Begin typing your search above and press return to search.

వీడియో వైరల్.. పాక్ మహిళల్లో తిలక్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

ఈ సమయంలో.. భారీ స్క్రీన్‌ పై మ్యాచ్ చూస్తున్న పాకిస్తానీ అభిమానులలో కొంతమంది మహిళల్లో ఒకరు.. 'జై మాతా ది' అని అన్నారు.

By:  Raja Ch   |   1 Oct 2025 12:36 PM IST
వీడియో వైరల్.. పాక్ మహిళల్లో తిలక్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
X

దుబాయ్‌ లో జరిగిన ఆసియా కప్-2025 ఫైనల్‌ లో టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ (69* పరుగులు) ఆడి.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్ పై ఉత్కంఠభరితమైన విజయన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తిలక్ పెర్ఫార్మెన్స్ అనంతరం కొంతమంది పాకిస్తానీ మహిళలు అతని కోసం నినాదాలు చేస్తూ కనిపించారు. ఇది వైరల్ గా మారింది.

అవును... దుబాయ్ లో జరిగిన ఆసియా కఫ్ ఫైనల్లో పాక్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించడంలో తిలక్ తన బలాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 20/3తో కష్టాల్లో ఉన్న సమయంలో రంగంలోకి దిగిన తిలక్... సంజు సామ్సన్, శివమ్ దుబేలతో కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు.

ఈ సమయంలో.. భారీ స్క్రీన్‌ పై మ్యాచ్ చూస్తున్న పాకిస్తానీ అభిమానులలో కొంతమంది మహిళల్లో ఒకరు.. 'జై మాతా ది' అని అన్నారు. ప్రధానంగా ఫైనల్ లో తిలక్ పెర్ఫార్మెన్స్ చూసిన పాక్ మహిళలు ఫుల్ ఖుషీగా ఉంటూ "తిలక్" నామస్మరణ చేస్తూ సందడి చేయడం గమనార్హం. దీంతో.. పాక్ మహిళల్లో తిలక్ క్రేజ్ మామూలుగా లేదుగా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

పాక్ పై ఇన్నింగ్స్ ఫేవరెట్!:

ఆసియా కప్‌ ఫైనల్లో అద్భుత బ్యాటింగ్‌ తో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్' గా నిలిచి స్వదేశానికి తిరిగొచ్చిన తిలక్‌.. మంగళవారం హైదరాబాద్‌ లింగంపల్లిలోని లేగాల అకాడమీని సందర్శించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన తిలక్.. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే కానీ ఓడిపోవద్దని అనుకున్నామని తెలిపారు.

ఇదే సమయంలో... దేశమే అన్నిటికంటే గొప్ప అని, అందుకే సంయమనం పాటించి ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేసినట్లు తెలిపారు. ఒక్కో బంతిని జాగ్రత్తగా ఎదుర్కొన్నట్లు చెబుతూ భారత్‌ మ్యాచ్‌ గెలవడమే ముఖ్యం అని అన్నారు. అనవసరంగా ఆవేశానికి గురై.. ఏదైనా చెత్త షాట్‌ ఆడితే వికెట్‌ కోల్పోయే ప్రమాదం ఉంటుందనే ఆలోచనతో బ్యాటింగ్ చేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఇంగ్లాండ్‌ పై కూడా మంచి ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. ఆసియా కప్‌ ఫైనల్లో పాకిస్థాన్ పై ఆడిన ఇన్నింగ్సే తన ఫేవరెట్‌ అని తెలిపారు.