ఎంపీ ల్యాడ్స్ మురిగిపోయాయి...తెలుగు ఎంపీలదే రికార్డు
లోక్ సభ రాజ్యసభ ఎంపీలకు తమ నియోజకవర్గాలలో ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది.
By: Tupaki Political Desk | 31 Aug 2026 11:00 PM ISTలోక్ సభ రాజ్యసభ ఎంపీలకు తమ నియోజకవర్గాలలో ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. అలా వచ్చిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోతే మురిగి పోతాయి. లోక్ సభ సభ్యులకు సొంత నియోజకవర్గంగా పార్లమెంట్ పరిధి ఉంటుంది. ఇక రాజ్యసభ సభులు అయితే నోడల్ జిల్లాను ఎంచుకుని అక్కడ నిధులను ఖర్చు పెట్టవచ్చు. వారు అవసరం అనుకుంటే ఎక్కడైనా నిధులు కేటాయించవచ్చు. మరి ఇంతలా కేంద్రం నుంచి నిధులు వస్తున్నప్పటికీ ఖర్చు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు వెనకబడి ఉన్నారని నివేదికలు తెలియచేస్తున్నాయి. ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాల ఎంపీలు ముందు వరసలో ఉన్నారని వారు తమకు కేటాయించిన నిధులను బాగానే ఖర్చు చేశారు అని నివేదికలు చెబుతున్నాయి.
అత్యంత తక్కువగానే :
ఇదిలా ఉంటే కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాలలో ఎంపీలు తక్కువగా ఎంపీ ల్యాడ్స్ ని ఖర్చు చేశారు అని తెలుస్తోంది. అందులో కూడా తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నిధులను అత్యంత తక్కువగా ఖర్చు చేశారని ఈ నివేదిక చెబుతోంది. దేశవ్యాప్తంగా చూస్తే ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగం సగటున 75 శాతం ఉండగా తెలంగాణ ఎంపీల సగటు కేవలం 23 శాతం మాత్రమే ఖర్చు చేసినట్లుగా నమోదైంది. రెండు సంవత్సరాల కాలంలో తమకు కేటాయించిన నిధులలో కేవలం పది శాతం కంటే తక్కువ ఖర్చు చేసిన ముఖ్య తెలుగు ఎంపీల జాబితా కూడా ఉంది.
వీరు సైతం అంతేనా :
ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుల ఎంపీ ల్యాడ్స్ నిధుల ఖర్చు వినియోగ శాతం జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉంది అని అంటున్నారు. దీని మీద పౌర సమాజ ప్రాజెక్ట్ అయిన ఎంపవర్డ్ ఇండియన్ విడుదల చేసిన 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం చూస్తే , ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొత్తం 37 మంది ఎంపీలు అంటే లోక్ సభలో లోక్‌సభ రాజ్యసభ కలిపి కేటాయించిన నిధులు వాటి వినియోగ వివరాలు చూస్తే ఖర్చు తక్కువగానే చేసినట్లుగా ఉంది. మొత్తం 554.5 కోట్లు నిధులలో వినియోగ శాతం కేవలం 22.86 శాతంగా ఉంది.
ఇవీ కారణాలు :
ఇదిలా ఉంటే ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేసినా పోర్టల్ అప్‌డేట్ లోపాలు ఉన్నాయని ఎంపీల ఆఫీసుల నుంచి వస్తున్న మాటగా ఉంది. పనుల్లో జాప్యానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయని ంటున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కాకపోవడానికి బిల్లులు విడుదల కాకపోవడానికి గల కారణాలు ఉన్నయాని చెబుతున్నారు. అలాగే :ఆమోదాల విషయంలో జాప్యం కూడా జరుగుతోందని అంటున్నారు. ఎంపీలు అభివృద్ధి పనుల కోసం సిఫార్సు లేఖలు ఇచ్చినప్పటికీ జిల్లా యంత్రాంగం వాటికి త్వరితగతిన పరిపాలనా అనుమతులు ఇవ్వకపోవడంతో పాటు నిర్వహణ సంస్థల నిర్లక్ష్యం కూడా ఉందని అంటున్నారు.
ఎంపీ ల్యాడ్స్ ని వేగంగా ఖర్చు చేస్తే :
మున్సిపల్ కార్పొరేషన్లు పంచాయతీ రాజ్ గ్రామీణ నీటి సరఫరా వంటి ప్రభుత్వ అమలు సంస్థలు పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం కూడా ఎంపీ ల్యాడ్స్ ఖర్చు విషయంలో కొంత వెంకబటుతనానికి కారణం అని చెబుతున్నారు. ఇక పోర్టల్ అప్‌డేట్స్ లో లోపాలూన్నయాని అంటున్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని పనులు జరుగుతున్నప్పటికీ వాటి వివరాలను జిల్లా ప్రణాళిక అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో సకాలంలో అప్‌లోడ్ చేయకపోవడం వల్ల కూడా నివేదికలలో ఎంపీలు తక్కువ ఖర్చు చూపిస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా తెలుగు ఎంపీలు తమకు కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ ని వేగంగా ఖర్చు చేస్తే వాటి ఫలితాలు అభివృద్ధి ఫలాలు అందరికీ చేరువ అవౌతాయని అంటున్నారు.
