Begin typing your search above and press return to search.

లోకేష్ కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్... మంత్రి రియాక్షన్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కు ఆసియా కప్‌ ఫైనల్‌ హీరో, టీమిండియా యంగ్ క్రికెటర్‌ తిలక్‌ వర్మ ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు.

By:  Raja Ch   |   29 Sept 2025 3:37 PM IST
లోకేష్ కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్... మంత్రి రియాక్షన్ ఇదే!
X

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కు ఆసియా కప్‌ ఫైనల్‌ హీరో, టీమిండియా యంగ్ క్రికెటర్‌ తిలక్‌ వర్మ ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు. పాకిస్థాన్‌ తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ లో తాను ఉపయోగించిన క్యాప్‌ ను లోకేష్ కు ప్రేమతో ఇస్తున్నట్లు తిలక్‌ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వర్మ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

అవును... ఆసియా కప్‌ ఫైనల్‌ లో టీమిండియా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ ను ఓడించి మరోసారి ఆసియా కప్ ఛాంపియన్‌ గా నిలిచింది. ఈ ఫైనల్‌ మ్యాచ్ గెలుపులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు.. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో యావత్ భారతం సంబరాల్లో మునిగి తేలింది.

ఈ క్రమంలో... ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కుర్రాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్‌ కు వచ్చారు. అక్కడికి రాగానే తిలక్ వర్మ తన క్యాప్‌ తీసుకుని.. 'డియర్ లోకేష్ అన్న.. లాట్స్ ఆఫ్ లవ్.. ఇది నీ కోసమే' అంటూ దానిపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. క్యాప్ మీద రాస్తున్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్ చేశారు.

ముగ్ధుడైన మంత్రి లోకేష్!:

తిలక్‌ వర్మ బహుమతికి మంత్రి నారా లోకేష్ ముగ్ధుడయ్యారు. ఈ మేరకు ఆయన ఆన్ లైన్ వేదికగా స్పందిస్తూ... 'తమ్ముడు తిలక్‌ వర్మ బహుమతి నాకెంతో ప్రత్యేకమైంది. స్వదేశానికి వచ్చాక అతడి చేతుల మీదుగానే క్యాప్‌ తీసుకుంటా'అని పేర్కొన్నారు. క్యాప్‌ పై తిలక్‌ వర్మ సంతకం చేస్తున్న వీడియోను ఈ సందర్భంగా లోకేష్ షేర్‌ చేశారు.