Begin typing your search above and press return to search.

ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోస్.. నాగార్జున బిగ్ ప్లాన్

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.

By:  A.N.Kumar   |   8 Dec 2025 5:42 PM IST
ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోస్.. నాగార్జున బిగ్ ప్లాన్
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో సందడి చేశాడు టాలీవుడ్ హీరో నాగార్జున. ఈ గ్లోబల్ సమ్మిట్ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యూమెంట్ చాలా అద్భుతంగా ఉందని నాగార్జున కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’కి తమ అన్నపూర్ణ స్టూడియోస్ ను కూడా తీసుకురాబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు.

అలాగే ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఒకప్రత్యేకమైన ‘ఫిలిం హబ్’ను కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని నాగార్జున తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రణాళికలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కూడా చోటు కల్పించడం పట్ల హీరో నాగార్జున హర్షం వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీకి సినిమా షూటింగ్ లకు, నిర్మాణాలకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.

కొత్తగా ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోను నిర్మిస్తారా? లేకపోతే పూర్తిగా బంజారాహిల్స్ నుంచి తరలిస్తారా? అన్నది క్లారిటీ లేదు. అన్నపూర్ణ స్టూడియోను నిర్మించినప్పుడు అవి కొండలు, గుట్టలు. అతి కష్టం మీద నిర్మాణాలను పూర్తి చేశారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అత్యంత బిజీ ఏరియాల్లో ఒకటి. ఆ ల్యాండ్ వేల కోట్ల ఖరీదు చేస్తుంది.

ఇక హిల్ట్ పాలసీలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచర్ సిటీకి తరలించేలా ఏమైనా ఒప్పందం చేసుకుంటున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. హిల్ట్ పాలసీ ప్రకారం.. ప్రభుత్వం ఓ పర్పస్ కోసం కేటాయించిన భూములు అంటే ఫ్యాక్టరీ లేదా సినీ స్టూడియోలకు కేటాయించిన భూములు వాటికే వినియోగించాలి. ఇతర వాటికి అనుమతి లేదు. మల్టీ యూజ్ గా మారిస్తే.. శివారు ప్రాంతానికి స్టూడియో తరలించి అక్కడ రియల్ ఎస్టేట్, హోటల్స్ వంటివి చేసుకోవచ్చు. హీరో నాగార్జున మరి అన్నపూర్ణ స్టూడియోను తరలిస్తారా? మరో బ్రాంచి ని అక్కడ నెలకొల్పుతారా? అన్నది వేచిచూడాలి.