Begin typing your search above and press return to search.

అమెరికా సైనికుల ‘శృంగార ఆకలి'.. సె*క్స్ వర్కర్లను దాచేసిన థాయిలాండ్ పోలీసులు.. 'ముందస్తు' జాగ్రత్తలు!

సైనికుల ఆకలి, ఆవేశం ఏ స్థాయి లో ఉంటాయో ముందే ఊహించిందో ఏమో గానీ.. రంగంలోకి దిగిపోయాం అంటూ పోలీసులు అసలైన ముందస్తు జాగ్రత్తలు షురూ చేశారు.

By:  A.N.Kumar   |   2 Sept 2026 1:34 PM IST
అమెరికా సైనికుల ‘శృంగార ఆకలి.. సె*క్స్ వర్కర్లను దాచేసిన థాయిలాండ్ పోలీసులు.. ముందస్తు జాగ్రత్తలు!
X

ఆరు నెలలకు పైగా సముద్రం అలలపై తేలియాడి, కనీసం మనిషి మొహం కూడా సరిగ్గా చూడని సుమారు 5,000 మంది అమెరికా నేవీ సైనికులు ఒక్కసారిగా దేశంలోకి ల్యాండ్ అవుతున్నారంటే ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది? "స్వాగతం సుస్వాగతం" అని బ్యానర్లు కడుతుంది. కానీ థాయిలాండ్ సర్కార్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించింది. సైనికుల ఆకలి, ఆవేశం ఏ స్థాయి లో ఉంటాయో ముందే ఊహించిందో ఏమో గానీ.. రంగంలోకి దిగిపోయాం అంటూ పోలీసులు అసలైన ముందస్తు జాగ్రత్తలు షురూ చేశారు.

అసలు కథేంటంటే.. అమెరికా నేవీకి చెందిన 'యూఎస్ఎస్ అబ్రహాం లింకన్' అనే భారీ యుద్ధనౌక దాదాపు 200 రోజుల సుదీర్ఘ సముద్ర ప్రయాణం తర్వాత థాయిలాండ్ తీరానికి చేరుకుంటోంది. ఓ వైపు నేవీ నావికులు "అబ్బా.. ఎంతకాలమైందో తీరం చూసి" అని రీఫ్రెష్ అవ్వడానికి రెడీ అవుతుంటే థాయిలాండ్ పోలీసులు మాత్రం "మీరు రీఫ్రెష్ అయ్యే లోపే మేం పని పూర్తి చేస్తాం" అన్నట్లుగా అనుమానిత ప్రాస్టిట్యూషన్ కేంద్రాలపై విరుచుకుపడ్డారు.

అక్కడ సైనికుల ల్యాండింగ్.. ఇక్కడ వర్కర్ల అండర్‌గ్రౌండ్

సుమారు 40 నుండి 50 మంది సె*క్స్ వర్కర్లను క్షణాల్లో అదుపులోకి తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. 5,000 మంది సైనికులు ఒకేసారి ఆవురావురుమంటూ నగరంలోకి వస్తే పరిస్థితి చేతులు దాటిపోతుందని, డిమాండ్ అమాంతం పెరిగిపోయి సె*క్స్ ట్రేడ్ బస్టర్ హిట్ అవుతుందని భయపడ్డారో లేక సైనికులకు దొరక్కుండా "దాగుడుమూతలు" ఆడిస్తున్నారో అర్థం కాక స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

చట్ట ప్రకారం థాయిలాండ్‌లో వ్యభిచారం నిషిద్ధమే.. కాకపోతే పర్యాటకం పేరుతో అది నడుస్తూనే ఉంటుందనేది బహిరంగ రహస్యం. కానీ ఈసారి అమెరికా నేవీ వస్తోందన్న వార్త వినగానే పోలీసుల్లో ఏదో తెలియని పూనకం వచ్చింది. "మాన్యువల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్" దుమ్ము దులిపి దాడులు జరిపేశారు.

అరెస్టులా? లేక 'సేఫ్ హౌస్' షెల్టరా?

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పోలీసుల ఈ ముందస్తు అతి-జాగ్రత్తను చూసి కొందరు "శాంతిభద్రతల పరిరక్షణ" అని సమర్థిస్తుంటే నెటిజన్లు మాత్రం సెటైర్లతో ఆడుకుంటున్నారు. "పాపం 200 రోజుల నుంచి సముద్రంలో కష్టపడి వచ్చిన సైనికులకు ఎంత పెద్ద షాక్ ఇది ", "అమెరికా సైన్యం వస్తోందని వ్యభిచారులను అరెస్ట్ చేయడం కాదేమో.. సైనికుల బారి నుండి వారిని కాపాడటానికి దాచిపెడుతున్నారేమో " అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఏది ఏమైనా యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ తీరానికి చేరకముందే థాయిలాండ్ పోలీసులు చూపించిన ఈ 'అతి జాగ్రత్త' చూస్తుంటే.. యుద్ధ నౌక కంటే వీళ్ల ముందస్తు దాడులే ఎక్కువ కలకలం రేపాయని చెప్పక తప్పదు. సైనికులు తీరానికి వచ్చాక ఈ ఖాళీ వినోద రంగాన్ని చూసి ఏమనుకుంటారో చూడాలి.