టెక్సాస్ పోలీసులకు దొరికారో తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే !
టెక్సాస్ లో నివసించే వారు ఇక మీదట చేయాల్సిందేంటి అంటే ఎంత వీలైతే అంత ట్రాఫిక్ పోలీసుల కంట బడకుండా ఉండడం.
By: Satya P | 30 Nov 2025 9:02 AM ISTటెక్సాస్ లో నివసించే వారు ఇక మీదట చేయాల్సిందేంటి అంటే ఎంత వీలైతే అంత ట్రాఫిక్ పోలీసుల కంట బడకుండా ఉండడం. వారు ఆపకుండా తమ దోవలో తాము వెళ్ళిపోవడం ఎందుకంటే గడచిన మూడు నెలల నుంచి అక్కడ పోలీసులు చేస్తున్న ట్రాఫిక్ చెకింగులలో ప్రధానంగా ఇమ్మిగ్రేషన్ తనిఖీలు చేసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. ఈ విధంగా పోలీసులు ఆపి మరీ చేసే ఈ తరహా తనిఖీలతో కనుక దొరికితే ఇక మొత్తం సర్దుకోవాల్సిందే అని అంటున్నారు.
ట్రంప్ వలసల అమలు కోసం :
ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన విస్తృత వలసల నిలుపుదల విషయంలో దానికి గట్టిగా అమలు చేయడానికి టెక్సాస్ ఇపుడు సిద్ధపడుతోంది అని అంటున్నారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టంస్ ఎంఫోర్స్ మెంట్ ఐసీఈ తో టెక్సాస్‌లోని అతి పెద్ద నగరంలో ఒకటి అయిన డెమొక్రాట్ హ్యూస్టన్ మేయర్ జాన్ విట్‌మైర్, సహకారాన్ని అంగీకరించినట్లు ప్రచారం సాగుతోంది. ఇలా అంగీకరించినట్లుగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అక్కడి నివాసితులు అధికారుల నుండి విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. మరో వైపు అక్కడి పోలీసు విభాగానికి ఈ ఏజెన్సీతో అధికారిక ఒప్పందం లేదు కానీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికైనప్పటి నుండి ట్రాఫిక్ స్టాప్‌ల ఫలితంగా నగర పోలీసుల నుంచి పెద్ద ఎత్తున ఇమ్మిగ్రేషన్ చెకింగులు ఎక్కువ అయ్యాయని అంటున్నారు. హ్యూస్టన్ క్రానికల్ పబ్లిక్ రికార్డుల ఆధారంగా ఇవి ధృవీకరించబడుతున్నాయి.
ట్రంప్ సహకారానికి ఓకే :
మరో వైపు టెక్సాస్ రిపబ్లికన్ చట్టసభ సభ్యులు గవర్నర్ సాధారణంగా సహకారం అవసరమయ్యే చట్టాలను ఆమోదించడం ద్వారా ట్రంప్ పరిపాలనకు సహాయం చేయడానికి మద్దతు ఇచ్చారు. దాంతో లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న టెక్సాస్ కౌంటీలోని షెరిఫ్ కార్యాలయాలు 2026 డిసెంబర్ నాటికి ఐసీఈ ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. హైవే ట్రూపర్లను కలిగి ఉన్న టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ కూడా ఐసీఈ తో ఒప్పందంపై ఇప్పటికే సంతకం చేసింది.
చెకింగులతో షాక్ :
ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ పోలీసులు అయితే చెకింగుల పేరుతో ఇబ్బందులే కలిగిస్తున్నారు. పైకి మాత్రం రేపిస్టులు, ఉగ్రవాదులు సంఘ వ్యతిరేక శక్తులను ఏరివేయడానికే ఈ ఇమ్మిగ్రరేషన్ చెకింగులు అని చెబుతున్నా అమెరికా అధ్యక్షుడి వలస విధానానికి మద్ధతుగానే ఇదంతా సాగుతోందని అంటున్నారు. దాంతో టెక్సాస్ లో నివసించే ఇతర దేశలా పౌరులు ఎవరైనా బయటకు వస్తే కనుక ఈ పోలీస్ పెట్రోలింగ్ నుంచి కానీ వారి చెకింగ్ నుంచి కానీ తప్పించుకుంటేనే మేలు అని అంటున్నారు. లేకపోతే కష్టాలు అన్నీ ఇన్నీ రావని ఏకంగా తట్టా బుట్టా సర్దేయాల్సిందే అని అంటున్నారు.
