అబ్బాయిలూ జర జాగ్రత్త.. రెస్టారెంట్స్ కొత్త స్కామ్!
ఒకప్పుడు అమ్మాయిలు చాలా పద్ధతిగా, సాంప్రదాయబద్దంగా ఉండటమే కాకుండా వంటింట్లో నుండి బయటికి రాకపోయేవారు.
By: Madhu Reddy | 26 Aug 2025 8:00 PM ISTఒకప్పుడు అమ్మాయిలు చాలా పద్ధతిగా, సాంప్రదాయబద్దంగా ఉండటమే కాకుండా వంటింట్లో నుండి బయటికి రాకపోయేవారు. కానీ ఇప్పటి జనరేషన్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు. ప్రతి ఒక్క రంగంలో రాణిస్తున్నారు. అయితే ఇది ఒకంతుకు మంచిదే కానీ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తూ వాళ్ళ జేబులు ఖాళీ అయ్యేలా చేస్తున్నారు. మరికొంతమంది అమ్మాయిల వల్ల అబ్బాయిలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే అందరు అమ్మాయిలు ఇలా ఉంటారని కాదు. అయితే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలామంది అమ్మాయిల వల్ల అబ్బాయిలు మోసపోతున్నారు. డేటింగ్ యాప్ ల వంటి వాటి వల్ల అటు అమ్మాయిలకు ఇటు అబ్బాయిలకు ఇద్దరికి నష్టం జరుగుతుంది. అయితే తాజాగా ఓ కొత్త రకం మోసం ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి అమ్మాయిల ట్రాప్ లో పడితే మాత్రం అబ్బాయిల జేబులు ఖాళీ అవుతాయట.మరి ఆ కొత్తరకం మోసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా మెట్రో నగరాల్లో కొత్త రకం మోసం బయటపడింది.మెట్రో నగరాల్లో ఉన్న కొన్ని రెస్టారెంట్లలో ఉండే మేనేజర్లు,ఓనర్లు.. కాలేజ్ అమ్మాయిలతో ఒక కొత్త రకమైన ఒప్పందాన్ని కుదిర్చుకొని టిండర్ డేటింగ్ యాప్ ద్వారా వాళ్ళ ప్రొఫైల్ ను ఆ యాప్ లో ఉంచి వారి ద్వారా కొంతమంది మగవాళ్లను ఆకర్షితులను చేసి చివరికి తమ రెస్టారెంట్లకు వచ్చి విపరీతంగా ఖర్చు పెట్టించి బిజినెస్ చేయించుకోవాలి అనుకుంటున్నారు. అలా ఈ టిండర్ డేటింగ్ యాప్ ద్వారా కొంతమంది కాలేజీలో చదువుకునే అమ్మాయిలు పార్ట్ టైం జాబ్ లాగా దీన్ని ఎంచుకుంటున్నారు. ఇక ఈ కాలేజీ అమ్మాయిల్ని వాళ్లతో బిజినెస్ డీల్ లాగా ఒప్పందం కుదుర్చుకొని టిండర్ డేటింగ్ యాప్ లో వాళ్ళ ఫోటోలను పెట్టించి కొంతమంది అబ్బాయిలని ట్రాప్ చేస్తారు. అలా ట్రాప్ చేసి వాళ్ల రెస్టారెంట్లకు రప్పించుకొని డేట్ లో ఆ అమ్మాయితో అబ్బాయి ఇద్దరు డేట్ కూర్చున్నాక స్పెషల్ ఫుడ్, డ్రింక్స్ ఆర్డర్ చేయిస్తారు.
ఈ విషయం ముందుగానే ఆ అమ్మాయిలకు తెలుసు. అలా స్పెషల్ ఫుడ్స్ ని ఆ రెస్టారెంట్ ద్వారా ఆర్డర్ చేసుకుంటారు. అలా స్పెషల్ ఫుడ్ కి ఖర్చు ఏకంగా 10,000 నుండి 50 వేల వరకూ అవుతుంది. ఇక బిల్ కట్టే వరకే అక్కడ కనిపిస్తుంది. అబ్బాయి బిల్లు కట్టాక అక్కడి నుండి మాయమవుతుంది.ఆ అబ్బాయిలు కట్టిన బిల్లులో దాదాపు 20% రెస్టారెంట్ యాజమాన్యం ఆ అమ్మాయికి ఇచ్చేస్తారు.. ఇలా టిండర్ డేటింగ్ యాప్ ద్వారా కొత్త రకం మోసం చేస్తున్నారు అమ్మాయిలు. అయితే అమ్మాయిలు డబ్బు కోసం ఇలా చేస్తూ అమాయకులైన మగవాళ్ళను డేటింగ్ పేరుతో మోసం చేసి రెస్టారెంట్ లకి బిజినెస్ చేయిస్తున్నారు. అప్పుడప్పుడు కొంతమంది అమ్మాయిలు కూడా రెస్టారెంట్ ఓనర్ల ద్వారా మోసపోతున్నారట.. ఎందుకంటే డబ్బు వస్తుందనే ఆశతో రెస్టారెంట్ యాజమాన్యంతో డీల్ కుదుర్చుకుంటారు. కానీ ఆ తర్వాత రెస్టారెంట్ యాజమాన్యం డబ్బు ఇవ్వకపోతే ఆ అమ్మాయిలు బెట్టు చేస్తే మాత్రం అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారట.
అయితే ఈ విషయం గురించి తాజాగా కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది కాస్తా బయటికి వచ్చింది.. ముంబైలో 50 రెస్టారెంట్ల మీద కేసులు నమోదయ్యాయి.అయితే రీసెంట్గా హైదరాబాద్ లో కూడా ఒక కేసు నమోదయ్యింది.కానీ ఈ డేటింగ్ యాప్ తో మోసపోయిన చాలా మంది అబ్బాయిలు పరువు పోతుందనే ఉద్దేశంతో దీన్ని బయట పెట్టకుండా ఉండిపోతున్నారట.
