Begin typing your search above and press return to search.

30 ఏళ్ల కిందటి పిండం.. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ బేబీ జననం

మనుషుల శారీరక పరిమితులను దాటి, విజ్ఞాన పరిజ్ఞానంతో సాధ్యమైన అద్భుతాల్లో ఇది ఒకటి. అమెరికాలో ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది.

By:  A.N.Kumar   |   1 Aug 2025 4:00 PM IST
30 ఏళ్ల కిందటి పిండం.. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ బేబీ జననం
X

మనుషుల శారీరక పరిమితులను దాటి, విజ్ఞాన పరిజ్ఞానంతో సాధ్యమైన అద్భుతాల్లో ఇది ఒకటి. అమెరికాలో ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలోనే "తక్కువ వయసు కలిగిన అతిపెద్ద బిడ్డ"గా చరిత్రలో నిలిచిపోయే సంఘటన ఇది!

-1994లో భద్రపరచిన పిండం… 2024లో బిడ్డగా జననం

1994లో తల్లి గర్భంలో ప్రారంభ దశలో ఉన్న పిండాన్ని 'క్రయోప్రిజర్వేషన్' పద్ధతిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఫ్రీజ్ చేసి భద్రపరిచారు. ఇది అత్యాధునిక టెక్నాలజీ ద్వారా పిండాన్ని నిర్జీవంగా కాకుండా, కాలగమనాన్ని నిలిపివేసేలా భద్రతగా ఉంచే ప్రక్రియ. దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ పిండం ఫ్రీజ్‌లోనే ఉండిపోయింది. 2024 జూన్ 26న అమెరికాలోని ఓ కుటుంబం ఆ పిండాన్ని గర్భస్థితిలోకి మారుస్తూ మాతృగర్భంలో పున: ప్రవేశింపచేశారు. కొన్ని నెలల గర్భధారణ అనంతరం ఆ పిండం నుంచి థాడెయస్ అనే ఆరోగ్యవంతమైన శిశువు జన్మించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా రీప్రొడక్టివ్ మెడిసిన్ (సంతానోత్పత్తి వైద్యం) రంగంలో ఓ విశేష ఘట్టంగా నిలిచింది.

-థాడెయస్.. మానవ చరిత్రలో ఓ ప్రత్యేక శిశువు

ఈ శిశువు జన్మించేందుకు ముందే పుట్టిన పిండంగా ఉండటం (ఎంబ్రయోగా) 30 ఏళ్ల పాటు ఫ్రీజ్‌లో ఉండటం ఒక అద్భుతం. సాధారణంగా క్రయోప్రిజర్వేషన్ ద్వారా కొన్ని సంవత్సరాలపాటు పిండాలను భద్రపరచవచ్చు. కానీ ఈ స్థాయిలో దీర్ఘకాలిక ఫ్రీజ్ తర్వాత విజయవంతంగా జననం కలగడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి.

-పిల్లలు కలగని దంపతులకు కొత్త ఆశ

ఈ ఘట్టం అనేక కుటుంబాలకు ఆశ చిగురించించింది. సంతానం కలగని వారు, గర్భధారణలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇప్పుడు ఈ పద్ధతుల ద్వారా భవిష్యత్తులో తల్లిదండ్రులయ్యే అవకాశాలను వెదుక్కోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వ్యాధుల వల్ల ఫెర్టిలిటీ కోల్పోయే వారు, ముందుగానే పిండాలను ఫ్రీజ్ చేసి భవిష్యత్తులో తల్లిదండ్రులయ్యే వీలును ఈ సంఘటన మరింత స్పష్టంగా చూపించింది.

-క్రయోప్రిజర్వేషన్ అంటే ఏమిటి?

క్రయోప్రిజర్వేషన్ అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద జీవకణాలను, పిండాలను ఫ్రీజ్ చేసి భద్రపరిచే వైద్య సాంకేతికత. ఇది దశాబ్ధాల పాటు వాటి జీవనశైలిని నిలిపి ఉంచే సామర్థ్యం కలిగి ఉంటుంది. అవసరమయ్యే సమయంలో పిండాన్ని మళ్లీ ఉష్ణోగ్రతకు తేచి గర్భంలో నాటే అవకాశం ఉంటుంది.

థాడెయస్ అనే ఈ శిశువు పుట్టుక, మానవ విజ్ఞానానికి, వైద్య రంగ పురోగతికి ప్రతీక. ఇది కేవలం ఒక శిశువు జననం మాత్రమే కాదు… భవిష్యత్తులో లక్షలాది కుటుంబాలకు ఆశను నింపే సాంకేతిక విజయంగా చెప్పొచ్చు.