కేసీఆర్ మీద రేవంత్ అల్టిమేట్ కామెంట్
తెలంగాణలో శీతాకాలం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. శీతాకాల సమావేశాలు ఒక వైపు జరుగుతున్నాయి. మరో వైపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తొలి రోజు సభకు హాజరయ్యారు.
By: Satya P | 1 Jan 2026 10:44 PM ISTతెలంగాణలో శీతాకాలం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. శీతాకాల సమావేశాలు ఒక వైపు జరుగుతున్నాయి. మరో వైపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తొలి రోజు సభకు హాజరయ్యారు. జనవరి 2న తెలంగాణా జలాల విషయం మీద చర్చ ఉంది. అయితే దీని మీదనే ఇప్పటిదాకా బయట బీఆర్ఎస్ కాంగ్రెస్ బిగ్ డిబేట్ పెడుతూ వస్తున్నాయి. కృష్ణా జలాల విషయంలో ఎవరు తెలంగాణాకు అన్యాయం చేశారు అన్న దాని మీదనే హాట్ హాట్ గా డిస్కషన్ సాగుతోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ని ఇరుకున పెట్టాలని బీఆర్ ఎస్ చూస్తోంది. కేసీఆర్ ఇదే అంశం మీద తెలంగాణ వ్యాప్తంగా సభలు నిర్వహించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా భవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాల విషయం మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది.
ఉరి తీసినా అంటూ :
ఇక ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఏలుబడిలో హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు అని గుర్తు చేశారు. ఈ ఇద్దరూ కలసి తెలంగాణా హక్కులను ఏపీకి దారాదత్తం చేశారు అని ఆరోపించారు. క్రిష్ణా జలాలలో ఉమ్మడి ఏపీలో ఏపీకి 811 టీఎంసీల కేటాయింపులు జరిగాయని అన్నారు. అయితే అందులో ఏపీకి 66 శాతం వాటాను ఇచ్చేసేలా కేసీఆర్ 2020 ప్రాంతంలో సంతకాలు చేశారు అని విమర్శించారు. దాంతో తెలంగాణాకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ ఒప్పుకున్నట్లు అయిందని అన్నారు. ఇలా తెలంగాణా ప్రజల గొంతు కోశారని ఆయన మండిపడ్డారు. ఈ రకమైన తప్పులు చేస్తే ఇతర దేశాలలో ఉరి శిక్ష వేస్తారని ప్రజా స్వామ్య దేశం కాబట్టి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని రేవంత్ రెడ్డి అనడం అల్టిమేట్ హాట్ కామెంట్స్ అని అంటున్నారు. హరీష్ రావు కేసీఆర్ ని ఉరి వేసినా తప్పు లేదని తాను అధారిటీ గా చెబుతున్నాను అని అనడం విశేషం. కసబ్ కి కూడా బిర్యానీ పెట్టి మరీ జైలులో ఉంచి ఉరి తీసిన దేశం మనదని అన్నారు.
కసబ్ తో పోలుస్తారా :
ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్రాన్ని తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ ని పట్టుకుని కసబ్ తో పోలుస్తారా ఉరి తీయమంటారా అని బీఆర్ ఎస్ నాయకుడు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు అసెంబ్లీకి వస్తే ఎంతో గౌరవంగా చూస్తామని చెప్పిన సీఎం ఇపుడు ఇంతలా తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నారని ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తనకు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బచావత్ ట్రిబ్యునల్ కి బ్రిజేష్ ట్రిబ్యునల్ కి మధ్య తేడా ఏంటో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని ఆయన కామెంట్స్ చేశారు. మొత్తం మీద కేసీఅర్ కనుక సభకు హాజరైతే కృష్ణా జలాల వివాదంతో అసెంబ్లీ దద్దరిల్లే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు.
