నగ్న వీడియోలు, అశ్లీల డాన్స్ క్లిప్స్.. అందాల 'బేబి'కి బిగుస్తోన్న ఉచ్చు
వీడియోల్లో ఉంది తానేనని బేబీ ఫేస్‌బుక్‌లో అంగీకరించింది. కరోనా సమయంలో తన తల్లి తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రి ఖర్చులకు డబ్బు సంపాదించేందుకు అశ్లీల వెబ్‌సైట్‌లో పని చేయాల్సి వచ్చిందని చెప్పింది.
By: A.N.Kumar | 26 Sept 2025 8:15 AM ISTథాయ్‌లాండ్ అందాల రాణి సుపన్నీ నోయినోంతాంగ్ అలియాస్ ‘బేబీ’ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ముగిసిన ప్రావిన్స్ స్థాయి బ్యూటీ కాంటెస్ట్‌లో కిరీటం దక్కిన ఈమె.. మరుసటి రోజే పెద్ద వివాదంలో ఇరుక్కొంది. కారణం ఆమె పాత నగ్న వీడియోలు, అశ్లీల డాన్స్ క్లిప్స్ నెట్టింట వైరల్ కావడమే. ఈ పరిణామం వెంటనే పోటీ నిర్వాహకులు ఆమె టైటిల్‌ను వెనక్కి తీసుకోవడానికి దారితీసింది.
కిరీటం దక్కిన రోజు.. కుంభకోణం వెలుగులోకి
థాయ్‌లాండ్‌లోని ప్రావిన్స్ వారీ బ్యూటీ క్వీన్ పోటీల్లో 27 ఏళ్ల బేబీ ప్రాచువాప్ ఖిరీ ఖాన్ నుంచి విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 20న ఆమె తలపై కిరీటం పెట్టగానే, మరుసటిరోజే సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన అశ్లీల వీడియోలు షేర్ అవ్వడం సంచలనం సృష్టించింది. ఈ-సిగరెట్లు కాలుస్తూ, నగ్న నృత్యాలు చేస్తూ కనిపించిన ఆ వీడియోలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
బేబీ క్షమాపణలు.. కన్నీటి కథ
వీడియోల్లో ఉంది తానేనని బేబీ ఫేస్‌బుక్‌లో అంగీకరించింది. కరోనా సమయంలో తన తల్లి తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రి ఖర్చులకు డబ్బు సంపాదించేందుకు అశ్లీల వెబ్‌సైట్‌లో పని చేయాల్సి వచ్చిందని చెప్పింది. అయినప్పటికీ తన తల్లిని కాపాడలేకపోయానని బాధ వ్యక్తం చేసింది. అప్పటి నుంచి మళ్లీ అలాంటి పనుల్లో భాగం కాలేదని, ఇది తనకు విలువైన గుణపాఠం నేర్పిందని తెలిపింది.
న్యాయపరమైన చిక్కులు
అందాల పోటీలో పాల్గొనే ముందు కంటెస్టెంట్లు అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉన్నామనే డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. బేబీ తెలిసీ ఆ క్లాజ్‌పై సంతకం చేయడం వల్ల ఇప్పుడు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. తప్పుడు డిక్లరేషన్ కారణంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
మద్దతు, మరో ఆశ
ఈ ఘటన తర్వాత బేబీకి సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే తన పాత వీడియోలు బయట పెట్టారని, వారిపై కోర్టులో కేసులు వేస్తానని ఆమె హెచ్చరించింది. మరోవైపు, నిర్వాహకులను కలసి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వమని విజ్ఞప్తి చేసింది. టైటిల్ వెనక్కి ఇచ్చే అంశాన్ని పునరాలోచన చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆమెకు కొంత ఊరట లభించింది.
ప్రస్తుతం అందాల భామ బేబీ భవితవ్యం న్యాయపరమైన తీర్పుపైనే ఆధారపడి ఉంది. ఒక్కవైపు మద్దతుదారుల ఆశీర్వాదం, మరోవైపు చట్టం బిగుస్తున్న ఉచ్చు.. ఈ రెండింటి మధ్య బేబీ భవిష్యత్తు నిలిచిపోయింది.
