జంతుకొవ్వు లేదన్న వాదన సరే.. ఈ రసాయనాల మాటేంటి?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన రసాయన ఆయిల్ (నెయ్యి కాని నేపథ్యంలో..కల్తీ నెయ్యి అన్న మాట కంటే కూడా రసాయన ఆయిల్ అంటే బాగుంటుంది.
By: Garuda Media | 10 Feb 2026 10:32 AM ISTతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన రసాయన ఆయిల్ (నెయ్యి కాని నేపథ్యంలో..కల్తీ నెయ్యి అన్న మాట కంటే కూడా రసాయన ఆయిల్ అంటే బాగుంటుంది. తిరుమలకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సరఫరా అయిన 68.17 లక్షల కేజీల రసాయనాల ఆయిల్ ను టీటీడీకి సరఫరా చేశారు. ఇందులో నెయ్యి అనే పదార్థం కంటే కూడా బోలెడన్ని రసాయనాలతో నెయ్యి లాంటి రసాయన నెయ్యిని తయారు చేశారు. తిరుమల లడ్డూ కోసం ఈ తరహా దుర్మార్గ కెమికల్ ఆయిల్ ను పంపిన కంపెనీల్లో భోలేబాబా, వైష్ణవి డెయిరీ, మాల్ గంగా, ఏఆర్ డెయిరీలు ఉన్నాయి.
తాము సరఫరా చేసిందంతా శుద్ధమైన నెయ్యిగా పేర్కొంటూ టీటీడీ నుంచి రూ.234.51 కోట్లను కొల్లగొట్టారు. రసాయన మిశ్రమంతో తయారుచేసిన లడ్డూ ప్రసాదాన్ని శ్రీవారికి ప్రసాదంగా పెట్టారు. ఇంతకూ ఈ రసాయన ఆయిల్ లో ఏమేం కలిపారు? అన్న విషయంలోకి వెళితే.. బయటకు వచ్చే వివరాల్ని చూస్తే షాక్ కు గురి కావాల్సిందే. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని తయారుచేసిన ఉదంతంపై సిట్ విచారణలో పలు షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. తిరుమలకు నెయ్యి పేరుతో కెమికల్ కొండను ఆయిల్ రూపంలో సరఫరా చేసిన సంస్థలు చేసిన దుర్మార్గాల్ని గుర్తించారు.
తాము కొన్ని కెమికల్స్ గుట్టురట్టు కాకుండా ఉండేందుకు పామాలిన్. పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరినూనెలను కొన్నట్లుగా దొంగ ఇన్ వాయిస్ లనుక్రియేట్ చేవారు. భోలేబాబా డెయిరీకి సరఫరా చేసిన ఈ రసాయనాల వెయిట్ ఏకంగా 6.51 లక్షల కేజీలు ఉండటం చూస్తే.. ఈ దందా ఎంత భారీగా జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అధికారిక పత్రాల్లో తాము పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరినూనెల్ని కొన్నట్లుగా చెప్పినా.. సిట్ విచారణలో భాగంగా కంపెనీ ప్రాంగణంలో తనిఖీ చేయగా.. అక్కడ అలాంటివేమీ కనిపించకపోగా.. కొరియా నుంచి దిగుమతి చేసుకున్న మెనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ లాంటి రసాయనాలు లభించటం గమనార్హం. ఒక్క భోలేబాబా డెయిరీలోనూ కాదు.. మిగిలిన చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే.
లడ్డూ ప్రసాదంలో వినియోగించిన రసాయనాల జాబితాను చూస్తే.. కడుపు మండిపోవాల్సిందే. పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, లాక్టిక్ యాసిడ్, లీనియర్ అల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ (సింఫుల్ గా చెప్పాలంటే లబ్సా), ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ ఫుడ్ గ్రేడ్, మోనోగ్లిజరైడ్స్, డైగ్లిజరైడ్స్ లు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ రసాయనాలు మనిషికి చేసే చేటు అన్ని ఇన్ని కావు. ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అసలుసిసలు రసాయనాలతో తయారు చేసిన వారిని ఎలా శిక్షించాలి?
