తెలంగాణ సత్తా చాటాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ అంటే.. కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీడలు సహా అనేక రంగాల్లోనూ తెలంగాణ జోరుగా ముందుకు సాగుతోందన్నారు.
By: Garuda Media | 14 Dec 2025 2:42 PM ISTతెలంగాణ అంటే.. కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీడలు సహా అనేక రంగాల్లోనూ తెలంగాణ జోరుగా ముందుకు సాగుతోందన్నారు. ప్రపంచానికి తెలంగాణ సత్తా చాటామని చెప్పారు. తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే శ్రేష్ఠత, తెలంగాణ అంటే ఆతిథ్యానికి మారు పేరుగా ప్రపంచానికి తెలియజేశామని చెప్పారు. తాజాగా ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ దిగ్గజం లియోనె ల్ మెస్సీ హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు.
ఫుట్‌బాల్ ఈవెంట్ ద్వారా.. తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో దూసుకుపోతోందన్న విషయాన్ని చాటి చెప్పామ న్నారు. ముఖ్యంగా తమ ఆహ్వానం మేరకు హైదరాబాద్కు వచ్చిన మెస్సీ సహా ఫుట్ బాల్ క్రీడాకారులను ఆయన అభినందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సత్తాను ప్రపంచానికి చాటేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని తెలిపారు.
మెస్సీ రాకపై..
మరోవైపు.. మెస్సీని ఇండియాకు తీసుకురావడంపై పలువురు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాక నేపథ్యంలో దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చుచేశారని తెలిపారు. కానీ, అదే 150 కోట్ల రూపాయలు కేటాయిస్తే.. ఫుట్ బాల్ క్రీడాకారులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే.. ఎంతో మంది మిస్సీలను తయారు చేయొచ్చని పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా మాజీ ఫుట్ బాల్ క్రీడాకారుడు రంజిత్ బాలాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
