Begin typing your search above and press return to search.

వామ్మో.. ఇదేం అత్తరా బాబు? కూతురి కాపురానికే ఎసరు!

ఈ అరాచక ఉదంతం గురించి వింటే ఇదేం పోయేకాలం? అని అనుకోకుండా ఉండలేం. ఒక అత్త బరితెగింపు షాక్ తినేలా చేసింది.

By:  Garuda Media   |   5 Oct 2025 11:25 AM IST
వామ్మో.. ఇదేం అత్తరా బాబు? కూతురి కాపురానికే ఎసరు!
X

ఈ అరాచక ఉదంతం గురించి వింటే ఇదేం పోయేకాలం? అని అనుకోకుండా ఉండలేం. ఒక అత్త బరితెగింపు షాక్ తినేలా చేసింది. అలా అని ఈ ఉదంతం అక్కడెక్కడో కాదు.. తెలుగు రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. బంధాలకు.. అనుబంధాలకు పాతర వేస్తూ.. విలువలకు సమాధి కడుతున్న ఇలాంటి ఉదంతాలు ఇప్పుడు వినేందుకే వికారంగా మారుతున్నాయి. అసలేం జరిగిందంటే..

తిరుపతి జిల్లాలోని కేవీబీపురం మండలానికి చెందిన పద్దెనిమిదేళ్ల బాలుడు.. పదిహేనేళ్ల బాలికను ఐదు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదే ఒక దారుణ నేరమైతే.. ఈ జంటతోనే భర్త పోయిన బాలిక తల్లి (40) కూడా వీరితోనే కలిసి ఉంటోంది. కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా అల్లుడితో వివాహేతర సంబందాన్ని ఏర్పడింది.

శుక్రవారం భార్య పక్కనే ఉండగా వారిద్దరూ పెళ్లి చేసుకోబోయారు. కూతురు నిద్రపోతున్న వేళ.. అల్లుడి చేత తాళి కట్టించుకునే ప్రయత్నం చేయటం.. దీంతో భర్తను బాలిక అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె తల్లి..భర్త కలిసి ఆమెపైకి దాడికి దిగారు. రోకలి బండతో తల మీద కొట్టటంతో ఆమె పెద్ద ఎత్తున కేకలు వేసింది.

దీంతో.. స్పందించిన స్థానికులు ఆమెను కాపాడారు. అనంతరం అత్త.. అల్లుడి ఘనకార్యం గురించి తెలుసుకున్న వారు.. ఆగ్రహంతో ఊగిపోతూ.. వారిద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సిత్రమైన కేసు పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి. స్థానికంగా ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.