పంచాయతీ పోరులో తెగిన నోట్ల కట్టలు!
అన్ని కోణాల్లోనూ ఎన్నికల బూతులపై దృష్టి పెట్టామన్నారు. ఎక్కడా ఓటర్లను ప్రభావితం కాకుండా .. చూస్తున్నామన్న రాణి కుముదిని.. ఇప్పటికే 100 కు పైగా కేసులు నమోదు చేశామన్నారు.
By: Garuda Media | 11 Dec 2025 5:00 AM ISTఎన్నికలు ఏవైనా నోట్ల కట్టలు తెగాల్సిందేనా? మద్యం సీసాల మూతలు తెరవాల్సిందేనా? అంటే.. ఔననే అంటున్నారు.. తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని. తాజాగా తెలంగాణలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం పెట్టారు. గురువారం తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. చిత్రంగా ఈ ఎన్నికల్లోనూ ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ చేశారన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై రాణి కుముదిని స్పందించారు.
``ఔను.. నగదు పంపిణీ చేశారో లేదో మాకు తెలియదు. కానీ, మా అధికారులు చేసిన తనిఖీల్లో మాత్రం దాదాపు 9 కోట్ల రూపాయలను మేం స్వాధీనం చేసుకున్నాం. మాకు తెలియకుండా.. కొన్ని గ్రామాల్లో నగదు పంపిణీ జరిగిపోయిందని వార్తలు వచ్చాయి. వాటిపై విచారణ చేస్తున్నాం. దీనిలో ఎన్నికల అధికారుల ఉదాశీనత ఏమీ లేదు.`` అని ఆమె వివరించారు. గురువారం జరగనున్న తొలివిడత పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
అన్ని కోణాల్లోనూ ఎన్నికల బూతులపై దృష్టి పెట్టామన్నారు. ఎక్కడా ఓటర్లను ప్రభావితం కాకుండా .. చూస్తున్నామన్న రాణి కుముదిని.. ఇప్పటికే 100 కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. ఇక, పలు గ్రామాల్లో ఏకగ్రీవం అయిందని చెప్పారు. దాదాపు 891 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయని.. అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. మిగిలిన గ్రామాల్లో మాత్రం ఎన్నికలు సజావుగా నిబంధనల మేరకు నిర్వహించనున్నట్టు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామన్నారు.
