Begin typing your search above and press return to search.

తిరుమల కళ్యాణ కట్ట లో బ్లేడ్ల ఖర్చు చూస్తే వామ్మో...!

తిరుమలకు ప్రతీ వారు ఎన్నో సార్లు వెళ్తారు. వెళ్ళిన వారు అంతా తమ తలనీలాలు సమర్పించుకుంటారు.

By:  Satya P   |   18 Dec 2025 12:15 AM IST
తిరుమల కళ్యాణ కట్ట లో బ్లేడ్ల ఖర్చు చూస్తే వామ్మో...!
X

తిరుమలకు ప్రతీ వారు ఎన్నో సార్లు వెళ్తారు. వెళ్ళిన వారు అంతా తమ తలనీలాలు సమర్పించుకుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. అలా అతి పెద్ద కళ్యాణ కట్టను తిరుమలలో ఏర్పాటు చేసి దశాబ్దాలుగా టీటీడీ సేవ చేస్తోంది. అయితే రోజుకే వేలల్లో భక్తులు వస్తారు. వారు సమర్పించే తలనీలాల కోసం కళ్యాణ కట్ట వద్ద పెద్ద క్యూలే కనిపిస్తాయి. కానీ ఎవరూ ఆలోచించని ఊహించని విషయం అయితే ఒకటి ఉంది. అదే కళ్యాణ కట్ట వద్ద రోజుకు ఎన్ని బ్లేడ్లు వాడతారు అని. ఆ నెంబర్ ఎంతో నిజంగా తెలిస్తే షాకే అని అంటున్నారు.

రోజుకు 35 వేల దాకా :

తిరుమలలో ప్రతీ రోజూ ముప్పయి అయిదు వేల రూపాయలు ఈ బ్లేడ్ల కోసం ఖర్చు చేస్తారు. అంటే హాఫ్ బ్లేడ్ ఒకరికి వినియోగించిన కొన్ని వేల మంది దాకా తలనీలాలు సమర్పిస్తారు అని అంచనా గా ఉంది. అంటే ఇన్ని వేల రూపాయలు భక్తుల కోసం బ్లేడ్లకు ఖర్చుగా అక్కడ వాడుతారు అన్న మాట. ఒకరికి వాడిన బ్లేడ్ మరొకరికి వాడరు. అలా చూస్తే కనుక బ్లేడ్లకే అతి పెద్ద ఖర్చు అవుతుంది. నెలకు చూస్తే పది లక్షలకు పైగా బ్లేడ్ల కోసమే పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. అదే ఏడాదికి తీసుకుంటే ఏకంగా కోటీ ఇరవై లక్షల రూపాయల దాకా బ్లేడ్ల వినియోగం ఉంటుంది అన్న మాట.

విరాళాల రూపంలో :

అయితే ఈ బ్లేడ్ల ఖర్చు కూడా టీటీడీకి విరాళాల రూపంలో వస్తుంది అని అంటున్నారు. అనేక సేవా సంస్థలు ట్రస్టులు సామాజిక సేవలో భాగంగా కళ్యాణ కట్ట వద్ద వినియోగించే బ్లేడ్లకు విరాళాలు ఇస్తూంటారు. అలా తాజాగా హైదరాబాద్ కి చెందిన ఒక భారీ సంస్థ ఏకంగా కోటీ ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే బ్లేడ్లను టీటీడీకి ఇచ్చింది. దీంతో ఒక ఏడాది పాటు బ్లేడ్లకు చూసుకోనవసరం లేకుండా ఈ బ్లేడ్లను టీటీడీ ఉపయోగిస్తుంది అని అంటున్నారు.

భారీ ఎత్తున ఖర్చు :

ఇంతే కాదు టీటీడీ నియమించిన ఖురకులకు కూడా ఆదాయం ఇవ్వాల్సి ఉంటుంది. పైగా వారు అంతా నాలుగు షిఫ్టులలో నిరంతరం పనిచేస్తూంటారు. అలా తలనీలాల వద్దనే పెద్ద ఖర్చు ఉంటుంది. తలనీలాలు అన్నది అత్యంత సెంటిమెంట్ వ్యవహారంగా ఉంటుంది. స్వామి దర్శనం చేసుకునే వారు తప్పనిసరిగా తమ తలనీలాలు ఇస్తారు. ఇక ఉదయం ఉదయం 3 గంటల నుండి 9 గంటల వరకూ, ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకూ, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ , రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకూ ఇలా నాలుగు షిఫ్టులు నడుస్తూనే ఉంటాయి. అయితే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తలనీలాల సమర్పణ కోసం భక్తులు వస్తూంటారు. మొత్తం మీద తిరుమల అంటే గుర్తుకు వచ్చేది లడ్డూతో పాటు గుండు కూడా. దానికి అయ్యే ఖర్చు బ్లేడూ కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే మరి.