Begin typing your search above and press return to search.

అత్యాచారాలను అమ్మాయిలు 'ఎంజాయ్' చేస్తారన్న విశ్లేషకుడు.. పోలీస్ ట్రీట్ మెంట్ అదుర్స్ కదూ

అక్కడితో ఆగితే ఆయన మోహన్‌దాస్ ఎందుకవుతారు? శాంతిభద్రతలను కాపాడే ‘మాస్టర్ ప్లాన్’ కూడా బయటపెట్టేశారు.

By:  A.N.Kumar   |   10 Aug 2026 10:10 AM IST
అత్యాచారాలను అమ్మాయిలు ఎంజాయ్ చేస్తారన్న విశ్లేషకుడు.. పోలీస్ ట్రీట్ మెంట్ అదుర్స్ కదూ
X

రాజకీయ విశ్లేషణ అంటే దేశ పరిస్థితులపై క్లారిటీ ఇవ్వడం అనుకుంటే పొరపాటే... సమాజంపై తమలో దాగున్న 'సదాశయాలను' వెళ్లగక్కడమేనని నిరూపించారు కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు టీజీ మోహన్‌దాస్

యూట్యూబ్‌లో మైక్ దొరికింది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏమవుతుందో తెలుసుకోవడానికి మన మోహన్‌దాస్ గారి లేటెస్ట్ ఎపిసోడే బెస్ట్ ఎగ్జాంపుల్. ఢిల్లీలో నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, ముఖ్యంగా యువతులు రోడ్లపైకి వచ్చి పోరాడుతుంటే... మన విశ్లేషకుడి మేధస్సు మరో స్థాయిలో ఆలోచించింది.

యూట్యూబ్ 'పత్రిక'... విశ్లేషణల 'జాతర'

తన సొంత యూట్యూబ్ ఛానెల్ ‘పత్రిక’లో ఆయనగారు గొంతు విప్పుతూ ఒక అద్భుతమైన 'కనిపెట్టుక'ను ప్రపంచానికి అందించారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే అమ్మాయిలు గ్యాంగ్ రేప్‌లను ఆహ్వానిస్తారని.. అసలు వాళ్ళు రేప్‌లను బాగా ‘ఎంజాయ్’ చేస్తారంటూ ఒక సైంటిఫిక్ ఆవిష్కరణ చేశారు. ఈ మాటలు విన్న నెటిజన్లు “సార్... మీకు విశ్లేషకుడు అనే పదం చిన్నది.. వేరే ఏదైనా పెద్ద పదం వెతకాలి” అని పిడికిళ్లు బిగించారు.

తుపాకీ పడితేనే కదా కిక్కు

అక్కడితో ఆగితే ఆయన మోహన్‌దాస్ ఎందుకవుతారు? శాంతిభద్రతలను కాపాడే ‘మాస్టర్ ప్లాన్’ కూడా బయటపెట్టేశారు.

“నా చేతిలో పవర్ ఉంటేనా... ముందు కర్ఫ్యూ పెడతా.. వినకపోతే రౌండ్ అప్ చేసి ‘షూట్’ చేసేస్తా. కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నా, కొందరు వికలాంగులైనా పర్లేదు... కొన్ని గంటల్లో దేశం సైలెంట్ అయిపోతుంది” అని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చిపడేశాడు. వాహ్.. ఎంతటి ప్రజాస్వామ్య బద్ధమైన ఆలోచన! రక్షించాల్సిన పోలీసులకు సైతం తట్టని ఈ ఐడియా వింటే హిట్లర్ కూడా ఆత్మశాంతి కోల్పోయి కాసేపు చప్పట్లు కొట్టేవాడేమో..

రీల్ నుంచి రియాలిటీకి... 'స్టూడియో' షిఫ్ట్ అయింది

ఇక ఈ 'అమూల్యమైన' వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఆలస్యం... సైబర్ పోలీసులకు పూనకాలు వచ్చాయి. తిరువనంతపురం సైబర్ పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదివారం సాయంత్రం కూవపడమ్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. మొత్తానికి ఆయనగారి యూట్యూబ్ జ్ఞానాన్ని, విశ్లేషణల లోతును దగ్గరుండి తెలుసుకోవడానికి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. “మీ విశ్లేషణలు బాగున్నాయి సార్ కొద్దిరోజులు మా స్టేషన్‌లో ఉండి మిగతా పాఠాలు చెప్పండి” అంటూ పంపిన ఆహ్వానాన్ని కాదనలేక మోహన్‌దాస్ గారు కటకటాల పాలయ్యారు.

సొంత డిజిటల్ పరికరాలైన ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను కూడా పోలీసులు ‘జ్ఞాపకాలు’గా స్వాధీనం చేసుకున్నారు. మైక్ ఉంది కదా అని సమాజంపై ఎలాంటి కామెంట్స్ చేసినా చెల్లుతుందని భావించే 'యూట్యూబ్ మేధావులకు' ఈ ఉదంతం ఒక మంచి కంటివిలుపు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.