Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు రిలీజ్ ఫిక్స్ చేసుకున్న రీమేక్ చిత్రం!

త‌రుణ్ భాస్క‌ర్, ఈషా రెబ్బా జంట‌గా `ఓమ్ శాంతి శాంతి శాంతి:` అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   8 Dec 2025 1:00 AM IST
ఎట్ట‌కేల‌కు రిలీజ్ ఫిక్స్ చేసుకున్న రీమేక్ చిత్రం!
X

త‌రుణ్ భాస్క‌ర్, ఈషా రెబ్బా జంట‌గా `ఓమ్ శాంతి శాంతి శాంతి:` అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.మాలీవుడ్ లో విజ‌యం సాధించిన `జయ జయ జయ హే` అనే చిత్రానికి రీమేక్ రూపం. ఈ సినిమాతో ఏ. ఆర్ సంజీవ్ అనే కొత్త‌ కుర్రాడు డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ప్రీ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌తోనే సినిమాకు మంచి హైప్ మొద‌లైంది. కానీ సినిమా మాత్రం అంత‌కంత‌కు ఆల‌స్యమ‌వుతుంది. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని ఆగ‌స్టులో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.




కానీ షూటింగ్ స‌హా మిగ‌తా ప‌నులు పూర్తి కాక‌పోవ‌డంతో డిలే అయింది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన టీజ‌ర్ సోమ‌వారం విడుద‌ల చేస్తున్నారు. దీంతో రేప‌టి నుంచి అస‌లైన ప్ర‌మోష‌న్ ప‌నుల‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు అయింది. ఇప్ప‌ టికే టైటిల్ పోస్టర్‌తో పాటు ఒక కాన్సెప్ట్ వీడియోను కూడా విడుదల చేసారు. ఈ వీడియోను ప్రత్యేకంగా 2డీ యానిమేషన్ స్టైల్లో డిజైన్ చేసి చేసి వ‌ద‌ల‌డంతో బాగా రీచ్ అయింది.

ఇందులో త‌రుణ్ భాస్కర్ అంబటి ఓంకార్ నాయుడు అనే వ్యాన్ డ్రైవర్ పాత్రలో న‌టిస్తుండగా, ఈషా రెబ్బ కొండ వీటి ప్రశాంతిగా క‌నిపించ‌నుంది. వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం అనంత‌రం త‌లెత్తే వివాదాలు క‌థ‌ మెయిన్ థీమ్ గా తెలుస్తోంది. కాన్సెప్ట్ వీడియో ద్వారా విష‌యం అర్ద‌మ‌వుతుంది. రేపు రిలీజ్ అవుతున్న టీజ‌ర్ తో మ‌రిం త క్లారిటీ వ‌స్తుంది. అటుపై కొన్ని రోజుల‌కు ట్రైల‌ర్ కూడా రిలీజ్ కానుంది. అలాగే సినిమా రిలీజ్ తేదీని కూడా ఫిక్స్ చేసారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా జ‌న‌వ‌రి 23న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.అంటే సంక్రాంతి రిలీజ్ చిత్రాల అనంత‌రం హిట్ టాక్ తెచ్చుకుంటే? ఈ సినిమాదే హ‌హ‌. సంక్రాంతి కానుక‌గా చాలా చిత్రాలు రిలీజ్ కు ఉండ‌టంతో? 23వ తేదీని ఫిక్స్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు జయ కృష్ణ అందించిన ఫోక్ ట్యూన్ మ్యూజిక్ గ్రామీణ వాతావరణాన్ని బాగా ఎలివేట్చే స్తోంది. ఎస్ ఒరిజిన‌ల్స్ బ్యాన‌ర్ పై సృజ‌న్ య‌ర‌బోలు నిర్మిస్తున్నారు. మాతృక‌లో ఈ చిత్రాన్ని విపిన్ దాస్ తెర‌కెక్కించ‌గా చీర్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మించింది.