కేసీఆర్ కింకర్తవ్యం: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!
తెలంగాణలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు... కొన్నాళ్ల కిందటి వరకు అధికారుల చుట్టూ తిరిగింది.
By: Garuda Media | 28 Nov 2025 2:00 AM ISTతెలంగాణలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు... కొన్నాళ్ల కిందటి వరకు అధికారుల చుట్టూ తిరిగింది. సీనియర్ ఐపీఎస్ అధికారులను పిలిచి విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తాజాగా మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ.. తమ విచారణను కొనసా గిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టు.. ``బీఆర్ ఎస్ సుప్రీం`` చుట్టూ ఇప్పుడు విచారణను కొనసాగిస్తున్నారు.
తాజాగా కేసీఆర్‌కు ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ)గా పనిచేసిన రాజశేఖరరెడ్డిని సిట్ అధికారు లు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 2 గంటల పాటు ఆయనను జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో విచారిం చిన అధికారులు అప్పట్లో ఏం జరిగింది? అనే విషయాన్ని కూపీ లాగినట్టు తెలుస్తోంది. ఇది అత్యంత కీలకమని సిట్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు కేసీఆర్ కేంద్రంగా విచారణ ముం దుకు సాగకపోయినా. ఇప్పుడు ఆయన పాత్రను నిగ్గుతేల్చే పనిలో అధికారులు ఉన్నారు.
ఇక, ఈ కేసు విషయంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం మరో విశే షం. గత రెండు రోజులుగా ఈ కేసును స్టడీ చేస్తున్న ఆయన.. గురువారం సంబంధిత అధికారులతో భేటీ అయి చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ తీరును ఆయన తెలుసుకున్నారు. మరింతలోతుగా విచారించేందుకు అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఓఎస్‌డీగా పనిచేసిన రాజశేఖరరెడ్డిని విచారణకు పిలవడం కేసు తీవ్రతను తెలియజేస్తోంది.
ఇక, రాజశేఖరరెడ్డి విచారణలో ఆయన చెప్పే విషయాలను బట్టి.. ఈ కేసులో కేసీఆర్‌ను సైతం విచారిం చేందుకు ప్రభుత్వాన్ని అధికారులు అనుమతి కోరుతూ నివేదిక పంపించే అవకాశం ఉందని అంటున్నా రు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులోనూ ఆయనను పిలుస్తారని.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే.. ఇదంతా రాజశేఖరరెడ్డి ఇచ్చే సమాచారం ఆధారంగానే జరగనుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
