టెక్సాస్ లో టమోటాల కోసం లొల్లి.. భారతీయులపై తగ్గని విద్వేషం..
టెక్సాస్‌కు చెందిన నిక్ ప్లంబ్ అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈయన గారు గతంలో రిపబ్లికన్ పార్టీ తరఫున కాంగ్రెస్‌కు పోటీ చేసి పాపం గెలవలేదు లెండి ఖాళీగా ఉన్నట్టున్నారు.
By: A.N.Kumar | 19 May 2026 4:52 PM ISTఅమెరికా... అవకాశాల గని మాత్రమే కాదు.. అప్పుడప్పుడు ‘అతి’ మేధావులకు అడ్డా కూడా. ముఖ్యంగా మన దేశీయులు అక్కడ కష్టపడి ఎదుగుతుంటే.. చూసి ఓర్వలేక కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కెమెరాలు పట్టుకుని రోడ్లపై పడుతున్నారు. తాజాగా టెక్సాస్‌లో ఇలాంటిదే ఒక విచిత్రమైన కాస్త ‘ఘాటైన’ సీన్ జరిగింది.
సీన్ లోకి వచ్చిన ‘కాంగ్రెస్’ అభ్యర్థి!
టెక్సాస్‌కు చెందిన నిక్ ప్లంబ్ అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈయన గారు గతంలో రిపబ్లికన్ పార్టీ తరఫున కాంగ్రెస్‌కు పోటీ చేసి పాపం గెలవలేదు లెండి ఖాళీగా ఉన్నట్టున్నారు. హ్యూస్టన్‌లోని మన భారతీయులు పెట్టిన “సంగం సూపర్ మార్కెట్” బయట మనవాళ్లు పెట్టిన కూరగాయలు, పండ్ల బుట్టలు ఈయన కంటపడ్డాయి. అంతే చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందిగా... ఇంకేం, కెమెరా ఆన్ చేసి ఒక రేంజ్‌లో రెచ్చిపోయాడు.
ప్లంబ్ గారి ఆవేదన ఇదీ
“ఇండియాలోని థర్డ్ వరల్డ్ గల్లీలు ఇప్పుడు హ్యూస్టన్‌లోకి వచ్చేశాయి. రోడ్డు పక్కన, వేడి వాతావరణంలో కూరగాయలు పెట్టి ఫుడ్ సేఫ్టీని గాల్లో కలిపేశారు. ఇది అమెరికా... ఇక్కడ ఇలాంటి తక్కువ ప్రమాణాలు అస్సలు ఒప్పుకోం!” అంటూ సోషల్ మీడియాలో పెద్ద లెక్చరే దంచికొట్టాడు. భారతీయులపై ఉన్న కాస్త ‘పాత కక్ష’ను ఇలా కూరగాయల వంకతో బయటపెట్టాడన్నమాట మన మాజీ అభ్యర్థి!
క్లాస్ పీకబోతే... ‘మాస్’ కౌంటర్ ఇచ్చిన దేశీ ఓనర్!
వీడియో వైరల్ అవ్వడమే తరువాయి... మన సంగం సూపర్ మార్కెట్ ఓనర్ గారు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నిక్ ప్లంబ్ ఏదో పెద్ద గొడవ జరుగుతుందని ఆశించి ఉంటాడు కానీ, మనోడు ఇచ్చిన కూల్ అండ్ స్ట్రాంగ్ కౌంటర్‌తో ప్లంబ్ గారి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఆ సంభాషణ హైలైట్స్ ఇవే
“అయ్యా నిక్ గారూ... మీ వీడియో చూశాను. ఫుడ్ సేఫ్టీ గురించి చెప్పడం మంచిదే. కానీ ప్రస్తుతం స్టోర్‌లో భారీ సేల్ నడుస్తోంది. లోపల స్థలం లేక తాత్కాలికంగా కాసేపు బయట పెట్టాం. రాత్రి పూట లోపలే పెడతాం” అని చాలా పద్ధతిగా రూల్స్ వివరించాడు. “నేను 35 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నా. మీలాగే నేనూ గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కే ఓటేశాను. అక్రమ వలసలను నేనూ అస్సలు ఒప్పుకోను” అని చెప్పేసరికి నిక్ ప్లంబ్ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సొంత పార్టీ ఓటరునే టార్గెట్ చేశానా అని లోపల ఫీలయ్యుంటారు! “హెల్త్ ఇన్‌స్పెక్టర్ వచ్చి ఇవన్నీ పారేయమంటే ఇప్పుడే పారేస్తా. సమస్యల నుంచి పారిపోయే రకం కాదు నేను. నమ్మకం లేకపోతే మరో రెండు రోజులు పోయాక వచ్చి చూసుకో” అని ధైర్యంగా ఇన్విటేషన్ ఇచ్చాడు.
అమెరికాలో భారతీయుల ప్రాధాన్యం, ఎదుగుదల చూసి తట్టుకోలేక కొందరు ఇలాంటి ‘చిన్నచిన్న’ విషయాలను కూడా ‘గ్లోబల్ ఇష్యూస్’ లాగా పోస్ట్ చేస్తుంటారు. ఏదేమైనా మన దేశీ ఓనర్ గారు మాత్రం నిక్ ప్లంబ్ విద్వేష ప్రచారానికి తన ‘కూల్ అండ్ స్మార్ట్’ సమాధానంతో గట్టిగానే చెక్ పెట్టారు.
