Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ: మాస్ పాలిటిక్స్ చేయాల్సిందే... !

ఇక‌, తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వివాదంపై వైసీపీ తరపున ఎంపీ గట్టిగా వాయిస్ వినిపించారు.

By:  Garuda Media   |   1 Oct 2026 6:00 PM IST
వైసీపీ ఎంపీ: మాస్ పాలిటిక్స్ చేయాల్సిందే... !
X

ఏపీలో రాజ‌కీయం అంటే.. ఊర మాస్‌! ఈ మాట నాయ‌కులే చెబుతున్నారు. క్లాస్ పాలిటిక్స్ ఇక్క‌డ న‌డిచే ప‌రిస్థితి లేదు. బ‌హుశ ఈ విష‌యం ఇంకా వైసీపీ ఎంపీగా ఉన్న తిరుప‌తి నేత‌.. గురుమూర్తికి తెలిసిన‌ట్టుగా లేదు. ఆయ‌న రెండోసారి విజ‌యం ద‌క్కించుకున్నాక కూడా ఇంకా క్లాస్ పాలిటిక్స్‌కే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆయ‌న పెద్దగా పుంజుకుంటున్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌న్న‌ది పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. గతంలో జగన్ కు ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేసిన ఆయన, 2021 ఉపఎన్నికలో తొలిసారి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి తిరుపతి ఎంపీగా విజయం సాధించారు.

నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నలు సంధించే విష‌యంలో గురుమూర్తి ముందున్న‌మాట వాస్త‌వం. పార్లమెంటులో తిరుపతికి సంబంధించిన పలు మౌలిక సదుపాయాల సమస్యలపై వందకు పైగా ప్రశ్నలు సంధించారు. రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. అదేస‌మ‌యంలో తిరుపతిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థను అమరావతికి తరలించాలనే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ, తిరుపతిలోనే 15 ఎకరాల శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఇక‌, తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వివాదంపై వైసీపీ తరపున ఎంపీ గట్టిగా వాయిస్ వినిపించారు.కానీ, ఇవేవీ పెద్ద‌గా ఆయ‌న‌కు పేరు తీసుకురావ‌డం లేదు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయినప్పటికీ, తిరుపతి రీజియన్‌లో పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ కు నమ్మకస్థుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటున్నారు. కానీ, మేజ‌ర్ పాలిటిక్స్‌విష‌యానికి వ‌స్తే.. తిరుప‌తిలో కూట‌మి బ‌లంగాఉంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల నాయ‌కులు రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

వీరితో కంపేర్ చేసుకుంటేతిరుప‌తి ఎంపీగా గురుమూర్తి వెనుక‌బ‌డ్డార‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కు లు కూడా అధిష్టానానికి వివ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాయ‌కులు మాత్ర‌మే రాజ‌కీయాల్లో దూకుడుగా ఉంటున్నారు. కానీ, గురుమూర్తి స్ట‌యిల్ వేరేగా ఉంది. దీంతో తిరుప‌తిలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చ‌క్రం తిప్పుతున్నామ‌ని నాయ‌కులు అంటున్నారు. అయితే.. దీనిని కొంద‌రు నాయ‌కులు వ్య‌తిరేకిస్తున్నారు. ఇక‌, ఎంపీగా త‌న‌కంటే ప్ర‌త్యేక వ‌ర్గాన్ని మెయిటెన్ చేయ‌క‌పోవ‌డం ఒక‌ర‌కంగా మంచిదే అయినా.. ఫ్యూచ‌ర్ పాలిటిక్స్‌కు మాత్రం ఎంపీకి ఇబ్బంద‌న్న చ‌ర్చ ఉంది. సో.. గురుమూర్తి మాస్ పాలిటిక్స్‌వైపు దృష్టి పెట్టాల‌న్న‌ది మెజారిటీ నాయ‌కులు కోరుతున్న మాట‌.