Begin typing your search above and press return to search.

H1B కలకలం వేళ పవన్ అభిమానులు అమెరికాలో ఇవే తగ్గించాలి

అమెరికాలో ఇండియన్లపై, ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీకి చెందిన లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌పై ప్రతికూలత పెరుగుతోంది.

By:  A.N.Kumar   |   24 Sept 2025 3:17 PM IST
H1B కలకలం వేళ పవన్ అభిమానులు అమెరికాలో ఇవే తగ్గించాలి
X

అమెరికాలో ఇండియన్లపై, ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీకి చెందిన లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌పై ప్రతికూలత పెరుగుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా జాత్యహంకారం పెరిగిందని అక్కడి భారతీయులు చెబుతున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి H-1B వీసా హోల్డర్లపై వ్యతిరేకత పెరిగింది. తాజాగా H-1B పిటిషన్‌కి $100K ఫీజు అనౌన్స్ కావడం మరింత టెన్షన్ క్రియేట్ చేసింది.

ఇండియన్లపై పెరుగుతున్న ఈ వ్యతిరేకతకు అనేక కారణాలు చెబుతున్నారు. కొందరు ఉన్నత జీతాలు, లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను కారణంగా చెబుతుంటే, మరికొందరు కోవిడ్ తర్వాత ఎక్కువగా వచ్చిన స్టూడెంట్స్ అమెరికాలో కూడా "అమీర్‌పేట్ స్టైల్" బిహేవియర్ చూపుతున్నారని విమర్శిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, అమెరికాలో థియేటర్స్‌లో ఇండియన్ ఫ్యాన్స్ చేసే హంగామా కూడా పెద్ద సమస్యగా మారింది. అరుపులు, డిస్టర్బెన్సులు, కొబ్బరికాయలు పగలగొట్టడం, ప్రత్యేక రీతులు—ఇవన్నీ చూసి అక్కడి ఇండియన్ ఫ్యామిలీస్‌కే అసౌకర్యంగా అనిపిస్తోంది. ప్రతి స్టార్ హీరో అభిమానులు ఇలాంటి తప్పులు చేశారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన OG రేపు రిలీజ్ అవుతున్న సందర్భంలో ఈ హంగామా మరింత సెన్సిటివ్‌గా మారింది. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు కావడంతో ఆయన అభిమానులు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అమెరికాలో నోయిజీ రిట్వల్స్, పబ్లిక్‌లో అరుపులు, కొబ్బరికాయలు పగలగొట్టడం వంటివి అసలు చేయకూడదు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇండియన్ల మొత్తం ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

సాధారణంగా ఈ హంగామా డల్లాస్ లో మొదలై, తర్వాత మరికొన్ని స్టేట్స్‌కి వెళ్తుంది. ఇప్పటికే మొదటి సిగ్నల్స్ వీడియోలు కనిపిస్తున్నాయి. అభిమానులు పెద్ద దృశ్యంని మరిచి హంగామా చేస్తే, మొత్తం కమ్యూనిటీకి నష్టం తప్పదు.

H1B పై అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు, కఠిన నిబంధనల వేళ అమెరికాలో తెలుగువాళ్లు ఇలా ఓజీ సందడి అంటూ చెలరేగిపోతే నష్టం తప్పదు. ఇదే కొనసాగితే తెలుగువాళ్ల వీసాలు రద్దు చేసి ఇండియాకు డిపోర్టేషన్ చేయక తప్పదు.

ఇలాంటి సమయంలో అభిమానులకే అవగాహన అవసరం. స్వీయ నియంత్రణ తప్ప మరో మార్గం లేదు. కానీ ఆ అవగాహన వస్తుందా లేదా అన్నది ఇంకా సందేహమే.