఓ గుణపాఠం అంటూ ఓ వివాహిత రాసిన ఆత్మహత్య లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... తిరుపతి జిల్లా పుత్తురు మండలం నేషనూరుకు చెందిన కన్నెప్పరెడ్డి కుమార్తె పద్మ (28).. తోరూరుకు చెందిన శివశంకర్ డిగ్రీ చదువుకునే రోజుల నుంచీ మంచి స్నేహితులు. ఈ క్రమంలో స్నేహం పెరిగి, ప్రేమగా మారింది. ఈ క్రమంలో వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధపడగా.. కులాలు వేరు కావడంతో పాటు శివశంకర్ పనిలేక జులాయిగా తిరుగుతున్నాడని పద్మ తల్లితండ్రులు అంగీకరించలేదు. అయినప్పటికీ లవ్ మ్యారేజ్ విషయంలో పద్మ వెనక్కి తగ్గలేదు.

ఈ క్రమంలో 2019లో శివశంకర్ ని వివాహం చేసుకుంది. వీరికి తేజ (6), లాస్య (5) కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ఈ క్రమంలో శివశంకర్ జులాయిగా తిరుగుతూ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదంట. దీంతో.. డ్వాక్రా గ్రూపు సభ్యురాలైన పద్మ.. లోన్ తీసుకున్నారు. పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి ఖర్చుల విషయాలను శివశంకర్ పూర్తిగా వదిలేశాడట. దీంతో.. ఇటీవల అతన్ని పెద్దమనుషులు మందలించారని అంటున్నారు.

ఈ క్రమంలో శనివారం బయటకు వెళ్లిన భర్తకు ఫోన్ చేసిన పద్మ... డ్వాక్రా అప్పు గురించి ప్రశ్నించింది. అయితే.. తాను అప్పు చెల్లించలేదని శివశంకర్ చెప్పడంతో పద్మ తీవ్ర మనస్తాపం చెందింది. ఈ సమయంలో.. ఆత్మహత్య లేఖ రాసి.. ఇద్దరు పిల్లలకు ఉరేసి చంపి, తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. సాయంత్రం ఇంటికొచ్చిన శివశంకర్.. తలుపులు వేసి ఉండటంతో పాటు, ఎంతకూ తలుపులు తీయకపోవడంతో పద్మ తండ్రికి ఫోన్ చేశాడు.

ఆయన వచ్చి తలుపులు పగలగొట్టి చూసే సరికి.. బెడ్ రూమ్ లో పిల్లలు, హాల్ లో పద్మ విగతజీవులుగా ఉరికి వేలాడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె రాసిన ఆత్మహత్య లేఖ సంచలనంగా మారింది. భర్త ఆర్థిక పరిస్థితి.. తన పరిస్థితి.. ఇంటిని నడపడం, పిల్లలను చదివించడంలో పడుతున్న ఇబ్బందులతో పాటు.. తల్లితండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ తన జీవితం ఓ గుణపాఠం అంటూ ఆమె పేర్కొన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ సందర్భంగా... తల్లి తండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ తన జీవిత ఓ గుణపాఠమని.. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదని అనుకుంటుందో.. అలాంటి లక్షణాలన్నీ తన భర్తలో ఉన్నాయని.. ఇది తాను కలలో కూడా ఊహించనిదని తెలిపింది. శివశంకర్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న పాపానికి తాను ఎంత కష్టపడిదీ తనకే తెలుసని.. తనతో పాటు పిల్లలు కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొంది.