పంచాయితీ ఫలితాలు: రెండో దశలోనూ దూకుడు కంటిన్యూ
తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం రెండో దశ పూర్తైంది.
By: Garuda Media | 15 Dec 2025 9:37 AM ISTతెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం రెండో దశ పూర్తైంది. మొదటి దశలో తన అధిక్యతను స్పష్టంగా ప్రదర్శించిన అధికార కాంగ్రెస్.. రెండో దశలోనూ అదే ఊపును కంటిన్యూ చేసింది. పార్టీ గుర్తులకు భిన్నంగా.. పార్టీ బలపర్చిన అభ్యర్థులు బరిలో నిలవటం తెలిసిందే. రెండో విడతో 85.86 శాతం పోలింగ్ నమోదైంది. తొలిదశతో పోలిస్తే.. రెండో దశ ఫలితాల్లో బీఆర్ఎస్ కొద్దిపాటి సీట్లు ఎక్కువగా లభించాయి.
ఉదాహరణకు తొలి విడతలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 2426 మంది విజయం సాధిస్తే.. బీఆర్ఎస్ 1155 మంది అభ్యర్థులు గెలిచారు. అదే రెండో దశ విషయానికి వస్తే.. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 2331 చోట్ల విజయం సాధిస్తే.. బీఆర్ఎస్ అభ్యర్థులు 1195 మంది గెలుపొందరాు. బీజేపీ సైతం మొదటి దశలో గెలిచిన వారి కంటే అధికంగా రెండో దశలో గెలవటం గమనార్హం. ఇదే తీరును సీపీఐ.. సీపీఎంలు ప్రదర్శించారు. ఆసక్తికరంగా మొదటి దశతో పోలిస్తే రెండో దశలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. తొలివిడత మొత్తంగా 4230 స్థానాలకు ఎన్నికలు జరిగితే.. రెండో దశలో 4332 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
రెండు దశల ఫలితాల్ని సమగ్రంగా విశ్లేషిస్తే.. కాంగ్రెస్ సగానికి పైగా సీట్లను సొంతం చేసుకోగా.. విపక్ష బీఆర్ఎస్ 25 శాతానికి పైగా సీట్లలో విజయం సాధించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ వెనుకబడగా.. ఒక్క సిద్దిపేట జిల్లాలో మాత్రం టాప్ గేరులో ఉండటం గమనార్హం. సిద్దిపేట జిల్లా మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తుండటం తెలిసిందే. అదే సమయంలో బీఆర్ఎస్ అగ్రనేత అయిన కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ తన అధిక్యతను ప్రదర్శించింది.
రెండో దశలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామంతో పాటు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఓట్ల లెక్కింపులో ఉత్కంట పోరు నెలకొన్న తొమ్మిది చోట్ల ఒక్క ఓటు తేడాతో అభ్యర్థులు విజయం సాధించారు. ఓటమిని భరించలేని ఒక అభ్యర్థి గుండెపోటుతో మరణించారు. అదే సమయంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మెదక్ జిల్లాలోని ఝూన్సీ లింగాపూర్ సర్పంచ్ స్థానానికి తండ్రీ కొడుకులు పోటీ పడగా.. కొడుకు మీద తండ్రి విజయం సాధించారు. తండ్రి కాంగ్రెస్ మద్దతుతో బరిలో దిగగా.. కొడుకు బీజేపీ మద్దతుతో బరిలో దిగారు.
మరో ఉదంతంలో అన్నాచెల్లెళ్లు పోటీ చేయగా.. సోదరి మీద అన్న విజయం సాధించాడు. ఈ ఉదంతం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పరిధిలో చోటు చేసుకుంది. ఇక.. అక్కాచెఅక్క ల్లెళ్లు పోటీ పడిన ఖమ్మం జిల్లా కొంగరలో చెల్లెలు మీద అక్క విజయం సాధించింది. జగిత్యాల జిల్లాలో కోడల మీద మామ విజయం సాధించారు. ఇలా పంచాయితీ ఎన్నికల కుటుంబ పంచాయితీలు పెద్ద ఎత్తున నమోదు కావటం గమనార్హం.
