Begin typing your search above and press return to search.

పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కి ద‌ళ‌ప‌తి క్లియ‌ర్ స్టేట్‌మెంట్‌!

లీగ‌ల్ సెల్‌ని కూడా ఏర్పాటు చేసి స‌హాయం కోసం వ‌చ్చే వారికి అండ‌గా నిలుస్తూ వారి స‌మ‌స్య‌ల‌ని తీరుస్తున్నారు.

By:  Tupaki Entertainment Desk   |   4 Jan 2026 4:00 AM IST
పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కి ద‌ళ‌ప‌తి క్లియ‌ర్ స్టేట్‌మెంట్‌!
X

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ ఇటీవ‌ల క్రియాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. గ‌త మూడు ద‌శాబ్దాలుగా హీరోగా కోలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర వేసిన విజ‌య్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. భారీ బ‌హిరంగ స‌భ‌ని ఏర్పాటు చేసి `త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం` పేరుతో పార్టీని స్థాపించి తాను రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి క్రియాశీల రాజ‌కీయాల్లో యాక్టీవ్‌గా మారిన విజ‌య్ క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. ఇందు కోసం క‌మిటీల‌ని ఏర్పాటు చేస్తూ వాటి ద్వారా స్థానిక స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్నారు.

లీగ‌ల్ సెల్‌ని కూడా ఏర్పాటు చేసి స‌హాయం కోసం వ‌చ్చే వారికి అండ‌గా నిలుస్తూ వారి స‌మ‌స్య‌ల‌ని తీరుస్తున్నారు. ఓ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప్ర‌జ‌ల‌లో త‌న పార్టీ ప‌ట్ల అవ‌గాహ‌న పెంచి విధేయులుగా మార్చుకునే ప్ర‌య‌త్నాన్ని ఇప్ప‌టికే మొద‌లు పెట్టిన విజ‌య్ రానున్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పూర్తి స‌న్న‌ద్ద‌తో రంగంలోకి దిగ‌బోతున్నాడు. దీని కోసం గ్రౌండ్ స్థాయిలో పార్టీని, కార్య‌క‌ర్త‌ల‌ని బ‌లోపేతం చేసే ప‌నిని సైలెంట్‌గా మొద‌లు పెట్టి త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు.

అయితే టాలీవుడ్‌లో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన‌ మెగాస్టార్ చిరంజీవిని, ఆ త‌రువాత జ‌న‌సేన పార్టీని ప్రారంభించి రాజ‌కీయ చ‌ద‌రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ప్ర‌త్య‌ర్ధి పార్టీలు ఇబ్బందుల‌కు గురి చేసిన‌ట్టే త‌మిళ‌నాట రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన విజ‌య్‌ని కూడా ప‌లు రాజ‌కీయ పార్టీలు ఇబ్బందుల‌కు గురి చేసి రాజ‌కీయాలు త‌న‌కు క‌రెక్ట్ కాదు.. సినిమాలే ముద్దు అనేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ కామెంట్‌ల‌పై విజ‌య్ త‌న లేటెస్ట్ మూవీ `జ‌న నాయ‌కుడు`తో గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. విజ‌య్ న‌టించిన చివ‌రి మూవీ `జ‌న నాయ‌గ‌న్‌` త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల కాబోతోంది.

ఈ సినిమాతో విజ‌య్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి గుడ్‌బై చెప్ప‌బోతున్నాడు. `నా కోసం ఎంతో మంది అభిమానులు,, ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూశారు. ఇంత కాలం న‌న్ను స‌పోర్ట్ చేశారు. ఇంత కాలం న‌న్ను స‌పోర్ట్ చేసిన వారి కోసం 30 ఏళ్లు నేను నిల‌బ‌డ‌తా` అని ఇటీవ‌ల కౌలాలంపూర్‌లో జ‌రిగిన ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్‌లో చెప్పారు. దీంతో విజ‌య్ త‌మిళ రాజ‌కీయాల‌పై ఎంత క్లారిటీతో ఉన్నాడో స్ప‌ష్ట‌మైంది. శ‌నివారం విడుద‌ల చేసిన `జ‌న నాయ‌కుడు` ట్రైల‌ర్‌లో పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కి ద‌ళ‌ప‌తి క్లియ‌ర్ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డంఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

`నిన్ను నాశ‌నం చేస్తాను.. అవ‌మానిస్తానని ఎవ‌డు చెప్పినా స‌రే తిరిగెళ్లే ఐడియానే లేదు.. ఐయామ్ క‌మింగ్‌` అంటూ ట్రైల‌ర్ ఎండ్ లో చెప్పిన డైలాగ్‌, ప్ర‌జ‌ల‌కి మంచి చేయ‌డానికి రాజ‌కీయాల్లోకి ర‌మ్మంటే హ‌త్య‌లు చేయ‌డానికి, దోచుకోవ‌డానికంట్రా` అంటూ విజ‌య్‌ఫైర్ కావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన త‌న‌ని నాశ‌నం చేస్తామ‌ని, అవ‌మానిస్తామ‌ని.. ఎవ‌రు చెప్పినా తాను రాజ‌కీయాల నుంచి వెనుదిరిగేదే లేద‌ని ఈ డైలాగ్‌లో పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కి ద‌ళ‌ప‌తి క్లియ‌ర్ స్టేట్‌మెంట్ ఇచ్చిన‌ట్టుగా ఉంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.