Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మహానగర పోలీసింగ్ కు కొత్త రూపు

అదే సమయంలో కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగో కమిషనరేట్ తో పాటు.. ఇప్పటివరకున్న మూడు కమిషనరేట్ సరిహద్దుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

By:  Garuda Media   |   30 Dec 2025 9:52 AM IST
హైదరాబాద్ మహానగర పోలీసింగ్ కు కొత్త రూపు
X

పాలన మీద పట్టు సాధించలేదన్న విమర్శను ఎదుర్కొంటున్న రేవంత్ ప్రభుత్వం.. ఇటీవల కాలంలో తన దూకుడును పెంచింది. జూబ్లీహిల్స్ ఉపపోరులో ఘన విజయాన్ని సాధించిన తర్వాత నుంచి ఒకటి తర్వాత ఒకటి చొప్పున కీలక నిర్ణయాల్ని తీసుకోవటమే కాదు.. వరుస పెట్టి విధానపరమైన మార్పుల్ని చేపడుతున్నారు. ఇప్పటివరకున్న జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించటమే కాదు.. అందుకు అనుగుణంగా మహానగర పోలింగ్ వ్యవస్థనూ మార్చే నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇప్పటివరకు హైదరాబాద్ మహానగర పోలిసింగ్ స్వరూపాన్ని చూస్తే.. హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ కమిషనరేట్ గా విభజించటం తెలిసిందే. పేరుకు రాచకొండ కమిషనరేట్ పరిధి మహానగరాన్ని దాటేసి దగ్గర దగ్గర నల్గొండ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్ని టచ్ చేసే పరిస్థితి. అందుకు భిన్నంగా ఇటీవల మార్చిన జీహెచ్ఎంసీ సరిహద్దులకు అనుగుణంగా నగర పోలీసింగ్ ను మార్చేస్తూ తాజాగా రేవంత్ సర్కారు నిర్ణయాన్ని తీసుకుంది.

ఇప్పటివరకున్న మూడు కమిషనరేట్ స్థానంలో నాలుగు కమిషనరేట్ లకు పెంచుతూ నిర్ణయం తీసుుకోవటమే కాదు.. రాచకొండ పరిధిలోని ఉమ్మడి నల్గొండ పరిధిలోని కొంత ప్రాంతాన్ని జిల్లా హోదా ఇచ్చేసి.. దానికి ప్రత్యేకంగా ఎస్పీని నియమించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో.. ఇంతకాలం రాచకొండ పరిధిలో ఉన్న యాదాద్రి - భువనగిరి ప్రాంతాన్ని ప్రత్యేక యూనిట్ గా ఏర్పాటు చేసి సదరు జిల్లాకు ఎస్పీని నియమించాలని నిర్ణయించారు.

అదే సమయంలో కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగో కమిషనరేట్ తో పాటు.. ఇప్పటివరకున్న మూడు కమిషనరేట్ సరిహద్దుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా చూస్తే.. విస్తరించిన జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేయనున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఏర్పడిన నాలుగు కమిషనరేట్ లను చూస్తే..

- హైదరాబాద్ కమిషనరేట్

దీనికి కమిషనర్ గా ప్రస్తుతం ఉన్న సజ్జన్నార్ కొనసాగుతారు

- సైబరాబాద్ కమిషనరేట్

డాక్టర్ ఎం రమేశ్ నియమితులయ్యారు

- మల్కాజిగిరి కమిషరేట్

సైబరాబాద్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న అవినాశ్ మహంతి నియమితులయ్యారు

- ఫ్యూచర్ సిటీ కమిషనరేట్

ఇప్పటివరకు ఉన్న రాచకొండ సీపీ సుధీర్ బాబు ఇకపై ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా వ్యవహరిస్తారు

హైదరాబాద్ కమిషనరేట్ పరిధి విషయానికి వస్తే..

- అసెంబ్లీ

- సెక్రటేరియట్

- బేగంపేట

- శంషాబాద్ ఎయిర్ పోర్టు

- బుద్వేల్

- హైకోర్టు తదితర కీలక ప్రాంతాలు

సైబరాబాద్ కమిషనరేట్

- గచ్చిబౌలి

- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

- నానక్ రాం గూడ

- మాదాపూర్

- రాయదుర్గ్

- పఠాన్ చెరు

- జీనోమ్ వ్యాలీ

- ఆర్ సీ పురం

- అమీన్ పూర్ ఐటీ.. పారిశ్రామిక ప్రాంతాలు

మల్కాజిగిరి కమిషరేట్

- కీసర

- శామీర్ పేట

- కుత్భుల్లాపూర్

- కొంపల్లి తదితర ప్రాంతాలు

ఫ్యూచర్ సిటీ

- చేవెళ్ల

- మొయినాబాద్

- శంకర్ పల్లి

- మహేశ్వరం

- ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు