Begin typing your search above and press return to search.

ఏ పార్టీ తోటలోనో...సీనియర్ నాయకుడి ఆప్షన్ ఏంటి ?

ఆయన సీనియర్ నాయకుడు. పూర్వాశ్రమంలో ప్రభుత్వ అధికారిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ గా ఆయన ఉన్నారు.

By:  Satya P   |   22 July 2026 9:36 AM IST
ఏ పార్టీ తోటలోనో...సీనియర్ నాయకుడి ఆప్షన్ ఏంటి ?
X

ఆయన సీనియర్ నాయకుడు. పూర్వాశ్రమంలో ప్రభుత్వ అధికారిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ గా ఆయన ఉన్నారు. తన రెండు దశాబ్దాల పాటు ఐఏఎస్‌ సర్వీసులో మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేశారు. రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని ఉత్సాహంతో వచ్చారు. ఆయనే తోట చంద్రశేఖర్. ఆయన 2014లో వైసీపీ తరఫున ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇక 2023 జనవరి 2న భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. తెలంగాణాలోనే బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో ఆయన ఆ పార్టీ నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే లెక్క అని అంటున్నారు.

మళ్ళీ కీలకంగా :

ఇక తోట చంద్రశేఖర్ మళ్ళీ రాజకీయంగా చురుకుగా వ్యవహరించాలని చూస్తున్నారు. ఆయన ఏపీలో తన రాజకీయ కార్యక్రమాలను పెద్ద ఎత్తున కొనసాగించాలని అనుకుంటున్నారు. దానికి సరైన రాజకీయ వేదిక ఏది అన్నది ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆయన జనసేనలో చేరుతారు అని గతంలో వినిపించింది. ఆయన ప్రజారాజ్యంలో కూడా పనిచేసి ఉండడం మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం వంటి వాటిద్వారా జనసేన నుంచి ఆయన రాజకీయాల్లో కొనసాగుతారు అని అనుకున్నారు. కానీ ఆ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని అంటున్నారు. దాంతో తోట చంద్రశేఖర్ ఇపుడు ఏ పార్టీల వైపు చూస్తున్నారు అన్నది అయితే ఆసక్తికరంగా ఉంది.

ఆ రెండు పార్టీలేనంటూ :

ఇక ఆయన గురించి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది ఏంటి అంటే ఏపీలో రెండు పార్టీలను రెండు ఆప్షన్లను ఆయన ఎంచుకున్నారు అని. అందులో ఒకటి జాతీయ పార్టీగా ఉన్న బీజేపీలో చేరడం. అలాగే మరొకటి వైసీపీలో చేరడం. వైసీపీతో ఆయనకు గతంలో పనిచేసిన అనుభవం ఉంది. పైగా ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయన వస్తే వైసీపీలో కాదనే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఇక బీజేపీలో చేరితే ఎలా ఉంటుంది అన్నది కూడా చూస్తున్నారు అని అంటున్నారు. బీజేపీలో అయితే పొత్తులు సీట్ల సర్దుబాటులో కోరుకున్న సీటు వస్తుందా లేదా అన్నది కూడా ఉందని అంటున్నారు. గతంలో ఎంపీగా పోటీ పడిన తోట చంద్రశేఖర్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అక్కడ నుంచే పోటీ :

ఇక తోట చంద్రశేఖర్ తాను పోటీ చేసేందుకు సేఫ్ జోన్ ని చూస్తున్నారు అని అంటున్నారు. గుంటూరు జిల్లాలోని పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఇక్కడ కూటమికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గల్లా మాధవి ఉన్నారు. వైసీపీ ఇంచార్జిగా అంబటి రంబాబు ఉన్నారు. మరి తోట వస్తే వైసీపీ ఆయనకు ఈ సీటుని ఇస్తుందా అన్నది చర్చగా ఉంది. దేనికైనా జగన్ నిర్ణయమే శిరోధార్యం కాబట్టి తోటను చేర్చుకోవాలి అనుకుంటే ఇవన్నీ పెద్ద సమస్యలు కావని అంటున్నారు. పైగా కాపుల విషయంలోనే 2024 ఎన్నికల్లో ఇబ్బంది పడి ఓటమి పాలు అయిన వైసీపీకి తోట లాంటి స్ట్రాంగ్ లీడర్ వస్తామంటే ఓకే చెప్పేందుకు వెనకాడకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.