Begin typing your search above and press return to search.

''ఇదే కొన‌సాగితే.. టీడీపీని మూసేయాలి''..!

''ఇదే కొన‌సాగితే.. టీడీపీని మూసేయాలి''- తెలంగాణ టీడీపీ నేత‌ల నుంచి వినిపిస్తున్న మాట ఇది!. 2018 త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు దేశం పార్టీ తెలంగాణ‌లో యాక్టివ్ పాలిటిక్స్ చేయ‌డం లేదు.

By:  Garuda Media   |   11 Oct 2025 1:07 PM IST
ఇదే కొన‌సాగితే.. టీడీపీని మూసేయాలి..!
X

''ఇదే కొన‌సాగితే.. టీడీపీని మూసేయాలి''- తెలంగాణ టీడీపీ నేత‌ల నుంచి వినిపిస్తున్న మాట ఇది!. 2018 త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు దేశం పార్టీ తెలంగాణ‌లో యాక్టివ్ పాలిటిక్స్ చేయ‌డం లేదు. పైగా ఎప్ప‌టి క‌ప్పుడు.. ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకొంటోంది. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకొన్న పార్టీకి అప్ప‌ట్లో భారీ షాక్ త‌గిలింది. కీల‌క బీసీ నాయ‌కుడు, పార్టీ రాష్ట్ర చీఫ్ కాసాని జ్ఞానేశ్వ‌ర్ పార్టీని వ‌దిలి వెళ్లిపోయారు. త‌ర్వాత‌.. మ‌రికొంద‌రు కీల‌క నాయ‌కులు కూడా ప‌క్క‌దారి చూసుకున్నారు.

ఇక‌, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లోనూ పార్టీ పోటీ చేయ‌డం లేద‌ని తేల్చి చెప్పిన త‌ర్వాత‌.. మ‌రికొంద‌రు ఇదే బాట ప‌డుతున్నారు. ప‌లువురు నాయ‌కులు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. అంత‌ర్గ‌త చ‌ర్చ లు.. అధికార పార్టీ నేత‌ల‌తో వారు ట‌చ్‌లోకి వెళ్లిపోయారు. ఫ‌లితంగా టీడీపీలో ఇప్పుడు తెలంగాణ స‌మా జంలో చెప్పుకోద‌గ్గ నాయ‌కులు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం అయి నా.. ఉండేది. ఇప్పుడు అది కూడా క‌నిపించ‌డం లేద‌న్న చ‌ర్చ వినిపిస్తోంది.

ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట‌.. తెలంగాణ నుంచి టీడీపీ డెలిగేష‌న్ ఏపీకి వ‌చ్చి.. చంద్ర‌బాబుతో భేటీ అయింది. అయితే.. వీరిలో 80 శాతం మంది కొత్త‌ముఖాలే. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ముఖం చూసిన వారు కూడా కాద‌ని తెలిసి.. అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అంటే.. పాత నేతలు.. పార్టీని వ‌దిలి పెట్టి పోయారు. ఇక‌, ఇప్పుడైనా పార్టీ పుంజుకుంటుందా? అంటే.. క‌ష్ట‌మ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇత‌ర రాష్ట్రాల‌కు తెలంగాణ‌కు మ‌ధ్య వైరుధ్యం చాలానే ఉంది. ఎంత‌గా టీడీపీపై అభిమానం ఉన్నా.. ఇక్క‌డ నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో ట‌చ్‌లో ఉన్న పార్టీకే ప్ర‌జ‌లు క‌నెక్ట్ అవుతున్నారు.

ఇలా చూసుకుంటే.. 2018 త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ తెలంగాణ స‌మాజానికి క‌నెక్ట్ అయిందే లేదు. ఇక‌, ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకు సాగుతోంది. దీంతో ఇక‌, పార్టీ ఆఫీసులు మూసేయ‌డ‌మే బెట‌ర్ అన్న భావ‌న వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇది ఒక‌ర‌కంగా పార్టీకి పెద్ద విప‌త్తేన‌ని చెప్పాలి. గెలుస్తామా? ఓడు తామా? అనేది ప‌క్క‌న పెడితే.. అస‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్న‌ది కీల‌క‌మ‌ని నాయ‌కులు ఇటీవ‌ల స‌మావేశం చెప్పారు. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో టీడీపీపై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని కూడా అన్నారు. కానీ, దీనికి చంద్ర‌బాబు స‌సేమిరా అన్నారు. ఈ ప‌రిణామాల‌తోనే నాయ‌కులు ఇత‌ర పార్టీల్లోకి ముఖ్యంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.